ప్రయివేటురంగ దిగ్గజం HDFC తన ప్రామాణిక రుణ రేటును 5 లేదా 0.05 శాతం బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో ఇప్పటికే ఉన్న రుణ గ్రహీతలకు ఈఎంఐలు భారం కానున్నాయి. హోమ్ లోన్స్ పైన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును ఈ నెల 1 నుండి 5 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త రుణ గ్రహీతలకు అందించే రుణ రేట్లను మాత్రం యథావిధిగా 6.7 శాతం నుండి 7.15 శాతం మధ్య కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాకు దిగ్గజం ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే ఎంసీఎల్ఆర్‌ను పెంచాయి.

మే 1 నుండి అమల్లోకి...
HDFC పెంచిన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు(RPLR) రుణ రేటు మే 1వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. తక్షణం వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయని HDFC ఆదివారం ప్రకటించింది. HDFC హోమ్ లోన్ల పైన వడ్డీ రేట్లు ఆర్‌పీఎల్‌ఆర్‌కు అనుగుణంగా సర్దుబాటు చేస్తారు. అయినప్పటికీ సిబిల్ స్కోర్ 750 పాయింట్ల పైగా ఉన్న కస్టమర్లకు 6.70 శాతం వడ్డీ రేటుపై HDFC ఇంటి రుణాలు మంజూరు చేస్తుంది. ఇప్పుడు ఈ వడ్డీ రేటు 6.75కు పెరిగింది.

ఎంత తీసుకుంటే ఎంత?
రూ.30 లక్షల లోపు రుణాలు తీసుకుంటే వడ్డీ రేటు 6.80 శాతం నుండి 6.85 శాతానికి, రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు రుణం తీసుకుంటే వడ్డీ రేటు 7.05 శాతం నుండి 7.10 శాతం వరకు, రూ.75 లక్షలకు పైన రుణాలు తీసుకుంటే వడ్డీ రేటు 7.15 శాతం నుండి 7.20 శాతానికి పెరిగింది. అన్ని సెగ్మెంట్‌లలోను మహిళా కస్టమర్లకు 5 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంటుంది.
అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్ (ARHL) కూడా ఫ్లోటింగ్ లేదా వేరియేబుల్ రేటు రుణం.

అన్ని బ్యాంకులు కూడా
ఎస్బీఐ గత నెల 15వ తేదీ నుండి 10 పాయింట్ల ఎంసీఎల్ఆర్, యాక్సిస్ బ్యాంకు ఐదు బేసిస్ పాయింట్లు, కొటక్ మహీంద్రా బ్యాంకు ఐదు బేసిస్ పాయింట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఐదు బేసిస్ పాయింట్లు ఎంసీఎల్ఆర్‌ను పెంచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు ఏప్రిల్ 12వ తేదీ నుండి, కొటక్ మహీంద్రా వడ్డీ రేట్లు ఏప్రిల్ 16 నుండి అమల్లోకి వచ్చాయి. కరోనా నేపథ్యంలో ఇటీవలి వరకు వడ్డీ రేట్లు ఆల్ టైమ్ కనిష్టం 6.5 శాతం వద్ద కూడా కనిపించాయి. ఆర్థిక రికవరీ నేపథ్యంలో వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications