మీరు బంగారు దుకాణంలోకి వెళ్లి బంగారాన్ని కొనేటప్పుడు ఒక ధర(gold rate) ఉంటుంది, అదే బంగారాన్ని తిరిగి ఆ దుకాణంలో అమ్మేటప్పుడు మరొక ధర. కొనే ధర కంటే అమ్మే ధర ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అయితే దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి.

1. ఆపరేషనల్ కాస్ట్
బంగారం వ్యాపారం చేసే ప్రతి డీలర్‌కు కొన్ని ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులను బ్యాలెన్స్ చేసుకునేందుకు ధరపై కొంత మార్జిన్ వేస్తారు. అదనపు ఖర్చులు అంటే దుకాణం అద్దె, ఉద్యోగుల జీతాలు, విద్యుత్ బిల్లులు, సెక్యూరిటీ ఏర్పాట్లు, స్టోరేజ్ ఏర్పాట్ల వంటివి. వీటితోపాటు అదనంగా కొంత లాభం ఎలాగూ చూసుకుంటారు కాబట్టి ఓవరాల్ గా రేట్ పెరుగుతుంది.
2. మేకింగ్ ఛార్జెస్
ఇక రెండో కారణం మేకింగ్ ఛార్జెస్. బంగారు ఆభరణాల విషయంలో మేకింగ్ ఛార్జెస్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. మేకింగ్ ఛార్జెస్ అంటే బంగారాన్ని ఆభరణంగా తయారు చేయడానికి అయ్యే ఖర్చు. ఈ ఛార్జీ.. ఆ జువెలరీ డిజైన్ పై ఆధారపడి ఉంటుంది. మీరు ఆభరణాన్ని తిరిగి అమ్మినప్పుడు ఈ మేకింగ్ ఛార్జీ విలువ తిరిగి రాదు కాబట్టి కొనే ధర కంటే అమ్మే ధర తగ్గిపోతుంది. అలాగే ఆభరణాలు తయారుచేసేటప్పుడు కొంత బంగారం వృథా అవుతుంది దీన్నే తరుగు అంటారు. ఈ తరుగు ఖర్చును కూడా కొనుగోలుదారుడి నుండే వసూలు చేస్తారు.
3. ప్యూరిటీ & రీసైక్లింగ్
బంగారాన్ని తిరిగి అమ్మడానికి వెళ్లినప్పుడు షాపు వాడు ఆ బంగారం స్వచ్ఛతను ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇలా పరిశీలించి రిఫైన్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. దీంతోపాటు లాస్ ఆఫ్ ప్యూరిటీ కూడా యాడ్ అవుతుంది. అంటే ఒకవేళ బంగారం 22 క్యారెట్ గా ఉంటే దాన్ని తిరిగి మార్కెట్‌లోకి పంపడానికి 24 క్యారెట్ లోకి మార్చాలి. దీనికోసం రాగి, వెండి వంటివి కలపాలి. కాబట్టి ఈ ఖర్చు కూడా యాడ్ అవుతుంది. దీంతో బంగారం అమ్మే ధర ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది.
గోల్డ్ రేట్(gold rate) విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- సాధారణంగా బంగారం కొనుగోలు, అమ్మకం ధరల మధ్య వ్యత్యాసం 2 నుంచి 5 శాతం వరకు ఉండొచ్చు. ఆభరణాలలో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువ ఉంటుంది. కాబట్టి బంగారాన్ని పెట్టుబడిగా కొనేందుకు ఆభరణాలు సరైన ఆప్షన్ కాదు.
- ఒకవేళ మీరు బంగారాన్ని పెట్టుబడిగా కొనుగోలు చేయాలనుకుంటే మేకింగ్ చార్జెస్, తరుగు వంటివి లేని గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్ల వంటి వాటిని ఎంచుకోవచ్చు. ఆభరాణాలతో పోలిస్తే వీటి అమ్మకం ధర కాస్త ఎక్కువ పలుకుతుంది.
- ఇక చివరిగా బంగారం అనేది తక్కువ కాలంలో లాభాలు ఇచ్చే ఆస్తి కాదు. కాబట్టి మీరు కొనుగోలు ధర, అమ్మకం ధర మధ్య ఉన్న గ్యాప్ ను అధిగమించి లాభం పొందాలంటే బంగారం ధర గణనీయంగా పెరిగే వరకు వెయిట్ చేయడం మంచిది.


Click it and Unblock the Notifications