మన భారతీయ సంప్రదాయంలో గోల్డ్ అనేది సంతోషం, భద్రత, మరియు ఇన్వెస్ట్మెంట్ అన్ని కలిపిన ఆస్తి. కానీ ఈ రోజుల్లో, ఆర్థిక లాభం మరియు పెట్టుబడి విషయాలను పరిగణలోకి తీసుకుంటే, గోల్డ్ నాణేలు సరైన, స్మార్ట్ ఎంపిక అవుతుంది. మేకింగ్ చార్జ్‌లు, GST, రీసేల్ విలువ ఇవన్నీ మన పెట్టుబడికి పెద్ద ఫర్‌ఫెక్ట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఆభరణాలు తీసుకోవాలా లేదా గోల్డ్ నాణేలు తీసుకోవాలా ఏది మేలో చూద్దాం.
ఆభరణాలకు సాంస్కృతిక ప్రాధాన్యం, భావోద్వేగ విలువ ఉండవచ్చు, కానీ పెట్టుబడిగా చూస్తే నాణేలు చాలా స్మార్ట్ ఆప్షన్. గోల్డ్ నాణేలు మరియు ఆభరణాల మధ్య ప్రధాన తేడాలు మూడు విషయంలో ఉన్నాయి- తయారీ ఖర్చులు, పన్ను (GST), మరియు తిరిగి అమ్మినప్పుడు వచ్చే విలువ. ఆభరణాలు కొన్నప్పుడు తయారీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఇది తిరిగి అమ్మినప్పుడు తిరిగి పొందలేరు. GST కూడా ఈ ఖర్చుల పై లెక్కించబడుతుంది, కాబట్టి మొత్తం మొత్తం పెరుగుతుంది. నాణేల విషయంలో, తయారీ ఖర్చులు తక్కువగా ఉంటాయి, GST కూడా తక్కువగా వస్తుంది, మరియు మార్కెట్ రేట్లతో సమీపంగా విలువ కలిగినందున తిరిగి అమ్మినప్పుడు నష్టాలు తక్కువగా ఉంటాయి.

ఆభరణాలు కొన్నప్పుడు మేకింగ్ చార్జ్‌లు ఎక్కువగా సుమారు 10-20% ఉంటాయి, ఇవి రీసేల్ సమయంలో తిరిగి రాకుండా ఉంటాయి. అంటే ఆభరణాన్ని అమ్మినపుడు కేవలం గోల్డ్ విలువ మాత్రమే వస్తుంది, మేకింగ్ చార్జ్ డబ్బు కోల్పోతారు. నాణేలు చాలా సులభంగా ఉంటాయి. వాటి తయారీ ఖర్చు సుమారు 5% మాత్రమే, డిజైన్ కోసం అదనపు చార్జ్ లేదు, అందువల్ల వీటిని అమ్మడం సులభం. ఇవి కేవలం గోల్డ్ కంటెంట్ ఎక్కువ కాబట్టి, మార్కెట్ ధరకు దగ్గరగా ఉంటాయి.
మేకింగ్ చార్జ్ మరియు GST ను చూడడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకు, తనిష్క్ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ నాణేలు కొనుగోలు చేస్తే, గోల్డ్ ధర రూ. 1,06,250, మేకింగ్ చార్జ్ సుమారు 5% అయిన రూ. 5,312, GST (గోల్డ్ + మేకింగ్ చార్జ్ 3%) రూ. 3,346 అవుతుంది. మొత్తం ధర రూ. 1,14,909 పడుతుంది.
ఇక PC Jeweller 1 గ్రాము 24 క్యారెట్ల నాణేలు తీసుకుంటే, గోల్డ్ ధర సుమారు రూ. 11,740, మేకింగ్ చార్జ్ రూ. 639 (సుమారు 5%), GST రూ. 374 అవుతుంది. మొత్తం ధర రూ. 12,753 అవుతుంది. దీన్నిబట్టి నాణేలకు మేకింగ్ చార్జ్ తక్కువగా ఉండటంతో, GST కూడా తక్కువగా వస్తుంది కాబట్టి మొత్తం ఖర్చు కూడా ఆభరణాల కంటే చాలా తక్కువగా ఉంటుంది.
రీసేల్ విలువ గురించి చెప్పాలంటే, నిజమైన తేడా ఇక్కడే వస్తుంది. ఆభరణాలను తిరిగి అమ్మినప్పుడు 10-20% విలువ కోల్పోతారు, కొన్ని సార్లు జ్యూయెల్లర్లు అదనంగా డిడక్షన్ కూడా తీసుకుంటారు. కానీ గోల్డ్ నాణేలను అమ్మితే, అవి మార్కెట్ రేట్లకు దగ్గరగా ఉంటాయి, కాబట్టి నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి.
గోల్డ్ కొన్నప్పుడు కొన్ని సులభ చిట్కాలు ఫాలో అవ్వండి. నాణేలు కోసం మేకింగ్ చార్జ్ సుమారు 5% మాత్రమే ఉన్న జ్యూయెల్లర్ వద్ద కొనడం మంచిది. GST 3% ప్రతి గోల్డ్ కొనుగోలులో ఉంటుంది. పెట్టుబడికి నాణేలే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే వాటిని తిరిగి అమ్మినప్పుడు నష్టం తక్కువ ఉంటుంది. కానీ భావోద్వేగం లేదా సాంస్కృతిక విలువ కోసం కొనాలంటే, ఆభరణాలు ఇంకా సరైన ఎంపిక అవుతాయి.
భారత కుటుంబాల్లో గోల్డ్ ఒక నమ్మకమైన ఆస్తి. పెట్టుబడి, రీసేల్ విలువ, తక్కువ ఖర్చు దృష్ట్యా నాణేలు ఆభరణాల కంటే మెరుగైనవి. కాబట్టి, తదుపరి గోల్డ్ కొనుగోలు చేస్తున్నప్పుడు, సంప్రదాయ ఆభరణాలకు మించిపోకుండా నాణేలను ఫ్రెండ్‌లీ, స్మార్ట్ ఆప్షన్ గా పరిగణించండి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications