మూడో కంపెనీగా.. HDFC బ్యాంకు సరికొత్త రికార్డ్: హెచ్‌డీఎఫ్‌సీ షేర్ టార్గెట్ ఎంతంటే?
ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు షేర్ నేడు (ఫిబ్రవరి 25) రికార్డ్‌స్థాయికి చేరుకుంది. దీంతో ఆ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9 లక్షలకోట్లకు చేరుకుంది. మెరుగైన నికర వడ్డీ మార్జిన్లు, అధిక వడ్డీయేతర ఆదాయం, స్థిరమైన ఆస్తి నాణ్యతతో డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు బ్యాంకు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉంది. దీంతో బ్యాంకు షేర్లు మంచి పెరుగుదలను నమోదు చేశాయి. బీఎస్ఈలో బ్యాంకు షేర్లు రికార్డ్ స్థాయిలో రూ.1,635ను తాకింది. దీంతో ఈ బ్యాంకు మార్కెట్ క్యాప్ గురువారం రూ.9 లక్షల కోట్లను దాటింది.

దేశంలో మూడో సంస్థ
మధ్యాహ్నం గం.2.30 సమయానికి HDFC బ్యాంకు షేర్ 1 శాతం కంటే ఎక్కువ ఎగిసి ధర రూ.1,623 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం ఓ సమయంలో రూ.1632ను క్రాస్ చేసింది. ఉదయం ట్రేడింగ్ రూ.1630 వద్ద ప్రారంభించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు HDFC బ్యాంకు షేర్ దాదాపు 14 శాతం ఎగిసింది. భారత్‌లో రూ.9 లక్షల మార్కెట్ క్యాప్ దాటిన మూడో కంపెనీ HDFC బ్యాంకు. ఇంతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ మార్కు దాటింది. ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.13 లక్షల కోట్లు దాటగా, టీసీఎస్ ఎం-క్యాప్ రూ.12 లక్షలకోట్లకు సమీపంలో ఉంది.

టాప్ 3 కంపెనీల ఎం-క్యాప్
నిన్నటి వరకు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1309443.18 కోట్ల సంపదతో మొదటి స్థానంలో ఉంది. టీసీఎస్ రూ.1091738.02 కోట్లతో రెండో స్థానంలో ఉంది. HDFC బ్యాంకు ఎం-క్యాప్ నిన్నటి వరకు రూ.885175.32 లక్షల కోట్ల వద్ద ఉంది. నేడు రిలయన్స్ ఎం-క్యాప్ రూ.13.25 లక్షల కోట్లు, టీసీఎస్ రూ.11.17 లక్షల కోట్లు కాగా, HDFC ఎం-క్యాప్ రూ.9.1 లక్షల కోట్లుగా నమోదయింది.

HDFC టార్గెట్ ధర..
HDFC, HDFC షేర్ ధర ఇటీవల భారీగా లాభపడింది. ఈ రెండింటి షేర్లు మరింత కాలం దూకుడుగా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో కరోనా పరిస్థితులు క్రమంగా తగ్గి, హౌసింగ్ రికవరీ పెరుగుతోందని, ఈ నేపథ్యంలో ప్రయివేటు దిగ్గజం HDFC, HDFC బ్యాంకు స్టాక్స్ మరింత పరుగు పెట్టవచ్చునని అంటున్నారు. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (HDFC) షేర్ బై-టార్గెట్‌ను జెఫిరీస్ రూ.3340గా పేర్కొంది.


Click it and Unblock the Notifications