మనదేశంలో బంగారం (Gold) అనేది ఎప్పుడూ ఒక నమ్మకమైన పెట్టుబడిగా ఉండేది. అయితే ప్రపంచానికి మాత్రం బంగారం విలువ ఈ మధ్య కాలంలో బాగా తెలిసింది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు మనం రూ.2 లక్షలు బంగారంలో పెట్టుబడి పెడితే 2030 నాటికి ఎంత సంపాదించవచ్చో తెలుసుకుందాం.

గత రెండు దశాబ్దాలలో బంగారం వృద్ధిరేటు అద్భుతంగా ఉంది. 2000వ సంవత్సరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర(gold rate news) కేవలం రూ.4,400 ఉండగా..ఈరోజు అది రూ.1.25 లక్షల మార్క్‌ను దాటింది. ఈ 25 ఏళ్లలో బంగారం సగటున 14 శాతం వార్షిక వృద్ధి రేటు(CAGR) సాధించింది.
రూ. 2 లక్షలు పెడితే..
ప్రస్తుతం పండుగల సీజన్ అలాగే అంతర్జాతీయ మార్కెట్లలోని స్వల్ప మార్పుల కారణంగా బంగారం ధరల్లో కొంచెం తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 1,27,910 ఉంది. ఈ సమయంలో మీరు రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే సుమారు 16 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం కొనొచ్చు. అదే 22 క్యారెట్ల బంగారం అయితే సుమారు 17 గ్రాముల వరకూ వస్తుంది.
2030 నాటికి ఎంత అవుతుంది?
బంగారం ధరలు పెరగడానికి కారణమైన ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి పరిస్థితులు రాబోయే సంవత్సరాల్లో కూడా ఇలాగే కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి గతంలో బంగారం సాధించిన 14% CAGR వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుంటే... మీరు పెట్టుబడి పెట్టిన రూ. 2 లక్షల విలువైన బంగారం.. 2030 నాటికి రూ.4 లక్షలు దాటే అవకాశం ఉంది. అంటే పెట్టుబడి రెట్టింపు అవుతుంది. అయితే ఇది కేవలం అంచనా మాత్రమే.
ధరలు ఇంకా పెరిగితే..
ఇకపోతే కొన్ని నివేదికలు బంగారానికి డిమాండ్ ఊహించిన దాని కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,50,000 లేదా అంతకంటే ఎక్కువ రూ.5,00,000 వరకు కూడా చేరవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ అంచనా నిజమైతే. మీ రూ. 2 లక్షల పెట్టుబడి విలువ రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.
ఎలాగైనా లాభమే..
బంగారంలో పెట్టుబడి అనేది కేవలం లాభాన్ని మాత్రమే కాకుండా, మీ ఆర్థిక భవిష్యత్తుకు భద్రతను కూడా అందిస్తుంది. మీరు ఇప్పుడు రూ. 2 లక్షల పెట్టుబడి పెడితే కచ్చితంగా అది ఫ్యూచర్ లో లాభాలను సాధిస్తుంది. ఓవరాల్ గా బంగారం రేటు పెరగడం తప్ప తగ్గడం అనేది అసాధ్యం. కాబట్టి మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి బంగారం ఒక బలమైన పునాది అవుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications