బంగారం గత కొంతకాలంగా రూ.1800 డాలర్ల పరిధిలో కదలాడుతోంది. దేశీయంగా రూ.47,000 నుండి రూ.48,000 మధ్య ఉంటోంది. ఇటీవల 1800 డాలర్లు దాటిన తర్వాత పసిడి మరింత పుంజుకుంటుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు భావించారు. అయితే పసిడి ఫ్యూచర్స్ మళ్లీ 1800 డాలర్ల దిగువకు వచ్చింది. నేడు మధ్యాహ్నం సమయానికి 1798 డాలర్ల వద్ద ఉంది. ఓ సమయంలో 1792 డాలర్ల స్థాయిలో కూడా ట్రేడ్ అయింది. బంగారం ఎటు వైపు వెళ్తుంది, ఇప్పుడు కొనుగోలు చేయాలా వద్దా, ఎప్పుడు కొనుగోలు చేస్తే మంచిది అనే అంశం ప్రస్తుతం చాలామందికి ప్రశ్నగా మారిపోయింది. అయితే బంగారం ధరలు ఎలా ఉండే అవకాశముందో చూద్దాం...

ఆ ధరతో రూ.3000 తక్కువ
బంగారం ధరలు 2020 ఆగస్ట్ 7వ తేదీన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200ను చేరుకున్నాయి. ప్రస్తుతం ఆగస్ట్ సమీపిస్తున్న తరుణంలో అదే గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,000 వద్ద ఉంది. ఈ ఏడాది ప్రారంభం రూ.50,000కు కాస్త అటు ఇటుగా ప్రారంభమైంది. ఈ ఏడాది ఓ సమయంలో రూ.44,000 దిగువకు కూడా పడిపోయింది. అనంతరం సెకండ్ వేవ్ కారణంగా తిరిగి రూ.50వేలను తాకింది. సెకండ్ వేవ్ తగ్గిపోయిన తర్వాత మళ్లీ రూ.470000 స్థాయికి వచ్చాయి. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9000 వరకు తక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే రూ.3000 తక్కువగా ఉంది.

బంగారంపై వీటి ప్రభావం
బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 1800 డాలర్ల దిగువకు ఎందుకు పడిపోయింది? అంటే FOMC నేడు భేటీ కానుంది. ట్రేడర్స్ అప్రమత్తంగా ఉన్నారు. డాలర్ ఇండెక్స్ కూడా గరిష్ట స్థాయికి చేరుకుంది. మార్కెట్ వాచ్ ప్రకారం చివరగా 0.04 శాతం క్షీణించి 92.61 వద్ద ట్రేడ్ అయింది. డాలర్ లేదా యూఎస్ బెంచ్ మార్క్ బాండ్ యీల్డ్స్ పడిపోతే బంగారానికి సానుకూలంగా మారుతుంది.

ఎప్పుడెంత పెరిగిందంటే
2020లో బంగారం ఆల్ టైమ్ గరిష్టం చేరుకున్న తర్వాత, 2021 క్యాలెండర్ ఏడాది మార్చితో ముగిసిన మొదటి త్రైమాసికానికి 1900 డాలర్ల నుండి 1744 డాలర్లకు పడిపోయింది. దాదాపు ఇది 8 శాతం తగ్గుదల. దేశీయంగా రూ.49,940 నుండి రూ.44,370కి పడిపోయింది. ఈ క్షీణత 11 శాతం.
ఇక ఏప్రిల్ 1వ తేదీ నుండి జూన్ 30వ తేదీకి రూ.44,370 నుండి రూ.46,740కి పడిపోయింది. ఇది 5 శాతం జంప్. జూలై 27వ తేదీ నాటికి రూ.47,870కి చేరుకున్నాయి. 2021 జనవరి నుండి ఇది నాలుగు శాతం క్షీణత. ఈ ఎనిమిది నెలల కాలంలో బంగారం రూ.44వేల నుండి రూ.50వేల మధ్య కదలాడాయి.

బంగారం ధరలు ఇలా
జనవరి 1వ తేదీన దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి రూ.49,940గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 1900 డాలర్లు ఉంది.
మార్చి 31వ తేదీన దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి రూ.44370గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 1744 డాలర్లు ఉంది.
ఏప్రిల్ 1వ తేదీన దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి రూ.44370గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 1708 డాలర్లు ఉంది.
జూన్ 30వ తేదీన దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి రూ.46740గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 1778 డాలర్లు ఉంది.
జూలై 27వ తేదీన దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి రూ.47870గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 1797 డాలర్లు ఉంది. అయితే ఓ సమయంలో 1800 డాలర్లు దాటింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications