దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో గతవారం బంగారం ధరలు పెరిగాయి. అలాగే స్టాక్ మార్కెట్లు కూడా లాభపడ్డాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,000 దాటింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1760 డాలర్ల స్థాయిలో ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ అంతర్జాతీయ మార్కెట్లో 23 డాలర్ల దిశగా ఉండగా, ఎంసీఎక్స్‌లో రూ.62,000 దిశగా కనిపిస్తోంది. ఎంసీఎక్స్‌లో గతవారం బంగారం ధరలు రూ.800కు పైగా పెరిగాయి. మార్కెట్ విషయానికి వస్తే సెన్సెక్స్ గతవారం 59,000 దిగువన ప్రారంభమై, 60,000 పైన క్లోజ్ అయింది. అంతకుముందువారం అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్ నష్టపోయింది. గతవారం భారీగా లాభపడింది. ఈ వారం మార్కెట్ సానుకూలంగా ఉంటుందని, అలాగే గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్ దాదాపు స్థిరంగా లేదా క్షీణించవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వీటి ప్రభావం
అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, కార్పోరేట్ కంపెనీల మెరుగైన అంచనాలతో గతవారం మార్కెట్లు లాభపడ్డాయి. స్టాక్ అలాగే, రంగం ఆధారంగా మార్కెట్లు లాభపడ్డాయి. కేంద్రబ్యాంకు ఆర్బీఐ వడ్డీ రేటును స్థిరంగా కొనసాగించింది. స్థిర వృద్ధి కోసం సర్దుబాటు ధోరణి కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్భణం, వృద్ధి అంచనాల్లో మార్పులు చేయలేదు. మూడీస్ కూడా సార్వభౌమ రేటింగ్‌ను ప్రతికూలం నుండి సానుకూలానికి సవరించింది. FY22 జీడీపీ వృద్ధి రేటు 9.3 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది. ఫిచ్ రేటింగ్ మాత్రం అంచనాలు పెంచింది. అమెరికా బాండ్ యీల్డ్స్ పెరగడం, ముడి చమురు ధరల పరుగు, భారత వృద్ధి రేటు అంచనాలను ఫిచ్ రేటింగ్స్ తగ్గించడంతో చివరలో మార్కెట్ దూకుడు తగ్గడానికి కారణమైంది. అయితే ఈ వారం మార్కెట్ కాస్త సానుకూలంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. బ్యారెల్ ముడి చమురు ధర 82 డాలర్లు దాటింది.

నిరోధకం
ద్రవ్య లభ్యతపై ఆర్బీఐ వ్యాఖ్యలు సానుకూలంగా ఉండటంతో ఈ వారం మార్కెట్లు సానుకూలంగా ఉండే అవకాశముంది. నిఫ్టీ 18000 వద్ద నిరోధకం ఉందని, దీనిని అధిగమిస్తే మాత్రం 18150 నుండి 18250 మధ్య కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సెన్సెక్స్ మద్దతు 59,595, నిరోధకస్థాయి 60,500, 61,000.
దసరా పర్వదినం సందర్భంగా ఈ వారం నాలుగు సెషన్స్ ఉండనుంది.
రంగాలవారీగా చూస్తే టెలికం, ఐటీ, ఎఫ్ఎంసీజీ రాణించవచ్చునని, చమురు రంగ షేర్లు కాస్త ఒడిదుడుకులకు లోను కావొచ్చునని చెబుతున్నారు. ఫార్మా, బ్యాంకింగ్ స్టాక్స్ నిలకడగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కొనుగోలు చేయవచ్చా?
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.47,000 దిగువకు వస్తే మరింత క్షీణించే అవకాశముందని, రూ.46,450 మద్దతు లభించవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరింత క్షీణిస్తే రూ.46,000 దిగువకు పడిపోవచ్చునని చెబుతున్నారు. అలాకాకుండా రూ.47,500 పైకి చేరుకుంటే రూ.47,500కు చేరుకోవచ్చునని, దానిని కూడా అధిగమిస్తే రూ.47,950 దిశగా వెళ్ళవచ్చునని చెబుతున్నారు. రూ.46,550 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.46,670 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications