High Interest FD: ఈ 10 బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే కొండంత వడ్డీ.. డబ్బులు సేఫ్ బ్రదర్స్..
Fixed Deposits: దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా కాలంగా కొనసాగుతున్న ఒడిదొడుకులతో చాలా మంది ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న డబ్బును సరైన సమయం వచ్చే వరకు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పార్క్ చేస్తున్నారు. దీనికి తోడు నిరంతరాయంగా బయట కొనసాగుతున్న మోసాలతో చాలా మంది ప్రజలు సురక్షితంగా డబ్బును ఉంచటానికి బ్యాంక్ ఎఫ్‌డి లను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న బ్యాంకుల వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఇన్వెస్టర్లు విరివిగా వినియోగించాలని చూస్తున్నారు. ఇవి నిర్థిష్ట గడువు కోసం డబ్బును పార్క్ చేయటం ద్వారా పెట్టుబడిదారులకు సురక్షితమైన రాబడిని అందిస్తాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రభుత్వ-ప్రైవేటు యాజమాన్యంలోని బ్యాంకులు అద్భుతమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకులు తమ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అదనపు వడ్డీని కూడా అందిస్తూ ఆకట్టుకుంటున్న 10 బ్యాంకులు, వాటి వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా ప్రైవేటు బ్యాంకింగ్ రంగానికి చెందిన DCB బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు ఏడాది కాలానికి చేసి ఎఫ్‌డిపై 7.25% వడ్డీని, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.75% వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇదే క్రమంలో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఒక సంవత్సరం FDపై సాధారణ కస్టమర్లకు 7.25%, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.75% వడ్డీని ఇస్తోంది. ఇది క్రమంలో ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంక్ ఏడాది కాలానికి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 7 శాతం వడ్డీతో పాటు సీనియర్ సిటిజన్ వినియోగదారులకు 7.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇక ఇదే క్రమంలో అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంకింగ్ సంస్థగా కర్ణాటక బ్యాంక్ కూడా చోటు దక్కించుకుంది. ఇది ఏడాది కాలానికి సాధారణ కస్టమర్లకు 7 శాతంతో పాటు సీనియర్లకు 7.40 శాతం వడ్డీ చెల్లిస్తోంది.
7 శాతం వరకు వడ్డీ ఆఫర్ ఇక్కడే..
ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ డ్యుయిష్ బ్యాంక్ తన సాధారణ-సీనియర్ సిటిజన్ కస్టమర్లకు సంవత్సరం FDపై 7% వడ్డీనే అందిస్తోంది. ఇక RBL బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 7% వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని ఏడాది కాలానికి చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. పబ్లిక్ సెక్టార్ కంపెనీ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సాధారణ కస్టమర్లకు ఏడాది FDపై 7% వడ్డీతో పాటు సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.50% వడ్డీని ప్రస్తుత సమయంలో అందిస్తోంది.
ఇక పెట్టుబడిదారులకు రీజనబుల్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్న బ్యాంకింగ్ సంస్థల జాబితాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సాధారణ కస్టమర్లకు ఏడాది FDపై 6.80%, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.30% వడ్డీని అందుబాటులో ఉంచింది. ఇదే క్రమంలో మరో పెద్ద బ్యాంకింగ్ కంపెనీ బ్యాంక్ ఆఫ్ బరోడా తన సాధారణ కస్టమర్లకు సంవత్సరం FDపై 6.75% వడ్డీతో పాటు సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.25% వడ్డీ రేటును ప్రకటించింది. ఇక అత్యధికంగా వడ్డీని ఆఫర్ చేస్తున్న కంపెనీల్లో చివరి స్థానంలో నిలిచిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ కస్టమర్లకు 6.75% వడ్డీని సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.25% వడ్డీని అందిస్తూ ప్రజల నుంచి భారీగా డిపాజిట్లను ఆకర్షిస్తున్నాయి.


Click it and Unblock the Notifications