మనం కష్టపడి సంపాదించిన డబ్బులో ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా చూసుకోవాలనుకుంటాం. కానీ రోజుకు రూ.10, వారానికి రూ.50, నెలకి రూ.100 ఇలా మనకు తెలియకుండానే కొన్ని చిన్న చిన్న ఛార్జీలు, మన జేబు నుంచి డబ్బును నెమ్మదిగా లాగేస్తుంటాయి. ఇవి చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ మనం పట్టించుకోకపోతే, ఏడాది చివరికి ఈ ఛార్జీలు వందల కాదు వేల రూపాయల వరకూ పోతాయి.
ఈ తరహా హిడెన్ ఛార్జీలు, మీరు రోజు ఉపయోగించే క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్, ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా మీ డబ్బును ఎలా తినేస్తున్నాయో వేటి మీద ఈ ఛార్జీలను వేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డ్ ఛార్జీలు
క్రెడిట్ కార్డులు వాడటం సౌకర్యంగా అనిపించవచ్చు, కానీ వాటి వెనక దాగి ఉన్న ఛార్జీలు మన జేబుపై ఊహించని భారం వేసే అవకాశముంది. ఉదాహరణకు, కొన్నసార్లు మనం పెద్ధమొత్తంలో ఖర్చు చేసిన కొనుగోళ్లను ఈఎంఐలోకి మార్చినప్పుడు మన మీద EMI కన్వర్షన్ ఫీజులు, లేట్ పేమెంట్ పెనాల్టీలు, EMI మీద కన్వర్ట్ చేసిన వడ్డీ, విదేశాల్లో లేదా విదేశీ వెబ్‌సైట్లలో కొనుగోలు చేసినప్పుడు వచ్చే ఫారెక్స్ మార్‌కప్ ఛార్జీలు ఇవన్నీ గమనించలేనంతగా ఉంటాయి. చాలామంది వినియోగదారులు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను పూర్తిగా చదవరు. కానీ ఒకసారి భారీ బిల్లు వచ్చినప్పుడు గానీ, అసలు ఈ ఛార్జీల గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. ఈసారి మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ ని ఒక్కసారి చూసి ఎలాంటి ఛార్జీల వల్ల మీ డబ్బు పోతుందో గమనించండి.
బ్యాంకు ఖాతాలు & ATM ఛార్జీలు
మనం చాలా సేవలు ఉచితం అని భావిస్తాం - ఉదాహరణకు బ్యాలెన్స్ SMS, ATM విత్‌డ్రావల్స్, చెక్క్‌బుక్‌లు వంటివి. కానీ బ్యాంకులు చాలా సందర్భాల్లోవీటి కోసం చిన్నచిన్న ఫీజులు లేదా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. మీరు నెలలో బ్యాంక్ విధించిన దానికంటే ఎక్కువ సార్లు ATM నుంచి నగదు తీసుకుంటే అదనపు ఛార్జ్ లను కట్టాల్సి వస్తుంది. అలాగే మీ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే కూడా జరిమానాని కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపితే, ఒక ఏడాదికి రూ.1,000 నుంచి రూ.2,000 వరకూ వ్యయం అవుతుంది.
ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు
ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు మొదట్లో ఉచితంగా లేదా చాలా తక్కువ ఫీజుతో లభిస్తున్నట్టు కనిపిస్తాయి. కానీ కొన్నింటి వెనక ప్లాట్‌ఫారమ్ ఫీజులు, సలహా ఫీజు, లేదా హిడెన్ కమిషన్ లు దాగి ఉంటాయి. ఇవి ఏకంగా అర్థం కాని భాషలో కనిపిస్తూ ఉంటాయి అందువల్ల ఈ ఛార్జీలు కనిపించవు. కొంతమంది యాప్స్, తమకే లాభంగా ఉండే ఒకే విధమైన ఫండ్లను ప్రోత్సహించి, మీకు సరైన మార్గదర్శనం ఇవ్వకుండా కమిషన్ల ద్వారా ఆదాయం పొందతాయి. దీని ఫలితంగా మీరు ఎక్కువ ఖర్చు చేయడమే కాకుండా, తక్కువ రిటర్న్స్ పొందే అవకాశం కూడా పెరుగుతుంది.
ఇన్షూరెన్స్ రైడర్లు
పాలసీకి అదనంగా తీసుకునే రైడర్లు(యాక్సిడెంట్ కవర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు, ప్రీమియం మాఫీ రైడర్) వంటి అదనపు రైడర్లు ఉపయోగకరంగా అనిపించవచ్చు. ఈ రైడర్ల కోసం మీరు ప్రతి ఏడాది అదనంగా డబ్బు చెల్లిస్తు ఉంటారు . కానీ వీటిపై అధిక ఛార్జీలను వసూలు చేస్తుంటారు. అది మొదట్లో తెలుసుకోకపోవచ్చు కానీ పాలసీ రిన్యువల్ టైమ్ వచ్చే వరకు పెద్ద మొత్తంగా కనిపించచ్చు. ఇలా నెమ్మదిగా ఈ ఖర్చు పెరిగిపోతూ, మీ మొత్తం బీమా ఖర్చు మీద భారంగా మారుతుంది.
మ్యూచువల్ ఫండ్
మీరు పెట్టుబడిగా వేసిన మ్యూచువల్ ఫండ్‌లో మీరు ఎంచుకున్న రెగ్యులర్ ప్లాన్‌లు, డైరెక్ట్ ప్లాన్‌లతో పోలిస్తే 1-2% అదనపు ఖర్చులు వేస్తుంటారు. ఇవి మొదట్లో తక్కువగా కనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంగా చూస్తే మీ మొత్తం రాబడిని అనూహ్యంగా తగ్గించేస్తాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ అదనపు ఖర్చులకు మీరు ఎటువంటి అదనపు సేవలు లేదా మెరుగైన ఫలితాలు పొందకపోవచ్చు అంటే, ఖర్చు పెరిగినంత ప్రయోజనం ఉండకపోవచ్చు.
డీమాట్ & ట్రేడింగ్ ఖాతా ఛార్జీలు
మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఓపెన్ చేసిన డీమాట్ లేదా ట్రేడింగ్ ఖాతాలు చాలాసార్లు మీరు ఉపయోగించకపోయినా కూడా వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు (AMC), కస్టోడియన్ ఫీజులు, కనీస ట్రేడింగ్ నిబంధనలు వంటి ఖర్చులు మీపై పడతాయి. మీరు ఒక్క ట్రేడ్ కూడా చేయకుండా ఖాతాను అలాగే ఉంచినా, కొన్ని సంస్థలు దానికి కూడా పెనాల్టీలు వసూలు చేస్తాయి. చాలా మంది పెట్టుబడిదారులు తమ దగ్గర రెండు లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలు ఉంచూకుంటారు - వాటిని ఉపయోగించకపోతే వార్షికంగా రూ.1000-2000ల వరకూ నష్టపోవచ్చు.
ఇవన్నీ కలిపి చూసుకుంటే, ఈ హిడెన్ ఛార్జీలు మాత్రం నిశబ్దంగా మీ ఆదాయాన్ని తినేస్తున్నాయ్. ఇప్పుడు వాటిని గుర్తించడానికి, వాటి నుంచి తప్పించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications