Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకులు ఇవే..!
అక్టోబర్ 2026లో సీనియర్ సిటిజన్లు 8.50 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పొందవచ్చు. పైసా బజార్ ప్రకారం ఈ రేట్లు రూ.3 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి. జాబితాలోని బ్యాంకులలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అత్యధిక గరిష్ట రేట్లను అందిస్తున్నాయి. ఈక్విటాస్, ఈఎస్ఏఎఫ్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఒక్కొక్కటి గరిష్టంగా 8.50 శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఈ గరిష్ట రేటు ప్రతి డిపాజిట్ కాలానికి వర్తించదు. సూర్యోదయ ఐదేళ్ల కాలానికి 8.50 శాతం అందిస్తుండగా మూడేళ్ల కాలానికి 7.40% అందిస్తోంది. ఈక్విటాస్ 1, 3 సంవత్సరాలకు 7.60 శాతం వడ్డీ రేట్లు అందిస్తోన్నాయి. 5 సంవత్సరాలకు 7.50 శాతం వడ్డీ రేట్లు చెల్లిస్తోంది.
ఈఎస్ఏఎఫ్ మూడేళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై 6.50% అందిస్తుండగా, ఐదేళ్లకు ఇది 6.25 శాతం వడ్డీ రేట్లు అందిస్తోంది. ఒక సంవత్సరం డిపాజిట్ల విషయంలో జాబితాలోని బ్యాంకులలో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8%తో అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత ఉజ్జీవన్ 7.75%తో ఉంది. క్యాపిటల్ 7.6 శాతం, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.50% అందిస్తోంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడు సంవత్సరాలకు 8.30 శాతం వడ్డీ, ఐదు సంవత్సరాలకు 7.77 శాతం రేట్లను అందిస్తోంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడు సంవత్సరాలకు 7.90 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8 శాతం వడ్డీ అందిస్తోంది.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడు సంవత్సరాలకు 7.75 శాతం, ఐదు సంవత్సరాలకు 7.70 శాతం వడ్డీ రేట్లు చెల్లిస్తోంది. ప్రైవేట్ బ్యాంకులలో ఎస్‌బిఎం బ్యాంక్ అత్యధిక గరిష్ట రేటు 8.15 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఒక సంవత్సరం, మూడు సంవత్సరాల రేట్లు 7.60శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఐదు సంవత్సరాల కాలపరిమితి గల ఎఫ్డీ పై 7.50 శాతం వడ్డీ అందిస్తోంది. డిసిబి బ్యాంక్ ఐదు సంవత్సరాల డిపాజిట్లపై గరిష్టంగా 8% రేటును చెల్లిస్తోంది. ఒక సంవత్సరం ఎఫ్డీ 7.15 శాతం ఆఫర్ చేస్తోంది. మూడు సంవత్సరాల డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. బంధన్ బ్యాంక్ గరిష్ట రేటు 7.95 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇది ఒక సంవత్సరానికి 7.50 శాతం, మూడు సంవత్సరాలకు 7.75% అందిస్తుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధిక గరిష్టంగా 7.45 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు సంవత్సరాల డిపాజిట్లకు 7.05 శాతం వడ్డీ చెల్లిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఐదు సంవత్సరాలకు 6.90% అందిస్తుంది. కెనరా బ్యాంక్ పేర్కొన్న మూడు కాలపరిమితులలో 6.75% అందిస్తుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం 7 శాతం వడ్డీ అందిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మూడు సంవత్సరాలకు 6.80 శాతం, ఐదు సంవత్సరాలకు 6.60% వడ్డీ చెల్లిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
