ఈ 6 పనులు చేస్తే.. GST శాఖ మీ బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేస్తుందని తెలుసా?
మీరు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని మీకు తెలుసా? ముఖ్యంగా జీఎస్టీ శాఖకు మీ బ్యాంక్ అకౌంట్ ను ఫ్రీజ్ చేసే అధికారం ఉంటుంది. ఇంతకీ అసలు ఏయే సందర్భాల్లో బ్యాంక్ అకౌంట్ నిలిచిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సెంట్రల్ జీఎస్టీ రూల్స్, 2017 లోని రూల్ 159 ప్రకారం ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్ ను తాత్కాలికంగా బ్లాక్ లేదా ఫ్రీజ్ చేసే అధికారం జీఎస్టీ డిపార్ట్ మెంట్ కు ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదాయాన్ని రక్షించడానికి మాత్రమే ఇలా చేస్తారు.
కారణాలు ఇవే..
- మీ అకౌంట్ పై నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) క్లెయిమ్ అయినట్టు ఆరోపణలు వస్తే మీ అకౌంట్ ఫ్రీజ్ అవ్వొచ్చు.
- గూడ్స్ ను సరఫరా చేయకుండానే ఇన్‌వాయిస్‌లు జారీ చేసినట్టు తెలిస్తే వెంటనే మీ అకౌంట్ ఫ్రీజ్ చేయబడుతుంది.
- జీఎస్టీ వసూలు చేసి కూడా ప్రభుత్వానికి ఆ మొత్తాన్ని చెల్లించకపోతే కూడా మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది.
- షెల్ ఎంటిటీలు (Shell Entities) లేదా నకిలీ సంస్థలను కనుగోలు చేసినట్టు తేలితే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి.
- ఆడిట్‌ల సమయంలో గణనీయమైన తేడాలు కనిపిస్తే.. మీ బ్యాంక్ అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేయొచ్చు.
- మీపై జరుగుతున్న దర్యాప్తులకు సహకరించకపోతే మీ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు.
మీ అకౌంట్ ఫ్రీజ్ అయిందని ఎలా తెలుసుకోవాలి?
- బ్యాంకు కమ్యూనికేషన్: ఒకవేళ మీ అకౌంట్ ఫ్రీజ్ అయితే ఆ ఫ్రీజ్ ఆర్డర్ గురించిన సమాచారాన్ని బ్యాంక్ మీకు తెలియజేస్తుంది.
- జీఎస్టీ పోర్టల్ నోటీసు: జీఎస్టీ పోర్టల్‌లో ఫారం GST DRC-22 లో ఒక నోటీసు వస్తుంది.
- ప్రత్యక్ష సమాచారం: జీఎస్టీ అధికారుల నుంచి కూడా మీకు నేరుగా కమ్యూనికేషన్ అందుతుంది.
ఫ్రీజ్ అయిన అకౌంట్ ను తిరిగి ఎలా పొందాలి?
- అబ్జెక్షన్ ఫైల్ : మీ అకౌంట్ ఫ్రీజ్ అయితే.. మీరు 7 రోజులలోపు GST ఫారం DRC-22A లో అబ్జెక్షన్ ను ఫైల్ చేయాలి. సరైన కారణాలను తెలియజేయాలి.
- రిక్వెస్ట్ రిలీజ్: మీపై జరిగిన దర్యాప్తుపై కమిషనర్ సంతృప్తి చెందితే లేదా బ్యాంక్ గ్యారెంటీ వంటి ఇతర మార్గాలు మీరు చూపిస్తే.. మీ అకౌంట్ అన్‌ఫ్రీజ్ అవుతుంది.
- రిట్ పిటీషన్: ఒకవేళ మీ అకౌంట్ ను అన్యాయంగా ఫ్రీజ్ చేశారు అని మీకు అనిపిస్తే.. మీరు కోర్టులో రిట్ పిటిషన్ వేయొచ్చు.
ముఖ్యమైన ఫారమ్‌లు
- అటాచ్మెంట్(ఫ్రీజ్) ఆర్డర్: ఫారం GST DRC-22 లో జారీ చేయబడుతుంది.
- అబ్జెక్షన్ అప్పీల్: ఫారం GST DRC-22A లో దాఖలు చేయవచ్చు.
- రిలీజ్ ఆర్డర్: ఒకవేళ మీ రిక్వెస్ట్ ను ఆమోదిస్తే ఫారం GST DRC-23 లో మీ రిలీజ్ ఆర్డర్ జారీ చేయబడుతుంది.


Click it and Unblock the Notifications