ఈ సంవత్సరం బంగారం ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. దీంతో చాలామంది తమ దగ్గర ఉన్న బంగారంతో డబ్బు ఎలా సంపాదించొచ్చా అని ఆలోచిస్తు్న్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ లీజింగ్ బిజినెస్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు చాలామంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని గోల్డ్ రిఫైనరీ వాళ్లకు లీజుకు ఇచ్చి వడ్డీ సంపాదిస్తున్నారు. ఇదెలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.

గోల్డ్ లీజ్ కు ఇవ్వడం అనేది ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న బెస్ట్ గోల్డ్ బిజినెస్(gold business) ఐడియా. చాలామంది సంపన్నులు తాము దాచుకున్న బంగారు కడ్డీలు, గోల్డ్ కాయిన్స్ వంటి వాటిని జువెలరీ మేకర్స్ కు లీజుకు ఇస్తున్నారు. తద్వారా వారు వడ్డీ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు.
బిజినెస్ ఫార్ములా ఇదే..
ఈ బిజినెస్ ఫార్ములా చాలా సింపుల్. గోల్డ్ ను కరిగించి ఆభరణాలు చేసేవాళ్లకు మీ దగ్గర ఉన్న బంగారాన్ని లీజుకి ఇవ్వాలి. దానికి గానూ వాళ్లు వడ్డీ చెల్లిస్తారు. కొంతకాలం తర్వాత మీరు ఎంత బంగారం ఇచ్చారో అంతే తూకం కలిగిన బంగారాన్ని మీకు అప్పజెప్తారు. ప్రస్తుతం ఇలాంటి లీజులపై 2 నుంచి 4 శాతం రాబడి అందుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ రేట్లు 3 నుంచి 5% వరకూ ఉండేవి.
ప్రాసెస్ ఇలా.
గోల్డ్ లీజింగ్ అనేది ఒక రకమైన అప్పు లాగా పనిచేస్తుంది అయితే ఆ అప్పుని డబ్బు రూపంలో కాకుండా ఔన్సులలో లెక్కిస్తారు. పెట్టుబడిదారులు తమ బంగారాన్ని లీజింగ్ ప్లాట్‌ఫారమ్‌కు లేదా ఫైనాన్షియర్‌కు సరఫరా చేస్తారు.ఆ ప్లాట్‌ఫారమ్ ఆ బంగారాన్ని అవసరమైన వ్యాపారానికి అప్పుగా ఇస్తుంది. నగల వ్యాపారులు బంగారు ధరల్లో వచ్చే మార్పుల గురించి ఆందోళన చెందకుండా తమ ప్రొడక్షన్ ను కొనసాగించవచ్చు. వారు లీజు రేటును బంగారం రూపంలో చెల్లిస్తారు. గడువు ముగిసిన తర్వాత తిరిగి అంతే మొత్తంలో బంగారాన్ని చెల్లిస్తారు లేదా లీజును పొడిగిస్తారు.
రిస్క్‌లు ఇవే..
బంగారాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా కొన్ని రిస్క్‌లు ఉంటాయి. మొదటి రిస్క్ అప్పు తీసుకున్నవారు దాన్ని ఎగ్గొట్టడం. అంటే బంగారాన్ని తిరిగి చెల్లించకపోవడం. దీనివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే అప్పు తీసుకున్నవారు సకాలంలో బంగారాన్ని తిరిగి ఇవ్వలేక డీఫాల్ట్ అయినా లేదా తక్కువ స్వచ్ఛత ఉన్న బంగారాన్ని ఇచ్చి మోసం చేసినా ఇబ్బందే.
అయితే దీనికి సంబంధించి కొన్ని నమ్మదగిన ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. లీజుకి ఇచ్చేవాళ్లు పూర్తిగా నమ్మకం ఆధారంగా ముందకెళ్లాల్సి ఉంటుంది. బంగారం ధరలు పెరుగుతున్న ఈ సమయంలో ఈజీగా రాబడి పొందాలంటే ఈ తరహా బిజినెస్ కు ఎంచుకోవచ్చు. కానీ, ఇందులో ఉండే రిస్క్ లు కూడా గమనించి నిర్ణయం తీసుకుంటే మంచిది.
More From GoodReturns

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications