HDFC: రుణాలపై వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్..!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు షాక్ ఇచ్చింది. వివిధ కాలపరిమితులకు సంబంధించి తన రుణ వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీనివల్ల 'మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్' (MCLR)కి అనుసంధానించి రుణాలు తీసుకున్న వినియోగదారులకు రుణ భారం పెరిగే అవకాశం ఉంది. ఈ సవరించిన రేట్లు నవంబర్ 7 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పుల తర్వాత బ్యాంక్ MCLR రేట్లు 7.85 శాతం నుంచి 8.70 శాతం మధ్య కొనసాగుతున్నాయి. అంతకుముందు ఇవి 7.75 శాతం నుంచి 8.55 శాతం మధ్య ఉండేవి. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 5 bps పెరిగి 7.80 శాతం నుంచి 7.85 శాతానికి చేరింది.
ఒక నెల ఎంసీఎల్ఆర్ 7.75 శాతం నుంచి 7.85 శాతానికి చేరింది. మూడు నెలలు ఎంసీఎల్ఆర్ 7.95 శాతం నుంచి 8.05 శాతానికి పెరిగింది. ఆరు నెలలు ఎంసీఎల్ఆర్ 8.15 శాతం నుంచి 8.30 శాతానికి చేరింది. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.30 శాతం నుండి 8.45 శాతానికి పెరిగింది. రెండు సంవత్సరాలు ఎంసీఎల్ఆర్ 8.40 శాతం నుంచి 8.55 శాతానికి చేరింది. మూడు సంవత్సరాలు ఎంసీఎల్ఆర్ 8.55 శాతం నుంచి 8.70 శాతానికి చేరింది. ఒక బేసిస్ పాయింట్ అంటే ఒక శాతం పాయింట్‌లో వందవ వంతు అని అర్థం. వడ్డీ రేట్ల పెంపుదల HDFC బ్యాంక్‌లో MCLRకి అనుసంధానించి రుణాలు తీసుకున్న వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. ఇందులో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రకాల రుణాలు తీసుకున్న వారు ఉండే అవకాశం ఉంది.

అయితే ఈ మార్పు వల్ల అందరి EMIలు వెంటనే పెరగకపోవచ్చు. అసలు ప్రభావం అనేది రుణ ఒప్పందంలో పేర్కొన్న 'వడ్డీ రేటు రీసెట్ తేదీ' పై ఆధారపడి ఉంటుంది. సవరించిన రేట్లు ఎప్పటి నుంచి వర్తిస్తాయో తెలుసుకోవడానికి రుణగ్రహీతలు తమ లోన్ స్టేట్‌మెంట్‌లను, రీపేమెంట్ షెడ్యూల్‌లను సరిచూసుకోవాలి. ఎంసీఎల్ఆర్ అనేది ఒక కనీస వడ్డీ రేటు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతించిన కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప, బ్యాంకులు సాధారణంగా ఈ రేటు కంటే తక్కువకు రుణాలు ఇవ్వకూడదు. బ్యాంకుకు అయ్యే నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, నగదు నిల్వలను నిర్వహించడానికి అయ్యే వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని లెక్కిస్తారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా లోన్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 12, 2026 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ ప్రకటించింది. ఒక నెల కాలపరిమితి ఉన్న ఎంసీఎల్ఆర్ 7.95 శాతం నుంచి 8.00 శాతానికి పెంచింది. అలాగే 3 నెలల రేటు 8.30 శాతం నుంచి 8.50 శాతానికి చేర్చింది. 6 నెలల కాలపరిమితి కలిగిన రుణాలు 8.50 శాతం నుంచి 8.70 శాతానికి పెంచింది. ఇక రిటైల్ లోన్లకు అత్యంత కీలకమైన ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును 8.75 శాతం నుంచి 8.85 శాతంగా మార్చింది. అయితే ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా యథావిధిగా 7.85 శాతాన్నే కొనసాగించింది. ఈ వడ్డీ రేట్ల పెంపు నేరుగా హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ప్రభావం చూపనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications