బంగారం కొనుగోలు చేయవచ్చా? వడ్డీ రేట్లు తగ్గితే మాత్రం...
దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి ధర క్రితం సెషన్ ప్రారంభంలో పెరిగినప్పటికీ, సాయంత్రానికి తగ్గింది. నిన్న అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.140 వరకు క్షీణించి రూ.47,141 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 6.70 డాలర్లు తగ్గి 1,777 డాలర్లకు క్షీణించింది. అయినప్పటికీ ఈ వారంలో బంగారం ధరలు కాస్త పెరిగాయి. గతవారం 47,000 దిగువన ట్రేడ్ అయిన పసిడి ఇప్పుడు ఈ మార్కును క్రాస్ చేసింది.
ఓ సమయంలో 48,000 దిశగా పరుగులు పెట్టింది. పసిడి ధరలు మరింత కాలం ఊగిసలాటలో లేదా పెరుగుదలతో కనిపించే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.9000 తక్కువగా ఉంది. 16వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా తగ్గా, 17న స్వల్పంగా పెరిగింది. 18న మళ్లీ తగ్గింది. మొత్తానికి పసిడి ధరలు కాస్త పైచూపులు చూస్తున్నాయి.

బంగారం ధరలు గతవారం ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు ఆగస్ట్ 6వ తేదీ నుండి 11వ తేదీ మధ్య డిప్రెషన్‌లో ఉన్నాయి. అమెరికా ఉద్యోగాల డేటా సానుకూలంగా ఉంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా నుండి క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో కార్యకలాపాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో బంగారం ధరలు కూడా రికవరీలో ఉన్నాయి. ఆగస్ట్ 12వ తేదీ నుండి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఆగస్ట్ 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు బంగారం ధరలు పెరుగుతూనే వచ్చాయి. 12వ తేదీన రూ.260, 13న రూ.320, 14న రూ.450 పెరిగాయి. గత శనివారం భారత్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.46,310, 24 క్యారెట్ల పసిడి రూ.47,310గా ఉంది.
ఎంసీఎక్స్ ఫ్యూచర్‌లో ఈ నెల 13వ తేదీన బంగారం ధర రూ.46,930 పలికింది. అంతకుముందు ముగింపుతో పోలిస్తే ఇది 1.2 శాతం అధికం. బంగారం ధర నాడు రూ.567 పెరిగింది. అప్పటి నుండి 17వ తేదీ సాయంత్రం సమయానికి ఎంసీఎక్స్‌లో బంగారం ధర 0.63 శాతం పెరిగింది. అమెరికా జాబ్ డేటా సానుకూలంగా కనిపించడంతో గత వారం కాస్త తగ్గిన పసిడి ధరలు, ఈ వారం మాత్రం మళ్లీ పుంజుకున్నాయి.

బంగారం కొనుగోలు చేయవచ్చు
భారత్‌లో బంగారం ధరలు పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ పైన ఆధారపడి ఉంటాయి. అమెరికాలో వడ్డీ ధరలు ఇంకా పెరగలేదు. ఈ ప్రభావం బంగారంపై ఉంటుంది. దేశంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఎలాంటి సంకేతాలు లేనందున సమీప భవిష్యత్తులో లాభాలకోసం ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

వడ్డీ రేట్లు తగ్గితే మాత్రం..
అయితే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ లేదా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచినట్లయితే బంగారం ధరలు మళ్లీ తగ్గిపోవచ్చు. గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి ప్రభావం కార్యకలాపాలపై, వడ్డీ రేట్లపై, తద్వారా బంగారం ధరలపై పడుతోంది. బంగారంపై పెట్టుబడి దీర్ఘకాలంలో మాత్రం నిక్కచ్చితంగా మంచి పెట్టుబడిగా భావించవచ్చు.


Click it and Unblock the Notifications