'సీనియర్ల'కు గుడ్‌న్యూస్, జూన్ 30 వరకు HDFC ప్రత్యేక డిపాజిట్ స్కీం
ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకు వచ్చిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంను జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ స్కీంను ఇలా పొడిగించడం ఇది మూడోసారి. సీనియర్ సిటిజన్ కేర్ FD స్కీంను మే 2020న లాంచ్ చేసింది ఈ ప్రయివేటురంగ దిగ్గజం. కరోనా మహమ్మారి నేపథ్యంలో వడ్డీరేట్లు భారీగా పడిపోతున్న సమయంలో దీనిని తీసుకువచ్చింది. ఈ స్పెషల్ FD స్కీం పైన సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ స్కీం కింద అదనంగా 75 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును అందిస్తోంది. FDలపై 6.25 శాతంగా ఉంది.

సీనియర్ సిటిజన్ కేర్ FD వడ్డీ రేటు
HDFC బ్యాంకు సీనియర్ సిటిజన్ కేర్ FD ఇంటరెస్ట్ రేట్ స్కీం కింది డిపాజిట్స్ పైన 75 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ రేటు చెల్లిస్తోంది. ఈ స్కీం కింద ఉన్న వడ్డీ రేటు 6.25 శాతం కాగా, ఇవి నవంబర్ 13, 2020 నుండి అమలులోకి వచ్చాయి. అయిదేళ్ల నుండి పదేళ్ల లోపు రూ.5 కోట్ల దిగువన FDపై అదనంగా పావు శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఈ స్కీం 18 మే 2020న ప్రారంభం కాగా, 30 జూన్ 2021 వరకు పొడిగించారు.

బ్యాంకు FD వడ్డీ రేట్లు ఇలా..
HDFC బ్యాంకు వడ్డీ రేట్లు ఇసా ఉన్నాయి. 7 రోజుల నుండి 29 రోజుల మధ్య 2.50 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. 30 రోజుల నుండి 90 రోజుల మధ్య 3 శాతం వడ్డీ రేటును, 91 రోజుల నుండి 6 నెలల కాలంలో 3.5 శాతం వడ్డీ రేటును, 6 నెలల కాలం నుండి ఏడాది లోపు కాలపరిమితిపై 4.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఏడాది మెచ్యూరిటీ FD పైన 4.9 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
ఏడాది నుండి రెండేళ్ల కాల పరిమితిపై 4.9 శాతం వడ్డీ రేటు, 2 ఏళ్ల నుండి 3 ఏళ్ల కాలపరిమితిపై 5.15 శాతం వడ్డీ రేటు, 3 ఏళ్ల నుండి 5 ఏళ్ల కాలపరిమితిపై 5.30 శాతం వడ్డీ రేటు, 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

FDపై పన్ను
FD పైన వచ్చే వడ్డీ పైన పన్ను ఉంటుంది. మీరు సంపాదించే ఆదాయం, మీ పూర్తి ఆదాయానికి జత కలుస్తుంది. మీ పూర్తి ఆదాయానికి వర్తించే విధంగా వివిధ స్లాబ్ రేట్లలో పన్ను విధించబడుతుంది. ఆ తర్వాత మీ ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో ఇతర మార్గాల ద్వారా ఆదాయం కింద చూపబడుతుంది. ఆదాయపు పన్నుకు అదనంగా బ్యాంకులు, సంస్థలు టీడీఎస్‌ను మీ వడ్డీ ఆదాయంపై మినహాయిస్తాయి.


Click it and Unblock the Notifications