దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు గతవారం రూ.47,000 క్రాస్ చేశాయి. చివరి సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు రూ.200 పెరిగింది. గతవారం గోల్డ్ ఫ్యూచర్ ధర రూ.800 వరకు పెరిగింది. రూ.46,200 పైన ప్రారంభమైన పసిడి వారాంతానికి రూ.47,013కు చేరుకుంది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో రూ.186.00 (0.40%) పెరిగి రూ.47013.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.250.00 (0.53%) పెరిగి రూ.47237.00 వద్ద క్లోజ్ అయింది.
ఇక డిసెంబర్ సిల్వర్ కిలో చివరి సెషన్‌లో రూ.539.00 (0.88%) పెరిగి రూ.61797.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.580.00 (0.94%) పెరిగి రూ.62270.00 వద్ద ట్రేడ్ ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.95 (-0.11%) డాలర్లు క్షీణించి 1,757.25 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.022 (+0.10%) పెరిగి 22.680 డాలర్ల వద్ద ముగిసింది.

ఇదిలా ఉండగా, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ETFs)లోకి మొత్తం ఫండ్ ప్రవాహాలు సెప్టెంబర్ నెలలో ప్రతికూలంగా ఉండటంతో పెట్టుబడిదారులు తమ గోల్డ్ ఎక్స్‌పోజర్‌న తగ్గించుకున్నట్లుగా కనిపిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వరుసగా రెండో నెల గోల్డ్ ఔట్ ఫ్లో పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం జూలై నెలలో ఔట్ ఫ్లో 22.4 టన్నులుగా ఉంది.
గత నెల రోజుల్లో బంగారం ధరలు నాలుగు శాతం వరకు తగ్గింది. ఈ ప్రభావం బులియన్ మార్కెట్ పైన ఉంది. సెప్టెంబర్ నెలలో దేశీయ గోల్డ్ ఈటీఎఫ్స్ రూ.446 కోట్ల ప్రవాహం ఉంది. బంగారంపై పెట్టుబడులు స్వల్పంగా తగ్గినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications