హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, జూలై 1 నుంచి జరిగే మార్పులు తెలుసుకోండి

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు వాడటం సర్వసాధారణమైపోయింది. ప్రతి చిన్న పనికి క్రెడిట్ కార్డు వాడుతుంటారు.. బిల్లు నెలకు ఓ సారి వస్తుండటంతో జీతం వచ్చాక బిల్ పే చేసుకోవచ్చే ధీమాతో అందరూ కార్డు వాడుతుంటారు. అయితే ఇప్పుడు ఛార్జీ మోత మోగనుంది. ముఖ్యంగా హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవారికి బిగ్ అలర్ట్ న్యూస్ వచ్చింది. ఇకపై ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవారికి ఛార్జీల బాదుడు ఉండనుంది. కొత్తగా బ్యాంకు అమల్లోకి తీసుకువచ్చిన నియమాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

కొత్తగా వచ్చిన నిబంధనలు ప్రకారం కార్డు వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సీ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఆన్‌లైన్ గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు చేస్తే ఛార్జీలు ఎక్కువగా పడనున్నాయి. పైగా వీటికి రివార్డ్ పాయింట్స్ కూడా రావు. కాబట్టి ఈ ఛార్జీలు మీ నెలవారీ ఖర్చులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కార్డు వాడే విషయంలో ఆచితూచి అడుగులు వేయకుంటే మీ జేబులకు చిల్లలు పడటం ఖాయం.

HDFC Bank credit card charges July 2025 HDFC credit card wallet loading fees utility bill payment charges HDFC online gaming charges HDFC card HDFC Bank new credit card rules credit card changes India July 1 HDFC Bank card fees update HDFC credit card surcharge July wallet top-up charges HDFC HDFC credit card policy change 2025 1 HDFC 2025 2025 HDFC HDFC

హెచ్‌డిఎఫ్‌సీ క్రెడిట్ కార్డు కొత్త మార్పులు ఏంటంటే.. మీరు ఆన్‌లైన్ గేమింగ్లో కార్డు ఉపయోగిస్తే 1 శాతం ఫీజు ఉంటుంది. డ్రీమ్ 11, రమ్మీ కల్చర్, జంగిల్ గేమ్స్, MPL వంటి వాటిల్లో కార్డు ఉపయోగిస్తే..ఫీజు ఉంటుంది. నెలకు వీటిల్లో రూ. 10 వేల పైన ఖర్చు చేస్తే 1 శాతం ఫీజు వసూలు చేస్తారు. ఇది 4,999 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ లావాదేవీలకు రివార్డ్ పాయింట్లు లభించవు.

వాలెట్ లోడింగ్ : మీరు మీ కార్డు ఉపయోగించి పేటీఎం (PayTM), మొబీక్విక్‌ (Mobikwik), ఫ్రీఛార్జ్, ఓలా మనీ డిజిటల్ వాలెట్లలో రూ.10,000 కంటే ఎక్కువ చేస్తే 1% ఫీజు ఉంటుంది. ఇది రూ.4,999 వరకు ఉండే అవకాశం ఉంటుంది.

యుటిలిటీ బిల్లులు: ఈ సెక్షన్ కింద హెచ్‌డిఎఫ్‌సీ వినియోగదారుల కార్డులకు రూ.50,000, బిజినెస్ కార్డులకు రూ.75,000 దాటితే 1% ఫీజు వసూలు చేస్తుంది. ఈ ఫీజు రూ.4,999 వరకు ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇన్సూరెన్స్ చెల్లింపులకు ఎలాంటి ఫీజు ఉండదని బ్యాంక్ స్పష్టం చేసింది.

లావాదేవీలు:ఇక మీరు డిజిటల్ వ్యాలెట్ ఉపయోగించి రెంట్, ఫ్యూయల్, ఎడ్యుకేషన్ చెల్లింపులు చేస్తే గరిష్టంగా రూ.4,999 ఫీజు ఉంటుంది.అయితే ఫ్యూయల్ కు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. రూ.15,000 లేదా రూ.30,000 దాటితే మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది.ఇక స్కూలుకు సంబంధించి ఏదైనా లావాదేవీలు జరిపితే ఎటువంటి ఛార్జీలు ఉండవు. అయితే అది స్కూలుకు సంబంధించిన వాటిల్లో మాత్రమే లావాదేవీలు జరపాలి. డిజిటల్ వ్యాలెట్ ద్వారా జరిపితే ఛార్జీలు వర్తిస్తాయి.

ఇన్సూరెన్స్ లావాదేవీలు: ఈ లావాదేవీలకు రివార్డ్ పాయింట్లు లభిస్తాయి కానీ మీరు వాడే కార్డు రకాన్ని బట్టి దీనికి కూడా పరిమితి ఉంటుంది. ఇన్ఫీనియా, ఇన్ఫీనియా మెటల్‌ కార్డులకు రూ.10 వేలు, డైనర్స్‌ బ్లాక్‌, డైనర్స్‌ బ్లాక్‌ మెటల్‌, బిజ్‌ బ్లాక్‌ మెటల్‌, కార్డులకు రూ.5 వేలు, మిగిలిన కార్డులకు రూ.రెండు వేలు నెలవారీ లిమిట్ ఉంటుందని కంపెనీ తెలిపింది.

మీ జేబులకు చిల్లులు పడకుండా ఉండాలంటే మీరు వీలైనంత వరకు కార్డుల వాడకం తగ్గించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాడితే గడువు లోపు చెల్లించేలా ప్లాన్ చేసుకోండి. తద్వారా ఛార్జీల బాధ నుండి తప్పించుకునే అవకాశం ఉంది. అలాగే రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లపై కన్నేయడం మర్చిపోకండి.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+