HDFC Bank: ప్రముఖ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ పెన్నాంట్ టెక్నాలజీస్ తమ తదుపరి కార్యాచరణకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. భారతదేశంలోని ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు అయిన హెచ్‍డీఎఫ్‍సీలో పెన్నాంట్ భవిష్యత్ కార్యాచరణ లెండింగ్ ప్లాట్ఫార్మ్ పెన్ యాప్స్ లెండింగ్ ఫ్యాక్టరీని విజయవంతంగా ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ వేదిక ద్వారా హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంకు సంబంధ రుణాల కార్యాచరణ మరింత సులభతరం కానుంది. రుణాల పద్ధతికి ఇది సరికొత్త ఉత్తేజాన్ని నింపనుంది.
రుణ సదుపాయాల విషయంలో హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంకు తమ వినియోగదారులకు మరింత చేరువయ్యేలా ఈ సరికొత్త యాప్ ను ప్రవేశపెట్టారు. క్విక్ లోన్ డిస్బర్సల్, తిరిగి చెల్లింపులు పొందే సౌకర్యం వంటివి ఇందులో కల్పించారు. ఈ లెండింగ్ ప్లాట్ఫార్మ్ అధునాతన లోన్ సామర్థ్యాలను పరిచయం చేస్తోంది. సేఫ్టీ అండ్ స్కేలబుల్ కంటైనరైజేషన్ స్టాక్, గొప్ప కార్యాచరణ కాంపొనెంట్లను కలిగి ఉంది.

ఈ సందర్భంగా హెచ్‍డీఎఫ్‍సీ టెక్ & డిజిటల్- లోన్స్ అండ్ లయబిలిటీస్ హెడ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు రాజేష్ చవాన్ మాట్లాడుతూ "హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంకు అధునాతన సాంకేతికత సాయంతో బ్యాంక్ ఆఫ్ ది ఫ్యూచర్ గా నిలవాలని ప్రయత్నిస్తోంది. మా సంస్థ రుణ కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు పెన్నాంట్ సంస్థ కీలకంగా వ్యవహరిస్తోంది. వినియోగదారుల అవసరాలను డిజిటలైజ్ చేసేందుకు సాయం చేస్తోంది. చాలా సమయం తీసుకుని మాన్యువల్ గా చేయాల్సిన పనులు ఇప్పుడు సులభంగా డిజిటల్ గానే చేసుకునేలా పెన్నాంట్ కృషి చేయడం హర్షనీయం. భవిష్యత్తుకు మరింత గట్టిగా పునాదులు వేసేందుకు ఇది మరో అడుగుగా భావిస్తున్నా." అని అన్నారు.
అత్యాధునిక ఇన్సులేషన్ లేయర్ ను కలిగి ఉన్న పెన్నాంట్ లెండింగ్ వ్యవస్థ.. చెల్లింపులు, రుణ సాయం మొదలైన పూర్తి స్థాయి బ్యాంకు సేవలకు సాంకేతికను అనుసంధానం చేసి పనులను సులభంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా చేయనుంది. డేటా అనువాదం, రూటింగ్, భద్రత, అంతరాయం లేని కమ్యూనికేషన్ మరియు స్కేలబుల్ ఇంటిగ్రేషన్ వంటి సేవలను అందించనుంది. కొత్త ఛానల్స్ లేదా అప్లికేషన్లను త్వరిగతిన ఇంటిగ్రేట్ చేయడం, కార్యకలాపాల క్రమబద్ధీకరణ, క్రిటికల్ సర్వీసులకు ఎలాంటి అంతరాయం లేకుండా స్కేల్ చేయడం వంటి వెసులుబాటును బ్యాంకుకు కల్పించనుంది.
ఈ సందర్భంగా పెన్నాంట్ టెక్నాలజీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎండీ ప్రదీప్ వర్మ మాట్లాడుతూ "హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంకు రూపాంతరం చెందడంలో, వారి బిజినెస్ కస్టమర్లకు మరింత చేయూత నివ్వడంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థ రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో సాంకేతికత సాయంతో మరిన్ని సేవలను సులభతరం చేయడం చాలా ముఖ్యం. మా పెన్నాంట్ సంస్థ రుణ సాయం, అంతరాయంలేని సేవలు, వినియోగదారుల పనులు సులభతరం చేయడం, డిజిటైజేషన్, నవకల్పనలకు దిట్ట" అని అన్నారు.
పెన్నాంట్ లెండింగ్ ఫ్యాక్టరీ ప్లాట్ఫార్మ్ భవిష్యత్తు కార్యాచరణ సాంకేతికత మరియు ప్రత్యేక ఫ్యాక్టరీ బేస్డ్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఆర్థిక సంస్థలు కొత్త రుణ ఉత్పత్తుల కోసం మార్కెట్లను వేగవంతం చేయడంలో, కార్యాచరణ చురుకుదనం పెంచడంలో, అంతరాయంలేని సేవలు అందించడంలో ఇది సహాయ పడుతుంది. ప్రపంచంలోని ఎన్నో సంస్థల ఆర్థిక కార్యకలాపాలకు, సవాళ్లను ఎదురుకోవడానికి ఈ ప్లాట్ఫార్మ్ సహాయపడుతోంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications