తక్కువ మొత్తంతో కూడా బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు! బెస్ట్ ఆప్షన్స్ ఇవే..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం అనేది సేఫ్ పెట్టుబడిగా మారింది. పెద్ద పెద్ద కంపెనీల నుంచి సామాన్యుల వరకూ అందరూ బంగారం కొనేందకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే బంగారం కొనాలంటే లేదా బంగారంలో పెట్టుబడి(Gold investment) పెట్టాలంటే దానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదని మీకు తెలుసా? మీ దగ్గర ఉన్న కొద్ది మొత్తాలతో కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉన్నా.. బంగారం విలువ మాత్రం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే బంగారంపై పెట్టుబడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మనదేశంలో బంగారం కొనడాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు. అందులోభాగంగానే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల కారణంగా చాలామంది బంగారు ఆభరణాలకు బదులు గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్స్ వైపు చూస్తున్నారు. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. నేరుగా డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయొచ్చు. లేదా గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇవి మార్కెట్ లోని బంగారం ధరల ఆధారంగా మారుతుంటాయి.
గోల్డ్ ఈటీఎఫ్
గోల్డ్ ఈటీఎఫ్ అంటే.. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని అర్థం. మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే చాలు సాధారణ షేర్లను కొన్నట్లే గోల్డ్ ఈటీఎఫ్‌లనూ కొనొచ్చు. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని బట్టి మీకు ఫండ్స్ ఇవ్వబడతాయి. రూ. 100 లేదా రూ.500తో కూడా మీరు గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టొచ్చ. అంతేకాకుండా మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా ఈ ఈటిఎఫ్ లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఈ ఫండ్స్ లో వచ్చే రాబడి బంగారం రాబడికి సమానంగా ఉంటుంది. పైగా ఇవన్నీ సెబీ అప్రూవ్ చేసిన ఫండ్స్ కాబట్టి సేఫ్టీ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదు.
గోల్డ్ ఫండ్స్
ఇకపోతే నెలనెలా కొంతమొత్తంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవాఱికి రకరకాల గోల్డ్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి గోల్డ్ ఈటీఎఫ్ లలాగే పనిచేస్తాయి. అయితే వీటిలో 95 నుంచి100 శాతం వరకూ పెట్టుబడిని గోల్డ్ ఈటీఎఫ్‌లకు కేటాయించబడుతుంది. మిగిలిన మొత్తం ప్రభుత్వ బాండ్స్ వంటి డెట్ ఫండ్స్ లో పెట్టుబడి పెడతారు. ఇవి కూడా బంగారం ధరలకు సమానంగా రిటర్న్స్ ఇస్తాయి. పూర్తిగా సేఫ్.
డిజిటల్ గోల్డ్
ఇక చివరిగా డిజిటల్ గోల్డ్ అనే ఆప్షన్ కూడా ఉంది. డిజిటల్ గోల్డ్ అంటే బంగారాన్ని ఫిజికల్ గా కాకుండా ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే పద్ధతి. పేటియం, ఫోన్ పే వంటి యాప్స్ లో ఈ సౌకర్యం ఉంటుంది. డిజిటల్ గోల్డ్ అనేది చాలా తక్కువ మొత్తంతో బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తుంది. ఉదాహరణకు మీరు రూ. 100 ఇన్వెస్ట్ చేస్తే.. మార్కెట్ ధర ఆధారంగా వంద రూపాయలకు ఎంత బంగారం వస్తుందో అంత బంగారం మీ పేరున పెట్టుబడిగా పెట్టబడుతుంది. అయితే వీటిలో పెట్టుబడి పెట్టేముందు ఆయా ప్లాట్ ఫామ్స్ నమ్మదగినవేనా? కాదా? అన్నది చూసుకోవాలి.


Click it and Unblock the Notifications