పర్సనల్ లోన్ నుండి హోమ్ లోన్.. దాదాపు అన్ని బ్యాంకు రుణాలలో మీ క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే త్వరగా, తక్కువ వడ్డీ రేటుకు రుణాలు అందుతాయి. క్రెడిట్ స్కోర్ బాగా లేకుంటే వడ్డీ రేటు భారంగా మారుతుంది. క్రెడిట్ స్కోర్ అంట్ మీ రీపెమెంట్ సామర్థ్యాన్ని వెల్లడిస్తుంది. సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుండి 900 పాయింట్ల మధ్య ఉంటుంది. 750కి పైన సిబిల్ ఉంటే మంచి క్రెడిట్ స్కోర్‌గా బ్యాంకులు పరిగణిస్తాయి. బ్యాంకులతో పాటు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా అధిక క్రెడిట్ స్కోర్ ఉంటే ప్రాధాన్యత ఇస్తాయి. వడ్డీరేటును కూడా తక్కువకు అందిస్తాయి.

సిబిల్ పెంచుకోండి ఇలా
ప్రధానంగా మీరు ఆలస్యంగా చెల్లింపులు జరిపితే మీ సిబిల్ స్కోర్ తగ్గుతుంది. కాబట్టి మీ క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలు ఆలస్యం చేయకుండా గడువులోగా చెల్లించాలి.
నిపుణుల ప్రకారం అత్యవసరమైతే తప్ప మీరు మీ క్రెడిట్ కార్డు పరిమితిలో 15 శాతం నుండి 30 శాతం మాత్రమే ఉపయోగించాలి. మీరు మీ క్రెడిట్ పూర్తిగా నిత్యం వినియోగిస్తున్నారంటే మీరు ఆర్థిక క్రమశిక్షణ లేనివారిగా భావించవలసి ఉంటుంది. కాబట్టి అత్యధికంగా క్రెడిట్ కార్డు పైన ఆధారపడవద్దు. అలా అని ఉపయోగించకుండా ఉండవద్దు. దానిని పరిమితి మేర ఉపయోగించాలి.

ఎర్రర్స్ రిపోర్ట్
మీ సిబిల్ స్కోర్‌లో హఠాత్తుగా తగ్గపోతే మీ క్రెడిట్ రిపోర్టును చెక్ చేయాలి. ఏవైనా ఎర్రర్స్ ఉంటే రిపోర్ట్ చేయాలి. ఇది మీ సిబిల్ పెరగడానికి ఉపయోగపడుతుంది.
మీ క్రెడిట్ లిమిట్‌ను పెంచమని చెప్పడం ద్వారా కూడా మీ సిబిల్ స్కోర్‌ను వేగంగా పెంచుకోవచ్చు. మీ క్రెడిట్ లిమిట్ పెరిగితే మీ క్రెడిట్ కార్డు వినియోగ శాతం కూడా తగ్గవచ్చు. కాబట్టి అప్పుడు మీరు రుణాలు తీసుకోవడానికి ఎప్పుడు అర్రులు చాచడం లేదని అర్థమవుతుంది.
సెక్యూర్డ్, అన్-సెక్యూర్డ్ క్రెడిట్ బ్యాలెన్స్ బాగుంటే మీ సిబిల్ పెరుగుతుంది. ఒకే సమయంలో పలు క్రెడిట్ కార్డ్స్ కోసం దరఖాస్తు చేయడం సరికాదు. ఇది మీ సిబిల్ పైన ప్రభావం చూపుతుంది.

అలాంటివి క్లోజ్ చేయవద్దు
సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర మీ సిబిల్ స్కోర్‌ను పెంచుతుంది. మీకు మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే క్లోజ్ చేయవద్దు. మీ క్రెడిట్ కార్డ్స్ క్లోజ్ చేస్తే మంచి క్రెడిట్ హిస్టరీని కోల్పోతారు. ఇది మీ సిబిల్ పైన ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకర సిబిల్ స్కోర్ నిర్వహణ, సాధ్యమైనంత వరకు క్రెడిట్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవడం మంచిది.
మీ సిబిల్ స్కోర్ 750కి సమీపంలో ఉండకుంటే మీరు ఏదైనా రుణానికి దరఖాస్తు చేసుకోవడానికి వేచి ఉండటం మంచిది. మీ పెండింగ్ రుణాలు చెల్లించాలి. ఎలాంటి డ్యూస్ లేకుండా చూసుకోవాలి. ఎలాంటి పేమెంట్ డ్యూస్ లేకుంటే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఆలస్యంగా చెల్లింపులు జరిపితే మీ క్రెడిట్ నివేదిక పైన 7 ఏళ్ల పాటు ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications