గోల్డ్ జ్యువెల్లరీ, ఇతర సంబంధిత ఐటమ్స్ పైన హాల్‌మార్కింగ్ తప్పనిసరి. ఈ మేరకు కేంద్రమంత్రిత్వ శాఖ లేదా కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్పష్టం చేసింది. బుధవారం (జూన్ 16)వ తేదీ నుండి దీనిని అమలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే మొదటి దశలో భాగంగా 256 జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వినియోగదారుల మెరుగైన రక్షణ, సంతృప్తి కోసం తమ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగుతాయని, ఇందులో భాగంగా జూన్ 16వ తేదీ నుండి 256 జిల్లాల్లో హాల్ మార్కింగ్ తప్పనిసరి అమలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం పెనాల్టీ లేదు
హాల్ మార్కింగ్‌కు సంబంధించి ప్రస్తుతానికి ఆగస్ట్ 2021 వరకు ఎలాంటి జరిమానా విధించబడదని, ఈ హాల్ మార్కింగ్ నిర్ణయం భారత్‌ను ప్రపంచ బంగారం మార్కెట్ కేంద్రంగా తయారు చేసే దిశగా తీసుకువెళ్తుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం జ్యువెల్లరీ వ్యాపారులు 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని విక్రయించాలి. ప్రభుత్వం గణాంకాల మేరకు గత అయిదేళ్ల కాలంలో దేశంలో 25% హాల్‌మార్కింగ్ కేంద్రాలు పెరిగాయి. ఏడాదికి దాదాపు 14 కోట్ల ఉత్పత్తుల సామర్థ్యం భారత్ కలిగి ఉంది.

గైడ్ లైన్స్
ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ఏడాదికి రూ.40 లక్షల లోపు టర్నోవర్ కలిగిన వ్యాపారులకు హాల్ మార్కింగ్ నిబంధన తప్పనిసరి కాదు. దేశవ్యాప్తంగా బిజినెస్ కలిగిన 256 జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధన అమలు చేస్తున్నారు. భారత ప్రభుత్వ వాణిజ్య విధానం ప్రకారం కొన్ని ఆభరణాలకు హాల్ మార్కింగ్ మినహాయించబడింది.

హాల్ మార్కింగ్ మినహాయింపు
మరో విషయం ఏమంటే 20 క్యారెట్లు, 23 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారానికి కూడా హాల్ మార్కింగ్ వెసులుబాటు ఉంది. కుధాన్, పోల్కి, జాడో వంటి ప్రత్యేక జ్యువెల్లరీ రకాలకు హాల్ మార్కింగ్ నుండి మినహాయించారు.


Click it and Unblock the Notifications