Gold Price Today: గడచిన వారం రోజులుగా పసిడి ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. నిపుణుల అంచనా ప్రకారం 10 గ్రాముల గోల్డ్ రేటు 2030 నాటికి లక్ష రూపాయల మార్కుకు చేరుకుంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేటు దూకుడుతో MCXలో రేట్లు పెరిగాయి. ఔన్స్ బంగారం ధర స్వల్పంగా పెరిగిన తర్వాత 2665 డాలర్ల కంటే ఎక్కువకు చేరుకుని సరికొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ దూకుడు చూస్తున్న రిటైల్ కొనుగోలుదారులతో పాటు ధనికులు సైతం పసిడి వైపు కన్నెత్తి చూసేందుకే భయపడుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.6000 భారీ పెరుగుదలను నేడు నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7060, ముంబైలో రూ.7060, దిల్లీలో రూ.7075, కలకత్తాలో రూ.7060, బెంగళూరులో రూ.7060, కేరళలో రూ.7060, వడోదరలో రూ.7065, జైపూరులో రూ.7075, లక్నోలో రూ.7075, మంగళూరులో రూ.7060, నాశిక్ లో రూ.7063, అయోధ్యలో రూ.7075, బళ్లారిలో రూ.7060, గురుగ్రాములో రూ.7075, నోయిడాలో రూ.7575 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.6600 పెరుగుదలను చూసింది. దీంతో నేడు దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7702, ముంబైలో రూ.7702, దిల్లీలో రూ.7717, కలకత్తాలో రూ.7702, బెంగళూరులో రూ.7702, కేరళలో రూ.7702, వడోదరలో రూ.7707, జైపూరులో రూ.7717, లక్నోలో రూ.7717, మంగళూరులో రూ.7702, నాశిక్ లో రూ.7705, అయోధ్యలో రూ.7717, బళ్లారిలో రూ.7702, గురుగ్రాములో రూ.7717, నోయిడాలో రూ.7575గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7060గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7702 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
పసిడి పరుగులకు కారణాలు ఇవే..!!
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు తర్వాత చిన్న బ్రేక్ కూడా తీసుకోకుండా గోల్డ్ రేట్లు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి దారితీసిన ఇతర కారణాలను పరిశీలిస్తే.. యూఎస్ డాలర్ బలహీనత, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనాలో వడ్డీ రేటు తగ్గింపుల మధ్య ప్రారంభ ట్రేడ్‌లో ఎల్లో మెటల్ రికార్డు గరిష్ఠ స్థాయి రూ.76,000 స్థాయిని తాకింది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో MCX బంగారం 0.20% పెరిగి 10 గ్రాములకు రూ.75,150 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు సెషన్‌లో 1% కంటే ఎక్కువ జంప్ చేసిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. బలహీనమైన US డేటా లోతైన రేట్ల తగ్గింపుకు కేసును బలపరిచిందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications