రక్షా బంధన్.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి సంబంధించిన పర్వదినం. రక్షా బంధన్ రోజున ప్రతి అక్కా, చెల్లే తన సోదరుడికి రాఖీని కడుతుంది. రాఖీ కట్టిన సోదరికి ప్రతి సోదరుడు ఎంతో కొంత నగదును చేతిలో పెట్టడం లేదా గడియారం, మొబైల్ ఫోన్, దుస్తులు కొనివ్వడం చేస్తుంటారు. ఇదివరకు కేవలం వీటితో సరిపెట్టడం చేసేవారు. కానీ ఇప్పుడు తన సోదరి కోసం ప్రతి సోదరుడు కొత్తగా ఆలోచించాలి. నగదు చేతిలో పెడితే అది సెక్యూర్డ్ కాదు. ప్రస్తుత 'పెట్టుబడి' కాలంలో కాస్త కొత్తగా ఆలోచించి తన సోదరి పైన తనకు తోచిన మొత్తం ఇన్వెస్ట్ చేస్తే.. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫిక్స్డ్ డిపాజిట్, బంగారం కొనివ్వడం, బ్యాంకు అకౌంట్ తీయడం, షేర్లు కనుగోలు చేయడం, మ్యూచువల్ ఫండ్స్ బహుమతిగా ఇవ్వడం, ఇన్సురెన్స్ తీయడం లేదా ఇల్లు లేదా స్థలం వంటి వాటిని కొనివ్వడం చేస్తే కలకాలం గుర్తుండిపోతుంది.

రాఖీ బహుమతులు... భిన్నంగా
గతంలో సోదరీమణులకు ఇచ్చే బహుమతులకు భిన్నంగా ఇప్పుడు ఆలోచిస్తోంది యువత. సోదరి బాగుకోసం/రక్షణ కోసం/భవిష్యత్తు కోసం పెట్టుబడుల దిశగా మొగ్గు చూపుతున్నారు. 'తన సోదరుడు తనకు రక్షగా భావించి ప్రతి సోదరి ప్రతి సంవత్సరం ఈ పర్వదినం రోజున రాఖీ కడుతుంది. నాకు మీరే రక్ష అని సోదరుడికి విజ్ఞప్తిగా దీనిని కడుతుంది.' ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక రక్షణ చాలా ముఖ్యం. రాఖీ కట్టే తన సోదరికి ఏ సోదరుడైనా ఆర్థిక స్వాతంత్ర్యం ద్వారా ఆర్థిక రక్షణ కల్పించవచ్చు. ఇందుకు వివిధ పెట్టుబడి మార్గాలు ఉన్నాయి.

పెట్టుబడి బహుమతి
తన సోదరికి పెట్టుబడిని ప్రారంభించడం ద్వారా కూడా ఓ సోదరుడు బహుమతిని ఇవ్వవచ్చు. పెట్టుబడి ద్వారా ఇవ్వడమే ఓ సోదరుడు... తన సోదరికి ఇచ్చే అతిపెద్ద బహుమతి. మ్యూచువల్ ఫండ్ సిప్‌ను ప్రారంభించడానికి సోదరుడు సహాయం చేయవచ్చు. మీ తోబుట్టువుకు ఎప్పుడు ఆర్థిక రక్షణను లేదా రాబడిని ఇచ్చే బహుమతిని ఇవ్వడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. రక్షా బంధన్ రోజు ఓ సోదరికి సోదరుడు ఇవ్వగలిగే కొన్ని అంశాలను ఇక్కడ చూడండి.

ఇలా అండగా..
మీ సోదరికి ఉన్న వివిధ రకాల బిల్లులను చెల్లించడం ద్వారా ఆమె అప్పుల భారాన్ని తగ్గించడం మంచిది. కేకులు, పువ్వుల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని ఆమెకు ఉన్న రుణ భారాన్ని తగ్గించడం కోసం ఖర్చు చేయాలి.
రుణ భారం లేకుంటే ఆమె చేసే వ్యాపారానికి లేదా ఇతర వ్యాపకాల కోసం ఫండ్ రూపంలో సహాయం చేయాలి.
మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీంలలో పెట్టుబడి పెట్టడం ద్వారా ట్యాక్స్ బెనిఫిట్‌ను కల్పిస్తూ కొత్త మార్గాన్ని చూపాలి.

ఫిక్స్డ్ డిపాజిట్స్
మీ సోదరి పేరిట కొంత మొత్తాన్నిఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. వారి అవసరానికి అనుగుణంగా స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక సొమ్మును డిపాజిట్ చేస్తే మంచిది. అలాగే, ఏ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పైన వడ్డీ రేటు ఎక్కువగా ఉందో చూసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది.
బంగారాన్ని బహుమతిగా ఇవ్వడం ద్వారా సోదరికి రక్షణగా ఉండవచ్చు. బంగారం దీర్ఘకాలంలో మంచి పెట్టుబడి. అంతేకాదు ఆడవారికి నచ్చే ఆభరణం. తన పేరిట గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోను ఇన్వెస్ట్ చేయవచ్చు.
సోదరి పేరు మీద బ్యాంకు అకౌంట్ తీసి ఇవ్వడం మంచిది. ఆ అకౌంట్‌లో కొంత సొమ్మును వేయవచ్చు.
భవిష్యత్తులో మంచి ప్రతిఫలాలు అందించేందుకు అవకాశాలు ఉన్న షేర్లు, సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టాలి. బాండ్స్, డిబెంచర్స్‌లో వారి పేరు మీద ఇన్వెస్ట్ చేయాలి.
మ్యూచువల్ ఫండ్స్ గిఫ్టుగా ఇవ్వాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని పక్షంలో సిప్స్ ఎంచుకోవచ్చు. ఫండ్స్‌లో పెట్టుబడులు దీర్ఘకాలంలో మెరుగైన ప్రతిఫలాలు అందిస్తాయి. కరోనా నేపథ్యంలో అందరూ బీమా వైపు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీమా పథకాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications