హ్యాపీయెస్ట్ మైండ్స్... రూ.15వేలు ఇన్వెస్ట్ చేస్తే ఒక్కరోజులో రూ.33వేలు!

దేశీయ ఐటీ రంగ ఆద్యుల్లో ఒకరైన అశోక్ సూతకు చెందిన హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ ఐపీవో ఆరంభంలోనే అదరగొట్టింది. రూ.700 కోట్లకు పైగా నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. కంపెనీ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుండి మంచి స్పందన వచ్చింది. ఇష్యూ సైజుతో 151 రెట్లు బిడ్స్ దాఖలయ్యాయి.

బీఎస్ఈలో హ్యాపీయెస్ట్ మైండ్స్ షేర్ ఇష్యూ ధర రూ.166 కంటే 111.44 శాతం అధికంగా రూ.351 వద్ద నమోదయింది. ఆ తర్వాత 138 శాతం ఎగిసి రూ.395 వద్ద ఇంట్రాడేలో గరిష్టాన్ని తాకింది. చివరకు 123 శాతం కంటే ఎక్కువగా లాభపడి రూ.371 వద్ద ముగిసింది. నిన్నటి క్లోజింగ్ ధరతో పోలిస్తే ఈ రోజు మధ్యాహ్నం సమయానికి 2 శాతం కంటే ఎక్కువగా నష్టపోయి రూ.360 పైన కొనసాగుతోంది.

తొలిరోజు రూ.5,448 కోట్లు

తొలిరోజు రూ.5,448 కోట్లు

ఐపీవో మొదటి రోజు షేర్ ధర దూకుడుగా ఉండటంతో నిన్నటి ట్రేడింగ్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ.5,448.64 కోట్లుగా నమోదయింది. బీఎస్ఈలో 109.73 లక్షల కోట్ల షేర్లు చేతులు మారాయి. ఎన్ఎస్ఈలో 5 కోట్ల షేర్లు ట్రేడ్ అయ్యాయి. డిజిటల్ సెగ్మెంట్‌లో వృద్ధి, అశోక్ సూత నేతృత్వంలోని బలమైన నిర్వహణ సామర్థ్యం, ఈయన మైండ్-ట్రీని సహ వ్యవస్థపకుల్లో కూడా ఒకరు కావడం వంటి వివిధ అంశాలు హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ భారీగా లాభపడటానికి కారణమయ్యాయి.

8వ మోస్ట్ సబ్‌స్క్రైబ్డ్ పబ్లిక్ ఇష్యూ

8వ మోస్ట్ సబ్‌స్క్రైబ్డ్ పబ్లిక్ ఇష్యూ

ఎక్స్చేంజీలో నమోదైన రోజే షేర్ ధర 100 శాతానికి పైగా పెరిగిన వాటిలో హ్యాపీయెస్ట్ మైండ్స్ నిలిచింది. ఇటీవలి కాలంలో అవెన్యూ సూపర్‌మార్ట్ (డీ-మార్ట్ మాతృసంస్థ), ఇండియన్ రైల్వేస్ ఐఆర్‌సీటీసీ మొదటి రోజే 100 శాతానికి పైగా పెరిగిన షేర్లుగా నిలిచాయి. ఆ తర్వాత హ్యాపీయెస్ట్ మైండ్స్ కావడం గమనార్హం. గత దశాబ్దకాలంలో పబ్లిక్ ఇష్యూ కంటే ఎక్కువ ధర పలికిన టాప్ 8వ ఐపీవోగా హ్యాపీయెస్ట్ మైండ్స్ నిలిచింది.

అంతకుముందు, Also, క్వెస్ కార్ప్ (July 2016), ఎంఏఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (June 2018), బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్ (September 2011), డిక్సాన్ టెక్నాలజీస్ Technologies (September 2017), అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ (July 2016), IRCTC (October 2019), అవెన్యూ సూపర్ మార్ట్ (March 2017) 104 శాతం నుండి 150 శాతం వరకు పలికాయి. ఇప్పుడు హ్యాపీయెస్ట్ మైండ్స్ ఆ జాబితాలో నిలిచింది.

రూ.15వేలు పెడితే రూ.33వేలు

రూ.15వేలు పెడితే రూ.33వేలు

హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూలో ఒక లాట్ పరిమాణాన్ని 90 షేర్లుగా నిర్ణయించారు. చిన్న ఇన్వెస్టర్లు కనిష్టంగా 90 షేర్లు కొనుగోలు చేయవచ్చు. ఇష్యూ ధర రూ.166. అంటే ఒక లాట్ కొనుగోలుకు రూ.14,940 అవుతుంది. తొలి రోజు షేర్ అదరగొట్టి రూ.371 వద్ద ముగిసింది. అంటే మొదట పెట్టుబడి పెట్టిన వాళ్లకు వచ్చిన ప్రతిఫలం రూ.33,390కి పెరిగింది. అంటే రూ.15వేల కంటే తక్కువ ఇన్వెస్ట్ చేసిన వారికి రూ.33వేల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినట్లు.

2 దశాబ్దాల్లో హయ్యెస్ట్ లిస్టింగ్ ప్రీమియం

2 దశాబ్దాల్లో హయ్యెస్ట్ లిస్టింగ్ ప్రీమియం

హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇష్యూ ధర కంటే 111 శాతం పెరిగి రూ.351 వద్ద లిస్టింగ్ అయింది. గత రెండు దశాబ్దాల్లో ఇలా అత్యధిక లిస్టింగ్ జాబితాలో హ్యాపీయెస్ట్ మైండ్స్ 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఇంద్రప్రస్త గ్యాస్, రెండో స్థానంలో టీవీ టుడే నెట్ వర్క్స్ ఉన్నాయి. వరుసగా...

- ఇంద్రప్రస్త గ్యాస్- ఇష్యూ ధర రూ.48, లిస్టింగ్ ధర రూ.120, ఐపీవో సైజ్ 192 కోట్లు, ప్రీమియం 150 శాతం.

- టీవీ టుడే నెట్ వర్క్స్- ఇష్యూ ధర రూ.95, లిస్టింగ్ ధర రూ.210, ఐపీవో సైజ్ 137.75 కోట్లు, ప్రీమియం 121 శాతం.

- హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్- ఇష్యూ ధర రూ.166, లిస్టింగ్ ధర రూ.351, ఐపీవో సైజ్ 702 కోట్లు, ప్రీమియం 111 శాతం.

- అవెన్యూ సూపర్ మార్ట్స్- ఇష్యూ ధర రూ.299, లిస్టింగ్ ధర రూ.604, ఐపీవో సైజ్ 1,326.75 కోట్లు, ప్రీమియం 102.14 శాతం.

- ఐఆర్‌సీటీసీ- ఇష్యూ ధర రూ.320, లిస్టింగ్ ధర రూ.644, ఐపీవో సైజ్ 645.12 కోట్లు, ప్రీమియం 101.25 శాతం.

పార్శ్వ్‌నాథ్ డెవలపర్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఎడెల్వెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మెగ్‌మని ఆర్గానిక్స్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్, వీ2 రిటైల్, అపోలో మైక్రో సిస్టమ్స్, శోభా తదితర సంస్థలు ఆ తర్వాత జాబితాలో నిలిచాయి. ఇవి 73 శాతం నుండి 80 శాతం మధ్య ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+