పెట్టుబడుల ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెట్టేవారికి Mutual Fund Investment కొంత భయాన్ని కలిగించవచ్చు. అయితే వీటి గురించి కొన్ని బేసిక్ విషయాలు అర్థం చేసుకోవడం ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్స్ (షేర్లు), బాండ్లు, ఇతర సెక్యూరిటీల రూపంలో నిర్వహించబడే పెట్టుబడులు. వీటిని ఫండ్ మేనేజర్లు ప్రొఫెషనల్ గా నిర్వహిస్తారు. మార్కెట్లను విశ్లేషించే సమయం లేని వారికి లేదా మార్కెట్ల గురించి అవగాహన లేనివారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. వీటిలో పెట్టుబడి పెట్టేముందు మీరు గమనించుకోవాల్సి విషయాలేంటంటే..
1. ఆర్థిక లక్ష్యాలు.. రిస్క్ సామర్థ్యం..
Mutual Fund Investment ప్రారంభించడానికి ముందు.. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలి. ఇల్లు కొనడం, పదవీ విరమణ నిధి (Retirement Fund) ఏర్పాటు చేసుకోవడం లేదా ఉన్నత విద్య కోసం పొదుపు చేయడం వంటి లక్ష్యాలను పెట్టుకోవాలి. అలాగే ఎంత కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? ఎంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? అనేవి కూడా నిర్ణయించుకోవాలి. దీన్ని బట్టి ఫండ్స్ ఎంచుకోవాలి.
- ఈక్విటీ ఫండ్స్ (Equity Funds): ఇవి ఎక్కువ రాబడిని ఇచ్చే ఫండ్స్. అయితే వీటిలో రిస్క్ కూడా ఎక్కువ. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు, యువకులకు ఇవి అనువైనవి.
- డెట్ ఫండ్స్ (Debt Funds): ఇవి రిస్క్ తక్కువగాగే ఉండే ఫండ్స్. స్వల్పకాలిక లక్ష్యాలు, తక్కువ రిస్క్ కోరుకునే వారికి ఇవి అనుకూలం.
- హైబ్రిడ్ ఫండ్స్ (Hybrid Funds): ఇవి ఈక్విటీ, డెట్ ఫండ్స్‌ల కలయిక. మధ్యస్థ రిస్క్ తీసుకునే వారికి సరైనవి.
2. మ్యూచువల్ ఫండ్స్ పనితీరు
మ్యూచువల్ ఫండ్స్ అనేక మంది పెట్టుబడిదారుల మూలధనాన్ని (Capital) పోగు చేసి.. నిపుణులైన ఫండ్ మేనేజర్‌లచే నిర్వహించబడతాయి. ఒకే స్టాక్‌లో పెట్టుబడి పెట్టే బదులు విభిన్న ఆస్తుల పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ తగ్గుతుంది. దీన్నే డైవర్సిఫికేషన్ (Diversification) అంటారు. అంటే మీరు రూ. 100 పెట్టుబడి పెట్టినా అవి కొద్దికొద్దిగా మల్టిపుల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయబడతాయి.
- యాక్టివ్ ఫండ్స్ (Active Funds): మార్కెట్ బెంచ్‌మార్క్‌లను మించి రాబడిని సాధించడానికి ఫండ్ మేనేజర్‌లు నిరంతరం ప్రయత్నిస్తారు.
- పాసివ్‌గా నిర్వహించబడే ఫండ్స్ (Passive Funds / Index Funds): ఇవి బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లను అనుసరిస్తాయి. అలాగే తక్కువ ఖర్చుతో కూడుకున్నవి.
3. పెట్టుబడి విధానం ఇలా..
Mutual Fund Investment చేయాలంటే.. ఒకేసారి పెద్ద మొత్తం (Lumpsum) గా లేదా సిస్టమాటిక్ పద్ధతిలో (SIP) నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు.
- SIP (Systematic Investment Plan): కొత్త పెట్టుబడిదారులకు SIP లు చాలా ప్రయోజనకరం. ఇవి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడిని ప్రోత్సహిస్తాయి. మార్కెట్ అస్థిరత వలన కలిగే నష్టాలను తగ్గిస్తాయి.
- SIP కాలిక్యులేటర్ (SIP Calculator): మీరు భవిష్యత్తులో పొందబోయే మొత్తాన్ని అంచనా వేయడానికి SIP కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం మంచిది.
- ఒకేసారి మొత్తం(lumpsum): మీరు ఒకేసారి కూడా పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చు. సిప్ (SIP) తో పోలిస్తే.. దీనివల్ల కొంత రిస్క్ ఉండే అవకాశం ఉంది.
4. సరైన వేదికను ఎంచుకోండి
కొత్తగా పెట్టుబడి పెట్టేవారు.. నమ్మకమైన ప్లాట్‌ఫారమ్ ద్వారా లేదా మ్యూచువల్ ఫండ్ సంస్థ ద్వారా పెట్టుబడి ఖాతాను తెరవాలి. భారతదేశంలో దీనికి KYC (Know Your Customer) ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. ఖాతా తెరిచిన తర్వాత.. మీరు రిస్క్, రాబడి, ఫీజులు, ట్రాక్ రికార్డు ఆధారంగా వివిధ మ్యూచువల్ ఫండ్స్‌ను సరిపోల్చవచ్చు.
5. రివ్యూ చేసుకోవాలి
పెట్టుబడి పెట్టిన తర్వాత కనీసం సంవత్సరానికి ఒకసారి మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా అవసరమైతే మార్పులు చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు దీర్ఘకాలం ఉంచినప్పుడే, కంపౌండింగ్ (Compounding) శక్తిని ఉపయోగించుకుని అధిక ప్రయోజనాలు చేకూరుస్తాయని గుర్తుంచుకోండి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications