రోజుకు రూ.29 చెల్లిస్తే, ఒకేసారి రూ.4 లక్షలు వస్తుంది: ఈ స్కీం గురించి తెలుసుకోండి
లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) నాన్-లింక్డ్ పాలసీ ఆధార్ షీలా ప్లాన్. ఇది ప్రత్యేకంగా మహిళలకు ఉద్దేశించిన స్కీం. ఈ పాలసీతో రక్షణ, సేవింగ్స్ ప్రయోజనం ఉంది. మెచ్యూరిటీకి ముందే పాలసీదారు అకాల మరణం పొందితే పాలసీదారు కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. అలాగే పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి వస్తాయి. ఆటో కవర్, లోన్ సౌకర్యం అంశాలు మహిళల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో ఎల్ఐసీకి చెందిన ఆధార్ షీలా ప్లాన్ గురించి తెలుసుకుందాం.
ఎల్ఐసీ ఆధార్ షీలా ప్లాన్ ప్రయోజనాలు
ఎల్ఐసీ ఆధార షీలా ప్లాన్ తీసుకుంటే పలు ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం...
డెత్ బెనిఫిట్- పాలసీ వ్యవధిలో ఇన్సురెన్స్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే పాలసీ అమలులో ఉంటే(అంటే అన్ని ప్రీమియంలు క్రమంగా చెల్లిస్తే) డెత్ బెనిఫిట్స్ చెల్లిస్తారు. పాలసీ తీసుకున్న అయిదేళ్ల లోపు మరణిస్తే డెత్ అస్యూర్డ్ ఉంటుంది. అయిదేళ్ల తర్వాత మరణిస్తే, అలాగే మెచ్యూరిటీకి ముందు మరణిస్తే అస్యూర్డ్ డెత్ మొత్తం వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు ఉంటుంది. లేదా ప్రాథమిక బీమా మొత్తంలో 110 శాతం.

మెచ్యూరిటీ ప్రయోజనం- అన్ని ప్రీమియంలో సక్రమంగా చెల్లిస్తే, మెచ్యూరిటీ పూర్తయ్యాక మెచ్యూరిటీ పైన అస్యూర్డ్ మొత్తం ఉంటుంది.
వయస్సు- ఎనిమిదేళ్ల నుండి 55 ఏళ్ల మహిళలు టార్గెట్‌గా ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. అయితే ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఇతర బీమా పాలసీల మాదిరి పాలసీదారు మెచ్యూరిటీపై డబ్బును అందుకుంటారు. మరణానంతరం పాలసీదారు కుటుంబానికి ఆర్థిక కవరేజీ అందిస్తుంది.
వైద్య పరీక్షలు, మెచ్యూరిటీ- పాలసీదారుకు వైద్య పరీక్షలు అవసరం లేదు. ఈ పాలసీకి కనిష్టంగా పదేళ్లు, గరిష్టంగా 20 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. మెచ్యూరిటీ గరిష్ట వయో పరిమితి 70 ఏళ్లు.
ఆధార్ షీలా ప్లాన్ సమ్ అస్యూర్డ్ కనీస మొత్తం రూ.75,000. గరిష్ట సమ్ అస్యూర్డ్ రూ.3 లక్షలు. సగటున ప్రతిరోజు రూ.29 ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.4 లక్షల ప్రయోజనం పొందవచ్చు. ఉదాహరణకు 30 ఏళ్ల మహిళ రోజుకు 20 ఏళ్లకు గాను రూ.29 ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, మొదటి సంవత్సరంలో 4.5 శాతం పన్నుతో రూ.10,959 డిపాజిట్ చేస్తారు. తర్వాత సంవత్సరం రూ.10,723 అవుతుంది. ఇలా ప్రతి సంవత్సరం లెక్క వేసుకుంటే 20 ఏళ్లకు రూ.2,14,696 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.3,97,000 వస్తుంది.
ఎల్ఐసీ ఆధార్ షీలా ప్లాన్ ఫీచర్స్
- ఆటో కవర్ సౌకర్యం ఉంది.
- మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్లాన్.
- ఏల్ఐసీ ఆధార్ షీలా ప్లాన్ కనిష్ట ప్రీమియం ప్లాన్.
- ఈ పాలసీ కింద క్లిష్టమైన ఆనారోగ్యాలు కవర్ కాదనే విషయం గుర్తుంచుకోవాలి.
- లోన్ సౌకర్యం ఉంది. కానీ మూడేళ్ల తర్వాత ఉంటుంది.
- ఈ పాలసీ కోసం ఎల్ఐసీ యాక్సిడెంటల్ రైడర్, శాశ్వత వైకల్యం రైడర్స్‌ను నిర్వహిస్తోంది.
- మొదట చెల్లించని ప్రీమియం నుండి రెండేళ్లలో ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించే సౌకర్యం ఉంది.
- ఎల్ఐసీ ఆధార్ షీలా ప్లాన్ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ వర్తిస్తుంది.
- మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తంపై ట్యాక్స్ ఉండదు. అయితే సెక్షన్ 10(10D) కింద మాత్రమే.


Click it and Unblock the Notifications