కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసే సర్టిఫికెట్ పథకం కిసాన్ వికాస్ పత్ర(KVP). ఇది ప్రాథమిక పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేయడానికి ఉద్దేశించిన స్కీం. ఇది లాభదాయకమైన వడ్డీ రేటుతో అస్యూర్డ్ రిటర్న్స్‌తో కూడిన స్కీం. ఇండియన్ పోస్టాఫీస్ ద్వారా వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. స్టాక్ మార్కెట్, స్మాల్ సేవింగ్ స్కీమ్స్, బ్యాంకులు ఇలా మీకు నచ్చిన చోట డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు.
రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడిని పొందాలని భావిస్తే మాత్రం స్మాల్ సేవింగ్స్ స్కీంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రెట్టింపు డబ్బులు పొందవచ్చు. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే మాత్రం కిసాన్ వికాస్ పత్ర వంటి వాటిని చూడవచ్చు. బ్యాంకులో వచ్చే వడ్డీ కంటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ లాభాలను పొందవచ్చు.

వడ్డీ రేటు, కనిష్ట పరిమితి
ప్రభుత్వ పథకమైన కిసాన్ వికాస్ పత్ర స్కీం పైన ప్రస్తుతం 6.9 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ స్కీంలో కనీసం రూ.1000 ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేదు. కనీసం పద్దెనిమిదేళ్ల వయస్సు కలిగిన వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. రూ.1000, రూ.5,000, రూ.10,000, రూ.50,000 ఇలా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఉదాహరణకు మీరు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి రూ.10 లక్షలు చేతికి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. కాబట్టి వడ్డీ రేట్లలో మార్పు ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వ స్కీం కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది.

ఈ స్కీం ప్రయోజనాలు
ఈ స్కీం ద్వారా ఇన్వెస్ట్ చేస్తే 10 సంవత్సరాల 4 నెలల్లో(124 నెలలు) మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. ఈ స్కీం కింద ఎన్ని ఖాతాలు అయినా తెరువవచ్చు. KVP కాలిక్యులేటర్‌ను అనుసరించి.. ఉదాహరణకు మీరు రూ.1,00,000 ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల నాలుగు నెలల కాలంలో రూ.2,00,000 ఆదాయం వస్తుంది.
ఏదైనా పోస్టాఫీస్ ఖాతాలో తెరువవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు పత్రాలు తప్పనిసరి.
కిసాన్ వికాస్ పత్ర స్కీంలో నామినీని ఎంచుకోవచ్చు.
ఈ స్కీంలో చేరితే KVP పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు.
అయితే కిసాన్ వికాస్ పత్ర స్కీం పెట్టుబడికి పన్ను మినహాయింపు లేదు.

లాక్-ఇన్ పీరియడ్
కిసాన్ వికాస్ పత్ర లాక్-ఇన్ పీరియడ్ రెండేళ్ల ఆరు నెలలు. ఈ గడువు దాటిన తర్వాత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. మెచ్యూరిటీ వరకు ఆగవలసిన అవసరం లేదు. ఈ స్కీంలో సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే ముగ్గురు చిన్నారుల వరకు పరిమితి ఉంది. మీరు గార్డియన్ అయితే చిన్నారి పేరు మీద ఓపెన్ చేయవచ్చు.
పదేళ్లు దాటితే తన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీంను ఒకరి పేరు మీద నుండి మరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు. పోస్టాఫీస్‌లో మాత్రమే అందుబాటులో ఉండే స్కీం. ఒక పోస్టాఫీస్ నుండి మరో పోస్టాఫీస్‌కు మార్చుకోవచ్చు.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications