ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరోసారి గోల్డ్ బాండ్స్/బంగారం బాండ్స్ జారీ ప్రక్రియ సోమవారం (జూలై 6వ తేదీ) నుండి ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఇటీవల బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. బుధవారం ఎంసీఎక్స్‌లో పసిడి 10గ్రాములు రూ.48,982తో ఆల్ టైమ్ హైకి చేరుకుంది. భారత ప్రభుత్వం తరఫున ఆర్బీఐ వీటిని జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజా పసిడి బాండ్స్ ధర, ఇష్యూ తేదీ గురించి...

సావరీన్ గోల్డ్ ధర, సమయం
సావరీన్ గోల్డ్ బాండ్ జారీ ధరను గ్రాముకు రూ.4,852గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీన (సోమవారం) గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 10వ తేదీన ముగుస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీ నుండి సెప్టెంబర్ వరకు 6 విడతల్లో సావరీన్ గోల్డ్ బాండ్స్ జారీ చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

వారికి రూ.50 తక్కువ, నెలరోజుల్లో రూ.2,000 పెరుగుదల
ఆన్ లైన్ ద్వారా సబ్‌స్క్రిప్షన్ చేసుకొని డిజిటల్ మార్గంలో చెల్లింపులు చేస్తే రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. అంటే డిజిటల్ మోడ్‌లో చెల్లింపులు జరిపే వారికి రూ.రూ.4,802కే గ్రాము పసిడి లభిస్తుంది. జూన్ 8వ తేదీ నుండి 12వ తేదీ మధ్య జారీ చేసిన పసిడి బాండ్స్ ధర గ్రాముకు రూ.4,677గా ఉన్న విషయం తెలిసిందే. అంటే నెల రోజుల్లోనే గ్రాముకు దాదాపు రూ.175కు పైగా పెరిగింది. అంటే 10 గ్రాములకు రూ.1,750కి పైగా పెరిగింది.

గోల్డ్ బాండ్స్‌పై వడ్డీ...
- భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని 2015లో కేంద్రం ప్రారంభించింది.
- బ్యాంకు ద్వారా సబ్‌స్క్రైబ్ కావొచ్చు. పోస్టాఫీస్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజెస్.. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ లేదా నేరుగా ఏజెంట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
- పసిడి బాండ్స్ కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు సంవత్సరానికి 2.50 శాతం వడ్డీ రెండు దభాలుగా చెల్లించబడుతుంది. ఇది ఇష్యూ జారీ చేసిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తారు.

పన్నులు.. నిష్క్రమణ
- సావరీన్ గోల్డ్ బాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్ను విధించరు. సావరీన్ గోల్డ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలకు పన్ను వర్తించదు. పెట్టుబడిదారులను భౌతిక బంగారు పెట్టుబడుల నుండి బాండ్స్ వైపు ప్రోత్సహించేందుకు అందించే ప్రత్యేక ఆదాయ పన్ను ప్రయోజనం. మూలధన లాభాల పన్ను నుంచి పన్ను మినహాయింపు గోల్డ్ ఈటీఎప్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో లేదు.
- బాండ్స్ కాలపరిమితి ఎనిమిదేళ్లు కాగా ముందే నిష్క్రమించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. ఎక్స్చేంజీలో లిస్టయిన బాండ్స్‌ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించాలి. లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదో సంవత్సరం తర్వాత బాండ్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలో మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఎక్స్చేంజీల ద్వారా విక్రయిస్తే కొనుగోలు చేసిన తేదీ నుండి మూడేళ్ల లోపు ఉండే స్వల్పకాలంగా పరిగణిస్తారు. మీ స్థూల మొత్తం ఆదాయానికి జోడించి వ్యక్తిగత ఆదాయ స్లాబ్ వద్ద ఆదాయపు పన్ను వర్తిస్తుంది. మూడేళ్లకు పైబడి ఉండే దీర్ఘకాలిక లాభాలు 20.8 శాతం పన్ను వర్తిస్తుంది.

ఎంత కొనుగోలు చేయవచ్చు?
- కనీసం ఒక గ్రాము నుండి 4 కిలోల వరకు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు వంటివి అయితే 20 కిలోలు కొనుగోలు చేయవచ్చు. బాండ్ కొనుగోలు చేసిన సమయానికి ముందు ఇండియా బులియన్, జ్యువెల్లరీస్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం మూడు రోజుల ధరల సరాసరిని ఆధారంగా తీసుకొని బాండ్స్ విక్రయిస్తారు.
- ఈ బాండ్స్ ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. బాండ్స్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎలాంటి మూలధన పన్ను చెల్లించకుండా పూర్తి డబ్బును పొందవచ్చు. ఒకవేళ పెట్టుబడిదారు మధ్యలో తన బాండును ఇతరులకు బదలీ చేస్తే దీర్ఘకాలిక మూలధన వడ్డీ చెల్లించాలి.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

Silver: బంగారం vs వెండి.. యుద్ధాల సమయంలో ఏది బెటర్? నిపుణుల విశ్లేషణ ఇదే!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications