మనం జీవితంలో కష్టపడి సంపాదించిన డబ్బును భద్రంగా ఉంచుకోవాలని అనుకుంటాం. ఆ డబ్బుని పెట్టుబడిలో పెట్టాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ డబ్బును ఎందులో పెట్టుబడిలో పెట్టాలి? ఆ పెట్టుబడిలో డబ్బు సురక్షితంగా ఉంటుందా లేదా? ఒకవేళ ఉంటే అది బంగారంలోనా? లేక స్థలంలోనా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే రెండూ విలువ కలిగిన పెట్టుబడులే అయినా... పెట్టుబడి పరంగా చూస్తే, వాటి లాభనష్టాలు, స్థిరత్వం, ఉపయోగాలు వేరేలా ఉంటాయి. మరి బంగారం మరియు రియల్ ఎస్టేట్ మధ్య తేడాలు ఏంటి? ఏది ఎక్కువ పెట్టుబడి స్థిరత్వన్నిస్తుంది? అన్న విషయాలను సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం.
బంగారం మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారాన్ని వారి జీవితంలో కొనుగోలు చేసి ఉంటారు. ప్రతి పండుగ, శుభకార్యం, పెళ్లి వంటి వేళల్లో బంగారం కొనడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఇది మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్‌లో ఉంటుంది. పెట్టుబడి కోణంలో చూస్తే, బంగారం కొనడం చాలా సులభం. చిన్న మొత్తాల్లో నైనా కొనుగోలు చేయవచ్చు. అదనంగా, అవసరమైనప్పుడు తక్షణమే అమ్ముకోవచ్చు లేదా గోల్డ్ లోన్ కూడా తీసుకోవచ్చు. దీని వల్ల ఇది ఒక అత్యవసర పెట్టుబడిగా పనిచేస్తుంది.

ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే, ఇది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి. స్థలం లేదా ఇల్లు కొన్న తర్వాత దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా రెగ్యులర్ ఆదాయం పొందవచ్చు. ఇది ఒక రకంగా నిద్రపోతూ డబ్బు సంపాదించే మార్గం గా చెప్పుకోవచ్చు. మరోవైపు, అక్కడ ప్రాంత అభివృద్ధి బట్టి ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో ఆ స్థలం మంచి లాభాలనే తీసుకురావచ్చు.
రెండింటికీ తమ తమ ప్రత్యేకతలూ, లాభాలు ఉన్నాయి. అయితే, బంగారం నిఖార్సైన ఆదాయం ఇవ్వదు. ఇది రెంటల్ ఇన్‌కమ్ ఇవ్వదు. అంతే కాక, అంతర్జాతీయ మార్కెట్లో జరిగే మార్పులు, డాలర్ విలువ, దేశీయ ఆర్థిక పరిస్థితులు దీని ధరపై ప్రభావం చూపుతాయి. దీని ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.
అయితే, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం. అదనంగా, ఇది తక్షణ అవసరాలకు డబ్బు సమకూర్చలేదు. ఎందుకంటే స్థలం లేదా ఇల్లు అమ్మకం తొందరగా జరగదు. డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్, బయ్యర్లు వెతకడం వంటి ప్రక్రియల వల్ల ఇది కాస్త సమయం తీసుకుంటుంది.
రెండింటికీ తమ తమ ప్రత్యేకతలూ, లాభాలు ఉన్నాయి. బంగారం పెట్టుబడి చాలా చిన్న మొత్తంలో కూడా ప్రారంభించవచ్చు కానీ అదే రియల్ ఎస్టేట్ అంటే లక్షల రూపాయల పెట్టుబడి అవసరం. బంగారం ధరలు వరుసగా మారుతూ ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ లో మార్పులు చాలా నెమ్మదిగా జరిగే అవకాశం ఉంది. దీని వల్ల కొంతమంది పెట్టుబడిదారులు దీన్ని మరింత స్థిరమైనది గా భావిస్తారు. నిపుణుల సూచనల ప్రకారం, బంగారం మరియు రియల్ ఎస్టేట్ రెండింటినీ కలిపి పెట్టుబడి వ్యూహం మరింత సమతుల్యమైనదిగా ఉంటుంది.
ఎలాంటి పరిస్థితుల్లో, ఏ పెట్టుబడిని ఎంచుకోవాలి? తక్కువ మొత్తంలో పెట్టుబడి చేయాలనుకునే వారు, మరియు అవసరానికి తక్షణంగా డబ్బు కావాల్సిన వారు బంగారాన్ని ఎంచుకోవచ్చు.
లాంగ్ టర్మ్ పెట్టుబడి దృష్టితో, రెంటల్ ఆదాయం ఆశించే వారు రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపాలి.
పెట్టుబడి అనేది వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలు మరియు రిస్క్ పై ఆధారపడి ఉంటుంది. చివరగా చెప్పాలంటే, బంగారం గానీ, స్థిరాస్తి గానీ - రెండూ మన ఆర్థిక భవిష్యత్తును భద్రంగా ఉంచగలిగే పెట్టుబడులే.
అయితే, ఏది మంచిదో అన్నది ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితులు, అవసరాలు, లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. తక్షణ అవసరాల కోసం మీరు బంగారాన్ని ఎంచుకోవచ్చు, దీర్ఘకాలిక పెట్టుబడి, ఆదాయ మార్గం కోసం స్థిరాస్తి సరియైనది. తెలివిగా ఆలోచించి, మీ అవసరాలకు తగిన పెట్టుబడి ఎంపిక చేసుకోవడమే ఉత్తమ నిర్ణయం అవుతుంది.
More From GoodReturns

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications