హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎదో ఒక సందర్భంలో ఎంతో ఉపయోగకరంగా చేస్తుంది. ఎందుకంటే ఏదైనా అనుకోని సంఘటనలు, ప్రమాదాలు జరిగినపుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఖర్చులను కవర్ చేస్తాయి. ఒకోసారి ఇలాంటి పరిస్థితుల్లో చేతుల్లో డబ్బు లేకపోయినా ఇన్సూరెన్స్ ఒక ఆసరాగా ఉంటుంది కూడా.
అయితే ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో ముందుకు వస్తుంది, దీని ద్వారా పోస్టల్ శాఖలోని కస్టమర్లకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తారు. ఈ క్రమంలో పోస్టల్ శాఖ కూడా ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది. పోస్టల్ శాఖ ఈ కొత్త పథకం కింద రూ. 399 చెల్లిస్తే ప్రమాద బీమాను అందిస్తుంది. ఈ బీమా కింద ప్రమాదవశాత్తు ఒకరు మరణిస్తే మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తారు. ఒకవేళ ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే పోస్టల్ శాఖ ద్వారా కొంత డబ్బు అందించడం జరుగుతుంది.

రూ.399కి రూ.10 లక్షల వరకు బీమా: భారత ప్రభుత్వం ప్రజల కోసం ఈ కొత్త బీమా పథకాన్ని ప్రారంభించింది. పోస్టాఫీసులో సేవింగ్స్ చేసే వారు ఎవరైనా ఈ రూ.399 బీమా తీసుకోవచ్చు. ఈ స్కిం కింద ఇన్సూరెన్స్ మొత్తం చెల్లించిన తర్వాత అతనికి ఒక సంవత్సరం పాటు ఏదైనా ప్రమాదం జరిగితే రూ.10 లక్షలు అందుతాయి. తీవ్రంగా గాయపడితే రూ.60 వేలు బెనిఫిట్ కింద ఇస్తారు. అలాగే ప్రమాదం జరిగిన వ్యక్తిని ఒకచోటి నుంచి మరోచోటికి తీసుకెళ్తే వాహన ఖర్చు కింద రూ.25వేలు ఇస్తారు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్: పోస్టల్ డిపార్ట్మెంట్ అడిషనల్ సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందని తెలిపారు. 399తో ఈ పథకం మొదలవుతుందని, ప్రభుత్వం నామమాత్రపు ధరకు పెద్ద బీమాను అందజేస్తున్న ఈ పథకం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. ఒక సంవత్సరం పూర్తియిన తర్వాత ఈ
బీమా పథకాన్ని వచ్చే ఏడాదికి మళ్లీ రెన్యూవల్ చేసుకోవాలి. అలాగే ఈ బీమా ప్రయోజనాన్ని పొందాలంటే కస్టమరుకి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ తప్పనిసరి.
ఈ పథకం కింద ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చు: ఈ బీమా పథకం కింద రూ. 399 ప్రీమియం బీమా ఏదైనా ప్రమాదం జరిగితే 10 రోజుల పాటు ఆసుపత్రిలో రోజుకు రూ. 1000 చొప్పున అలాగే వారి కుటుంబానికి రవాణా కోసం రూ. 25,000, మరణం సంభవించినట్లయితే అంత్యక్రియల కోసం రూ. 5,000 వరకు అందిస్తారు. ఈ బీమా ప్రయోజనాలను మరింతగా తెలుసుకోవడానికి మీరు సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications