బంగారం vs షేర్లు vs FD.. గత 40 ఏళ్లలో ఏది ఎక్కువ లాభాలను ఇచ్చింది? రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు!
డబ్బును ఎక్కడ దాచుకోవాలి? ఎలా లాభాన్ని పొందాలి? ఇది ప్రతి సామాన్యుడిని వేధించే ప్రశ్న. స్వల్పకాలిక అవసరాలకు బ్యాంకు డిపాజిట్లు (FD) బాగుంటాయి. కానీ, దశాబ్దాల పాటు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలంటే ఏది సరైన మార్గం? తాజాగా 'వైట్ ఓక్ క్యాపిటల్' (WhiteOak Capital) సంస్థ 1985 నుండి 2025 వరకు అంటే గత 40 ఏళ్ల కాలానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణను బయటపెట్టింది.
1985లో పెట్టిన రూ.100.. నేడు ఎంతయ్యాయి?
ఒక వ్యక్తి 1985లో రూ.100 రూపాయలను వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టి.. 2025 మార్చి వరకు అలాగే వదిలేస్తే.. నేడు వాటి విలువ ఎంత ఉందో చూద్దాం..
- సెన్సెక్స్ (షేర్ మార్కెట్): 1985లో పెట్టిన రూ.100 నేడు రూ.13,484 అయ్యాయి. అంటే అన్నిటికంటే అత్యధిక లాభం షేర్ మార్కెట్ నుండే వచ్చింది.
- బంగారం (Gold): రూ.100 విలువ నేడు రూ.6,518 కు చేరింది. బంగారం ఎప్పుడూ స్థిరమైన వృద్ధిని (సుమారు 10-12% CAGR) చూపుతూ ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని ఇస్తుంది.
- బ్యాంకు డిపాజిట్ (FD): రూ.100 విలువ నేడు కేవలం రూ.2,100 మాత్రమే అయ్యాయి.
- ద్రవ్యోల్బణం (Inflation): అప్పటి రూ.100 విలువ నేటి కాలంలో రూ.1,478 తో సమానం.

హీరో ఎవరు? విలన్ ఎవరు?
ఈ లెక్కలు చూస్తుంటే మనకు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి..
1. ద్రవ్యోల్బణం అనే విలన్: 1985లో ఒక రూపాయికి ఉన్న విలువ ఇప్పుడు 14 నుండి 15 రెట్లు పడిపోయింది. అంటే మీరు పెట్టిన పెట్టుబడి ద్రవ్యోల్బణం (Inflation) కంటే తక్కువ రిటర్న్స్ ఇస్తే.. మీరు లాభంలో లేనట్టే లెక్క.
2. ఎఫ్.డి (FD) కేవలం సేఫ్టీ కోసమే: బ్యాంకు డిపాజిట్లు ద్రవ్యోల్బణం కంటే కొంచెం ఎక్కువ లాభాన్ని మాత్రమే ఇచ్చాయి. అంటే మీ డబ్బు విలువ తగ్గకుండా మాత్రమే ఇవి కాపాడుతున్నాయి తప్ప.. సంపదను సృష్టించడం లేదు.
3. బంగారం - ఆపద్బాంధవుడు: స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనప్పుడు బంగారం అండగా నిలుస్తుంది. గత 40 ఏళ్లలో బంగారం ధర ఎక్కడా ఆగకుండా నిలకడగా పెరుగుతూనే వచ్చింది.
4. సెన్సెక్స్ - సంపద సృష్టికర్త: మధ్యలో కొన్ని ఏళ్లు నష్టాలు చూసినప్పటికీ, దీర్ఘకాలంలో అత్యధిక లాభాలను (Wealth Creation) ఇచ్చింది మాత్రం షేర్ మార్కెట్ మాత్రమే.
ఇంతకీ ఏది బెస్ట్?
మీరు ధనవంతులు కావాలనుకుంటే మీ పెట్టుబడిలో కొంత భాగం షేర్ మార్కెట్‌లో ఉండాలి. కానీ, రిస్క్ లేకుండా స్థిరమైన లాభం కావాలంటే బంగారం ఉత్తమం. కేవలం అత్యవసర నిధి (Emergency Fund) కోసం మాత్రమే బ్యాంకు డిపాజిట్లను వాడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మొత్తంగా నిపుణులు సూచించేది ఏంటంటే.. ఏ గూటిలోనూ అన్ని గుడ్లు పెట్టకుండా.. బంగారం, షేర్లు, ఎఫ్.డిలలో సర్దుబాటు చేస్తూ పెట్టుబడి పెట్టడమే అసలైన తెలివైన పని! కానీ, ఏదైనా పెట్టుబడి పెట్టేముందు మీకు నమ్మకమైన ఆర్థిక సలహా దారుడి సూచన పాటించడం ఉత్తమం.
(గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.)


Click it and Unblock the Notifications