Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్..

చాలా మంది సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెడతారు. సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకటి. అయితే బ్యాంకులు ఎలాంటి ఎఫ్డీ రేట్లు అందిస్తున్నాయో తెలుసుకుందాం. కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించాయి. హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB), ESAF SFB ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఈ బ్యాంకులలో, ESAF SFB ఒక నిర్దిష్ట కాలపరిమితి గల FDపై సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.50% వడ్డీ రేటును అందిస్తోంది. అక్టోబర్ 1, 2026 నుంచి ఒకే రోజున ఒకే మొత్తంతో, ఒకే కాలపరిమితితో వివిధ శాఖలలో తీసుకునే భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (bulk FDs) ఏకరీతి వడ్డీ రేట్లను ప్రవేశపెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ రేట్ల సవరణలు జరిగాయి.

ఈ నిబంధన రూ.3 కోట్లకు పైబడిన భారీ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ రిటైల్ FDల రేట్లలో ఎటువంటి మార్పు ఉండదు. హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్ ఆగస్టు 19 నుంచి అమల్లోకి వచ్చేలా తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రేట్లను సవరించింది. సీనియర్ సిటిజన్లు మూడేళ్ల ఒక రోజు నుంచి నాలుగేళ్ల ఏడు నెలల లోపు కాలపరిమితి గల డిపాజిట్లపై గరిష్టంగా 7.10 శాతం వడ్డీని పొందవచ్చు. ఈ బ్యాంక్ ఏడాది నుంచి 15 నెలల లోపు కాలపరిమితికి 6.75 శాతం, 15 నెలల నుంచి 18 నెలల లోపు కాలపరిమితికి 6.85 శాతం, 18 నెలల నుండి మూడేళ్ల మధ్య వివిధ కాలపరిమితులకు 6.95 శాతం వడ్డీని అందిస్తోంది. దాదాపు 55 నెలల కాలపరిమితి గల డిపాజిట్లకు 6.90 శాతం, ఐదేళ్ల ఒక రోజు నుంటి 10 ఏళ్ల కాలపరిమితికి 6.65 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి.

FD

ఫెడరల్ బ్యాంక్ ఆగస్టు 17న తన FD రేట్లను సవరించి పెంచడంతో పాటు కొత్త కాలపరిమితిని కూడా ప్రవేశపెట్టింది. సీనియర్ సిటిజన్లు 48 నెలల డిపాజిట్‌పై గరిష్టంగా 7.20% వడ్డీని చెల్లిస్తోంది. ఈ బ్యాంక్ ఏడాది కాలపరిమితికి 6.75 శాతం, ఏడాది కంటే ఎక్కువ నుంచి 15 నెలల లోపు కాలపరిమితికి 6.90శాతం, 15 నెలల కాలపరిమితికి 7.15% వడ్డీని అందిస్తోంది. 24 నెలల కంటే ఎక్కువ, 48 నెలల లోపు కాలపరిమితి గల డిపాజిట్లపై 7% వడ్డీ లభిస్తుండగా, 48 నెలల కంటే ఎక్కువ నుండి 10 ఏళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై 6.90% వడ్డీ లభిస్తుంది.

స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దాదాపు 10 నెలల తర్వాత ఆగస్టు 19న తన వడ్డీ రేట్లను సవరించింది. సీనియర్ సిటిజన్లు 18 నెలల ఒక రోజు నుంచి 24 నెలల కాలపరిమితి గల డిపాజిట్లపై గరిష్టంగా 7.75 శాతం వడ్డీని పొందవచ్చు. 12 నెలల ఒక రోజు నుంచి 18 నెలల కాలానికి 7.25 శాతం, రెండేళ్ల కంటే ఎక్కువ నుండి మూడేళ్ల కాలానికి 7.50 శాతం, మూడేళ్ల కంటే ఎక్కువ నుంచి ఐదేళ్ల కాలానికి 7.25 శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. ESAF SFB ఆగస్టు 17న తన FD రేట్లను సవరించింది. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే గరిష్ట వడ్డీ రేటును 0.25 శాతం పాయింట్లు పెంచి 8.50 శాతానికి చేర్చింది. ఈ గరిష్ట రేటు 800 రోజుల డిపాజిట్‌పై లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు రెండేళ్ల నుండి 799 రోజుల లోపు కాలానికి, 801 రోజుల నుంచి మూడేళ్ల లోపు కాలానికి చేసే డిపాజిట్లపై 8.25% వడ్డీని పొందవచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+