దీపావళి అంటే కేవలం గోల్డ్, లైట్స్, స్వీట్స్ మాత్రమే కాదు... ఈ పండుగ సమయంలో కార్ల కొనుగోలు కూడా ఎక్కువ జరుగుతుంటాయి. ఈసారి GST 2.0 తో ధరలు కొంత తగ్గడం, పండుగ డిస్కౌంట్స్ రెండు కలిపి కారు కొనేవాళ్లకి ఈ సీజన్ మరింత హాట్‌గా మారబోతుంది.
పండుగ సీజన్‌లో పెద్ద డిస్కౌంట్లు, లిమిటెడ్ టైమ్ ఆఫర్లు చూడటం ఒకటే కాదు. నిజానికి కారు కొనడానికి మీకు ఎంత ఖర్చు అవుతూందో, ఫైనల్ ఆన్-రోడ్ ప్రైస్, ఫైనాన్స్, డెలివరీ టైమ్, వారంటీ, యాక్సెసరీ ప్యాకేజీలు అన్నీ బాగా చెక్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకుంటే, పండుగ హైప్‌ను స్మార్ట్ డీల్‌గా మార్చుకోవచ్చు.

1. GST 2.0 వల్ల ఎక్కువ కార్లపై పన్ను తగ్గింది, అందువల్ల తయారీదారులు ఆ తగ్గిన మొత్తాన్ని కస్టమర్లకు డిస్కౌంట్‌గా ఇస్తున్నారు. కానీ గమనించాల్సింది ఏంటంటే ఈ తగ్గింపు ఎక్స్-షోరూమ్ ప్రైస్‌కి మాత్రమే వర్తిస్తుంది. మీరు ఎంచుకున్న వేరియంట్‌లో రివైజ్డ్ GST డీల్‌లో సరిపోతుందా అని డీలర్‌తో చెక్ చేసుకోండి. పాత ధరలతో కొత్త ధరల పోలిక కూడా అడగండి. చివరి లాభం ఎంత ఉంటుంది అనేది వేరియంట్ మరియు డీలర్ ఇన్సెంటివ్‌ల మీద ఆధారపడుతుంది.
2. ఎక్స్-షోరూమ్ ప్రైస్-ఫైనల్ ని ఎప్పుడూ అనుకోకండి. అన్ని ఖర్చులు, ఫీజులు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, హ్యాండ్లింగ్ చార్జీలు, డీలర్ అదనపు చార్జీలు అన్నీ చూపించి తరవాత ఆన్-రోడ్ కోట్ తీసుకోండి. పండుగ సీజన్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటే హ్యాండ్లింగ్ ఫీజులు పెరగవచ్చు. సైన్ చేసిన కోట్ లేదా ఇన్వాయిస్ ఉంటే డీలర్ చివరి నిమిషంలో ఏమైనా అదనపు ఛార్జీలు వేసే అవకాశం తగ్గుతుంది.
3. పండుగ సీజన్‌లో EMI డీల్స్, నో-కాస్ట్ EMI, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ మొత్తం ఇంటరెస్ట్, ప్రాసెసింగ్ ఫీజు, ఫోర్క్లోజర్ షరతులు అన్ని గమనించాలి. ఇన్సూరెన్స్ ఫ్రీబీస్ లేదా ఎక్స్టెండెడ్ వారంటీలు బాగున్నట్టే కనిపిస్తాయి, కానీ వాటి కవర్ పరిమితులు, క్లెయిమ్ ప్రాసెస్ కూడా చూడాలి. పాత కారు ఎక్స్చేంజ్ చేస్తే, వేర్వేరు వాల్యుయేషన్ కోట్స్ తీసుకోండి. ఎందుకంటే ఎక్స్చేంజ్ బోనస్, మోడల్ లేదా కలర్ మీద ఆధారపడి ఉంటుంది.
4. దీపావళి సీజన్‌లో కొన్ని వేరియంట్స్ డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. డెలివరీ తేదీ, అవసరమైన డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ ఆలస్యం కోసం డీలర్ చార్జీలు ఉంటాయా అని రాతలో కన్ఫర్మ్ చేసుకోండి. మీరు పండుగకి కారు కావాలంటే ముందుగా బుక్ చేసుకోవడం చాలా అవసరం. కొంత OEMలు ముందుగా బుకింగ్ చేయమని చేస్తుంటారు, తద్వారా డెలివరీ ఆలస్యం కాకుండా ఉంటుంది.
5. పూర్తి చెల్లింపు ముందు కారు ఫిజికల్‌గా చెక్ చేయండి. VIN, పెయింట్, యాక్సెసరీ ఫిట్‌మెంట్. వారంటీ స్టార్ట్ డేట్, ఫ్రీ సర్వీస్ షెడ్యూల్ తెలుసుకోండి. డీలర్ ఇచ్చిన యాక్సెసరీలు లేదా పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ వేరుగా ఇన్వాయిస్ ఇవ్వమని అడగండి . అన్ని పేపర్‌వర్క్ (కోట్, ఇన్వాయిస్, ఇన్సూరెన్స్, RTO రసీదు) రిజిస్ట్రేషన్ మరియు డెలివరీ పూర్తయ్యేవరకు సురక్షితంగా ఉంచండి. ఇలా చేయడం ద్వారా మీరు పండుగ డిస్కౌంట్లలో ఉండే చమక్కులు నుండి తప్పించుకుంటారు.
6. పండుగ రద్దీ కారణంగా చాలామంది టెస్ట్ డ్రైవ్‌కి టైమ్ తీసుకోరు. కానీ ఇది చాలా ముఖ్యం. మీరు ఎంచుకున్న వేరియంట్‌లో కంఫర్ట్, డ్రైవింగ్ ఫీల్, ఫీచర్లు, రోడ్ క్లియరెన్స్ అన్నీ మీకు సరిపోతాయో లేదో టెస్ట్ డ్రైవ్‌లో మాత్రమే తెలుస్తుంది.
7. కొన్ని డీలర్లు పండుగ ఆఫర్ల పేరుతో బలవంతంగా యాక్సెసరీ ప్యాకేజీలు చేర్చే అవకాశం ఉంటుంది. మీకు నిజంగా అవసరమైన వాటిని మాత్రమే తీసుకొండి. అవసరం లేని ప్యాకేజీలను తీసేసి, దానికి బదులుగా డిస్కౌంట్ అడగండి.
8. కొన్ని కంపెనీలు మరియు ఫైనాన్స్ భాగస్వాములు ఆన్‌లైన్ బుకింగ్‌లకు ప్రత్యేక క్యాష్‌బ్యాక్ లేదా అదనపు వారంటీ ఇస్తుంటారు. మీరు డీలర్‌కి వెళ్లే ముందు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఆన్‌లైన్ పోర్టల్స్ చెక్ చేస్తే అదనపు లాభం పొందే అవకాశం ఉంటుంది.
9. డీలర్ ఇచ్చిన ఇన్సూరెన్స్ కోట్ మాత్రమే ఫైనల్ అనుకోకండి. బయట నుండి కూడా ఇన్సూరెన్స్ కోట్స్ తీసుకోండి. చాలా సార్లు బయట పాలసీలు తక్కువ ప్రీమియంతో, మంచి కవరేజీ ఇస్తాయి. మీకు బెటర్ పాలసీ దొరికితే, డీలర్‌కి దాన్ని మ్యాచ్ చేయమని అడగవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications