2022 క్యాలెండర్ ఏడాది నుండి జీఎస్టీ పన్నుల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్ని వస్తువులపై సవరించిన ధరలు వచ్చే ఏడాది ప్రారంభం నుండి అంటే జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జీఎస్టీ రిటర్న్స్ దాఖలుకు సంబంధించిన ప్రక్రియలోను కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవీ 2022 నుండి అమలు చేయనున్నారు. 2017లో ప్రవేశపెట్టిన జీఎస్టీ పన్ను విధానం కొత్త ఏడాది నుండి కఠినతరం కానుంది. ఇందులో భాగంగా పలు ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి.

జనవరి 1 నుండి మరింత ప్రియం
ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి జనవరి 1వ తేదీ నుండి మరింత ఆర్థిక భారం పడనుంది. దుస్తులు, పాదరక్షలు కాస్త ప్రియం కానున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వీటి పైన జీఎస్టీని 5 శాతం నుండి 12 శాతానికి పెంచింది. అలాగే కేంద్రం సింతటిక్ ఫైబర్, నూలుపై జీఎస్టీని 18 శాతం నుండి 12 శాతానికి తగ్గించింది. సెప్టెంబర్ నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో టెక్స్ టైల్, ఫుట్ వేర్ పైన విధించే జీఎస్టీని సవరించారు. కాటన్ మినహా రెడీమేడ్ దుస్తులతో పాటు అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ చెల్లించవలసి ఉంటుంది.

ఈ-కామర్స్ సేవలపై జీఎస్టీ
ఈ-కామర్స్ సంస్థల సేవలపై కూడా జనవరి 1వ తేదీ నుండి జీఎస్టీ చెల్లించాలి. క్యాబ్, ఆటో, బైక్స్ ద్వారా ఆన్ లైన్‌లో ప్రయాణీకులకు సేవలు అందించే ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలు ఐదు శాతం పన్నులు చెల్లించవలసి ఉంటుంది. అయితే ఆఫ్ లైన్ బుకింగ్ చేస్తే జీఎస్టీ మినహాయింపు ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ, జొమాటో జనవరి 1వ తేదీ నుండి కస్టమర్ నుండి నేరుగా జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయాలి. గతంలో రెస్టారెంట్లు జీఎస్టీని వసూలు చేసేవి. ఇప్పటి వరకు రెస్టారెంట్స్ నిర్వహించిన బాధ్యతను ఇక ఫుడ్ డెలివరీ యాప్స్ నిర్వహిస్తాయి.

ఆధార్ అనుసంధానం
పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ రీఫండ్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కొత్త ఏడాది నుండి ఆధార్ ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన పాన్ నెంబర్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోనే జీఎస్టీ రీఫండ్స్ వేసేలా చర్యలు చేపట్టింది. పన్ను ఎగవేతల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు జీఎస్టీకి సంబంధించి వివిధ నిబంధనల్లో కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు సవరణలు చేసింది.
గత నెలకు సంబంధించి జీఎస్టీఆర్-3బీ రిటర్న్స్ దాఖలు చేయని వారు జనవరి 1 నుండి జీఎస్టీఆర్-1లో బయటకు పంపే సరఫరాలను నమోదు చేయడానికి వీలుండదని జీఎస్టీఎన్ స్పష్టం చేసింది. ఏదైనా నెలకు సంబంధించిన జీఎస్టీఆర్-1ను దాఖలు చేయడానికి తర్వాత నెలలో 11వ రోజు వరకు గడువు ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications