ఉద్యోగులలో చాలామందికి తలపడే ఒక ముఖ్యమైన ప్రశ్న?బోనస్ వచ్చిందంటే లోన్ తీర్చేయాలా? లేక పెట్టుబడి పెట్టాలా? హోం లోన్ ఉన్న వారు ముఖ్యంగా ఈ గందరగోళంలో పడతారు. ముందస్తు చెల్లింపు చేస్తే వడ్డీ తగ్గుతుందా లేక అదే డబ్బుతో మంచి రాబడి ఉన్న మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో సంపద ఏర్పడుతుందా?

ఈ సలహాను ఫైనాన్షియల్ నిపుణుడు మరియు ఎడెల్వైస్ ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన నిరంజన్ అవస్తి ఏమంటున్నారు అంటే ఉదాహరణకు, ఓ వ్యక్తి హోం లోన్ గా రూ 50 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ లోన్‌కు మిగిలిన కాలపరిమితి 20 సంవత్సరాలు కాగా, వడ్డీ రేటు 8%గా ఉంది. ఇటీవలి బోనస్‌గా ఆయనకు రూ 5 లక్షలు వచ్చాయి. ఈ సొమ్మును ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకోవాలంటే, మ్యూచువల్ ఫండ్లలో సాధారణంగా లభించే వార్షిక సగటు రాబడి (CAGR) 12%గా ఊహించుకుంటాం. పన్ను ప్రయోజనం లేదని, అంటే న్యూ టాక్స్ రెజీమ్‌లో ఆ ప్రయోజనం లేనట్టు భావించాలి. ఈ వివరాల ఆధారంగా నాలుగు ఆర్థిక నిర్ణయాల ఎంపికలు పరిశీలించవచ్చు.
ఎంపిక 1:
రూ. 5 లక్షలు హోం లోన్‌కు ముందస్తుగా చెల్లిస్తే, మీ నెలవారీ EMI సుమారుగా రూ 4,182 తగ్గుతుంది. దీని వల్ల మొత్తం 20 సంవత్సరాల్లో దాదాపు రూ 5.03 లక్షల వరకు వడ్డీపై ఆదా చేయవచ్చు. ఇది నెలవారీ ఆర్థిక భారాన్ని తగ్గించి, మానసిక ప్రశాంతతనూ కలిగిస్తుంది. అయితే దీనిలో లోపం ఏమిటంటే మీరు తగ్గిన EMIని మళ్లీ ఖర్చులకే వాడుకుంటే, అది సంపద సృష్టికి ఉపయోగపడదు. ఈ దశలో ఆ సొమ్మును పెట్టుబడిగా ఉపయోగించకపోతే దీర్ఘకాలిక లాభం నిరాశగా మారవచ్చు.
ఎంపిక 2:
రూ. 5 లక్షల బోనస్‌తో హోం లోన్ EMIని తగ్గించండి. దీంతో నెలవారీ EMI సుమారు రూ 4,182 తగ్గుతుంది. అదే మొత్తాన్ని మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీ SIPగా పెట్టుబడి చేస్తే, 20 సంవత్సరాల్లో అది సుమారుగా రూ 38.5 లక్షలుగా పెరుగుతుంది (12% CAGRని ఆధారంగా తీసుకుంటే). దీని ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఒకవైపు EMI తగ్గిన తృప్తి పొందుతారు, మరోవైపు ఆదా అయిన డబ్బు సంపదగా మారే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థికంగా బ్యాలెన్స్ ఉండే మార్గంగా చెప్పవచ్చు. ఎందుకంటే డబ్బు పని చేస్తుంది, ఆర్థిక భారం తగ్గుతుంది.
ఎంపిక 3:
రూ5 లక్షల బోనస్‌ను ఉపయోగించి హోం లోన్ కాలపరిమితిని తగ్గించండి కానీ EMIని తగ్గించవద్దు. ఈ మార్గాన్ని ఎంచుకుంటే, మీ లోన్ 20 సంవత్సరాల బదులు 16 సంవత్సరాల్లో పూర్తవుతుంది. దీని వల్ల దాదాపు రూ 15.7 లక్షల వడ్డీని సేవ్ చేయవచ్చు. ముఖ్యమైన లాభం ఏమిటంటే మీరు వేగంగా లోన్ నుంచి బయటపడతారు, భవిష్యత్తులో ఆర్థిక స్వేచ్ఛను పొందే అవకాశాన్ని సృష్టిస్తారు. అయితే, ఈ మార్గంలో నెలవారీ EMI భారం అలాగే కొనసాగుతుంది. అంతేకాదు, అదనంగా సంపదను పెంచుకునే అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించలేరు.
ఎంపిక 4:
రూ 5 లక్షల బోనస్ మొత్తాన్ని హోం లోన్‌కు ముందస్తు చెల్లింపు చేయకుండా, పూర్తిగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేయండి. సగటు 12% CAGR రాబడి ఉంటే, ఈ డబ్బు 20 ఏళ్లలో రూ 48.2 లక్షలుగా పెరుగుతుంది. ఇది అత్యధిక రాబడిని ఇచ్చే మార్గం. సంపద నిర్మాణానికి ఇది నిజమైన బంగారు అవకాశంగా నిలుస్తుంది. అయితే, ఈ ఎంపికలో EMI భారం అలాగే కొనసాగుతుంది. అంతేకాదు, మార్కెట్ పెరుగుదల పతనాలకు స్పందించకుండా, భావోద్వేగం లేకుండా పెట్టుబడిని నిరంతరం కొనసాగించాలి.
"మ్యాంగో మనీ నియమం" ప్రకారం మీ పెట్టుబడి రాబడి హోం లోన్ వడ్డీ రేటుకు మించి ఉంటే, ముందస్తు చెల్లింపులో కాకుండా పెట్టుబడిలో పెట్టడం స్మార్ట్ నిర్ణయం అవుతుంది.
ఏది మంచిది?
అత్యుత్తమ రాబడి కోసం చూస్తున్నవారికి 4 ఎంపిక అంటే రూ 5 లక్షల మొత్తాన్ని పూర్తిగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయడం ఉత్తమ నిర్ణయం అవుతుంది. ఇది సంపద నిర్మాణానికి అత్యధిక అవకాశాన్ని కలిగిస్తుంది. అయితే, ఒకసారి లోన్ EMIను కొంచెం తగ్గించి, ఆ మిగిలిన మొత్తాన్ని నెలసరి SIPలుగా పెట్టుబడి చేయడం ద్వారా ధన నిర్మాణం మరియు భారం తగ్గింపును కలిపే మంచి బ్యాలెన్స్ కావాలంటే ఎంపిక 2 ఉత్తమ మార్గం. కానీ చాలా మంది చేసే ప్రధాన తప్పు ఏమిటంటే బోనస్ మొత్తాన్ని ముందస్తుగా చెల్లించి EMI తగ్గించుకుని, ఆ ఆదా అయిన డబ్బును ఖర్చు చేయడం. ఇది సంపద పెంపుదల అవకాశాన్ని కోల్పోయే ఫైనాన్షియల్ పొరపాటు.
ఎవరైనా బోనస్ వచ్చిన ప్రతిసారి ఇదే పథకం పాటించండి ఉత్తమం. ఒక భాగాన్ని లోన్ ముందస్తు చెల్లింపుకు మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ లేదా SIP పెట్టుబడికి మీ లోన్ త్వరగా తగ్గుతుంది మరియు మీ సంపద కూడా చకచకా పెరుగుతుంది. ఇది ఒక ఆర్థిక వ్యూహం మాత్రమే. మీ వ్యక్తిగత అవసరాలు, భద్రతా లక్ష్యాలు ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. రిస్క్ టోలరెన్స్, పెట్టుబడి అవగాహన ఉన్నట్లయితే SIPలు లేదా ఫండ్స్ సరైన మార్గం కావచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications