ముంబై: ఇండియన్ ఐటీ దిగ్గజం HCL టెక్నాలజీస్ టార్గెట్ ధరను రూ.1481గా ఎడెల్విస్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ ఐటీ సంస్థ షేర్ ధర రూ.863.20గా ఉంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లార్జ్ క్యాప్ కంపెనీ. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.236360.23 కోట్లకు పైగా ఉంది. కరోనా మహమ్మారి కాలంలో అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఐటీ రంగంపై కూడా భారీగానే ప్రభావం పడింది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి చివరి వారంలో ఈ స్టాక్ రూ.400 స్థాయికి వచ్చింది. అయితే ఆ తర్వాత నుండి వేగంగా పుంజుకుంది.

దూసుకెళ్తున్నాయి
కరోనా ప్రభావం నుండి ఐటీ రంగం మిగతా రంగాలతో పోలిస్తే కాస్త వేగంగా పుంజుకుంటోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా.. ఇలా దాదాపు అన్ని ఐటీ సంస్థల స్టాక్స్ కూడా గత గరిష్టాలను దాటివేశాయి. ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా ఎగిసిపడింది. అక్టోబర్ నెలలో ఈ స్టాక్ ఓ సమయంలో రూ.900 మార్కును క్రాస్ చేసింది. ఐటీ సంస్థలు వేగంగా వృద్ధి సాధిస్తుండగా, హెచ్‌సీఎల్ వంటి సంస్థలు దూసుకెళ్తున్నాయి.

క్వార్టర్ ఫలితాలు అదుర్స్,
30 సెప్టెంబర్ 2020తో ముగిసిన త్రైమాసికానికి గాను హెచ్‌సీఎల్ కన్సాలిడేటెడ్ సేల్స్ రూ.18594.00 కోట్లుగా నమోదయింది. అంతకుముందు త్రైమాసికంతో (రూ.17842.00) పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో 4.21 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 6.09 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ.3146.00 కోట్లుగా నమోదయింది.

ఏడాదిలో ఎంత పెరిగిందంటే
జూన్ 30, 2020 నాటికి కంపెనీలో ప్రమోటర్స్ వాటా 60.3 శాతంగా ఉంది. FIIల వాటా 25.6 శాతంగా ఉంది. DIIల వాటా 10.1 శతంగా నమోదయింది. ఇతరుల వాటా 4 శాతంగా ఉంది. 2020 క్యాలెండర్ ఏడాదిలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ స్టాక్ 50 శాతం లాభపడింది. ఏడాదిలో దాదాపు అదే స్థాయిలో ఎగిసింది. ఇక మార్చిలో భారీ పతనంతో పోలిస్తే 100 శాతానికి పైగా లాభపడింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications