బ్యాంకింగ్ రంగంలో బిగ్ న్యూస్.. మూడోసారి HDFC Bank CEOగా కొనసాగేందుకు నిరాకరించిన శశిధర్ జగదీషన్..

భారతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (HDFC Bank) నాయకత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (MD & CEO) శశిధర్ జగదీషన్ తన పదవి నుంచి వైదొలగాలని స్వచ్ఛంద నిర్ణయం తీసుకున్నారు. రెండవసారి సీఈఓ పదవిలో కొనసాగడానికి ఆయన మొగ్గు చూపకపోవడంతో.. 2026 అక్టోబర్ 26న వ్యాపార వేళలు ముగిసిన అనంతరం ఆయన ఈ పదవి నుంచి విరమించనున్నారు. శనివారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా బ్యాంక్ ఈ విషయాన్ని వాటాదారులకు, మార్కెట్లకు అధికారికంగా స్పష్టం చేసింది.

శనివారం జరిగిన పాలక బోర్డు సమావేశంలో జగదీషన్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. భారతదేశంలోనే అత్యంత విలువైన ఈ ప్రైవేట్ బ్యాంకును ముందుకు నడిపించేందుకు మరొకసారి బాధ్యతలు స్వీకరించాల్సిందిగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆయనను కోరినప్పటికీ.. పునః నియామకం కోరకూడదనే తన నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉన్నట్లు ఫైలింగ్‌లో తెలిపారు. జగదీషన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల నిర్దిష్ట వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాలను బ్యాంక్ వెల్లడించలేదు.

HDFC Bank CEO Sashidhar Jagdishan retirement HDFC Bank CEO retirement October 26 HDFC Bank succession HDFC Bank new CEO Sashidhar Jagdishan third term HDFC Bank latest news HDFC Bank share price HDFC Bank leadership change HDFC Bank MD CEO HDFC Bank October 2026 HDFC Bank merger HDFC Ltd DFC Bank CEO HDFC Bank CEO 26 HDFC Bank CEO HDFC Bank HDFC Bank HDFC Bank

నాయకత్వ మార్పిడి అత్యంత సజావుగా సాగేందుకు బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు తక్షణ చర్యలు ప్రారంభించింది. జగదీషన్ పదవీ కాలం ముగిసేలోపే కొత్త సీఈఓ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆయన అధికారికంగా బ్యాంక్ నుండి వైదొలగే సరికే నూతన సారథి బాధ్యతలు స్వీకరించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆర్బీఐ (RBI) మార్గదర్శకాల ప్రకారం సంభావ్య అభ్యర్థుల జాబితాను తయారు చేసి, కేంద్ర బ్యాంకు ఆమోదానికి పంపేందుకు బోర్డు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది.

Also Read

శశిధర్ జగదీషన్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో సుమారు 27 ఏళ్లకు పైగా సుదీర్ఘ ప్రయాణం సాగించారు. 1996లో ఫైనాన్స్ విభాగంలో మేనేజర్‌గా చేరిన ఆయన, ప్రతిభతో ఉన్నత స్థానాలకు ఎదిగారు. 1999లో బిజినెస్ ఫైనాన్స్ విభాగం హెడ్‌గా, అనంతరం 2008లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా బాధ్యతలు చేపట్టారు. సుమారు 12 ఏళ్ల పాటు సీఎఫ్‌ఓగా ఉంటూ బ్యాంక్ నిధుల నిర్వహణ, వ్యయ నియంత్రణ, ఆర్థిక స్థిరత్వంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. 2019లో ఆయనకు హ్యూమన్ రిసోర్సెస్, లీగల్ & సెక్రటేరియల్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీఎస్ఆర్ వంటి అనేక కీలక విభాగాలకు వ్యూహాత్మక పరివర్తన బాధ్యతలను బోర్డు అప్పగించింది.

అనంతరం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వ్యవస్థాపక సీఈఓ ఆదిత్య పూరి స్థానంలో 2020 అక్టోబర్ 27న జగదీషన్ ఎండీ & సీఈఓగా ప్రమాణ స్వీకారం చేశారు. కొవిడ్-19 మహమ్మారి తెచ్చిపెట్టిన ఆర్థిక సవాళ్ల సమయంలో బ్యాంక్‌ను సమర్థవంతంగా నడిపి లాభాల బాటలో నిలిపారు.

జగదీషన్ పదవీకాలంలో సాధించిన అత్యంత ప్రధానమైన మైలురాయి ఏంటంటే.. హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ల విలీనం. భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక విలీనాలలో ఒకటిగా నిలిచిన ఈ ప్రక్రియ ద్వారా బ్యాంకింగ్, హౌసింగ్ ఫైనాన్స్ వ్యాపారాలు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ఈ ఏకీకరణ ప్రక్రియను ఎటువంటి అంతరాయం లేకుండా విజయవంతంగా పూర్తి చేయడంలో జగదీషన్ సమర్థత అంతర్జాతీయ ఆర్థిక వర్గాల ప్రశంసలు అందుకుంది.

విద్యాభ్యాసం పరంగా జగదీషన్ ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ, యూకేలోని షెఫీల్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. అంతేకాక ఆయన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన, హెచ్‌డిఎఫ్‌సి కంటే ముందు ముంబైలోని డాయిష్ బ్యాంక్‌లో సేవలందించారు. భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగా బ్యాంకుగా హెచ్‌డిఎఫ్‌సిని మరింత పటిష్టం చేసిన జగదీషన్ భవిష్యత్తు ప్రయాణానికి బ్యాంక్ బోర్డు శుభాకాంక్షలు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+