ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ (Credit card) వాడకం ఒక అవసరంగా మారిపోయింది. సరైన సమయంలో షాపింగ్ చేయడానికి, రివార్డ్ పాయింట్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, డిస్కౌంట్ల కోసం మనం క్రెడిట్ కార్డులను ఎక్కువగా వాడుతుంటాం. పద్ధతిగా వాడితే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. కానీ, చిన్న తప్పు చేసినా ఇవి అత్యంత ఖరీదైన అప్పులుగా మారిపోతాయి. చాలా మందికి క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో వచ్చే రహస్య ఛార్జీల గురించి సరైన అవగాహన ఉండదు. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

అతిపెద్ద ఉచ్చు: మినిమం అమౌంట్ డ్యూ (Minimum Amount Due)
మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ రాగానే అందులో 'టోటల్ అమౌంట్ డ్యూ' , 'మినిమం అమౌంట్ డ్యూ' అని రెండు కనిపిస్తాయి. చాలా మంది తక్కువ మొత్తంలో ఉన్న మినిమం డ్యూ కడితే సరిపోతుందని అనుకుంటారు. కానీ ఇది ఒక పెద్ద ట్రాప్. మినిమం అమౌంట్ కడితే మీ కార్డుపై లేట్ ఫీజు పడదు, కానీ మిగిలిన బ్యాలెన్స్ పై బ్యాంకులు ఏటా 30% నుండి 40% వరకు భారీ వడ్డీని వసూలు చేస్తాయి. పైగా ఈ వడ్డీ ప్రతి నెలా చక్రవడ్డీలా పెరుగుతూ పోతుంది.
లేట్ పేమెంట్, క్రెడిట్ స్కోర్
ఒకవేళ మీరు నిర్ణీత గడువులోగా బిల్లు కట్టడం మర్చిపోతే, బ్యాంకులు భారీగా లేట్ ఫీజును విధిస్తాయి. ఇది కేవలం డబ్బుతో పోయేది కాదు. మీరు బిల్లు కట్టడంలో ఆలస్యం చేస్తున్నట్లు క్రెడిట్ బ్యూరోలకు సమాచారం అందుతుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. భవిష్యత్తులో మీరు హోమ్ లోన్ లేదా కార్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది.
క్రెడిట్ కార్డుతో నగదు విత్ డ్రా (Cash Withdrawal)
చాలా మంది డెబిట్ కార్డులాగే క్రెడిట్ కార్డును కూడా ఏటీఎంలలో పెట్టి డబ్బులు తీస్తుంటారు. ఇది చాలా ఖరీదైన పొరపాటు. క్రెడిట్ కార్డుతో నగదు తీసిన క్షణం నుండే వడ్డీ లెక్కించడం మొదలవుతుంది. దీనికి ఎలాంటి 'వడ్డీ లేని కాలపరిమితి' (Interest-free period) ఉండదు. దీనికి తోడు 'క్యాష్ అడ్వాన్స్ ఫీజు' కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర దాగి ఉన్న ఛార్జీలు..
క్రెడిట్ కార్డులపై మనం గమనించని మరికొన్ని ఖర్చులు ఇవే..
- ఫారిన్ ట్రాన్సాక్షన్ ఫీజు: మీరు విదేశాల్లో కార్డు వాడినా లేదా ఆన్‌లైన్ లో విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేసినా 2% నుండి 4% వరకు మార్కప్ ఫీజు పడుతుంది.
- వార్షిక రుసుము (Annual Fee): మొదటి ఏడాది ఉచితంగా ఇచ్చిన కార్డులకు, రెండో ఏడాది నుండి ఛార్జీలు పడతాయి. నిర్దేశించిన మొత్తం ఖర్చు చేయకపోతే ఈ భారం తప్పదు.
- GST: క్రెడిట్ కార్డ్ వడ్డీలు , అన్ని రకాల ఛార్జీలపై 18% GST అదనంగా వర్తిస్తుంది.
- ఓవర్ లిమిట్ ఫీజు: మీ కార్డు పరిమితికి మించి ఖర్చు చేసినప్పుడు బ్యాంకులు జరిమానా విధిస్తాయి.
సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి?
క్రెడిట్ కార్డ్ భారం కాకూడదంటే ప్రతి నెలా బిల్లు మొత్తాన్ని (Full Amount) గడువులోగా చెల్లించడం అలవాటు చేసుకోవాలి. కేవలం కనీస మొత్తం (Minimum) కడితే అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం బ్యాంకులు అన్ని ఛార్జీలను ముందే వివరించాలి. కాబట్టి కార్డు తీసుకునే ముందు నియమ నిబంధనలను ఒకసారి క్షుణ్ణంగా చదవండి. క్రెడిట్ కార్డులు మీకు క్రమశిక్షణ ఉంటే వరాలు.. లేదంటే భారాలు!
More From GoodReturns

దుబాయ్లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్‌పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications