LIC plan: రోజుకు రూ.262 ఇన్వెస్ట్ చేస్తే, చేతికి రూ.20 లక్షలు
దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పెద్ద బీమా సంస్థల్లో లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఉంది. పెట్టుబడి కోసం ఇది వివిధ రకాల పాలసీలను అందిస్తోంది. పాలసీదారులకు లేదా పెట్టుబడిదారులకు ఎల్ఐసీ స్కీమ్ సురక్షిత, రిస్క్-రహిత పెట్టుబడి ఎంపిక. ఆర్థిక రక్షణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, రిటైర్మెంట్ వంటి భవిష్యత్తు ప్రణాళిక వంటి వాటి కోసం ఎల్ఐసీ స్కీమ్ మంచి ఎంపిక. అలాంటి మంచి రిటర్న్స్ ల్ఐసీ ప్లాన్స్‌లో ఒకటి ఎల్ఐసీ జీవన్ లాభ్.

ఇదీ జీవన్ లాభ్ పాలసీ
ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ బీమా పైన పొదుపు చేసే ఎంపికతో కూడిన ఎండోమెంట్ పాలసీ. నాన్-లింక్డ్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, జీవిత బీమా పొదుపు ప్లాన్. ఫిబ్రవరి 1, 2020లో ఎల్ఐసీ ద్వారా ఇది తిరిగి ప్రారంభించబడింది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణిస్తే కుటుంబ సభ్యులకు ఈ పాలసీ ఆర్థిక సాయం అందిస్తుంది. బీమా కవర్‌లో హామీ మొత్తాన్ని పొందడం ద్వారా నామినీ ప్రయోజనం పొందుతారు. ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ పాలసీదారులకు పెట్టుబడిపై రుణం పొందే వెసులుబాటును కల్పిస్తుంది. 25, 21 లేదా 16 సంవత్సరాల మెచ్యూరిటీ కాలపరిమితితో ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో పాలసీదారు నుండి వరుసగా 16, 15 మరియు 10 సంవత్సరాల వ్యవధిలో రెగ్యులర్, నిరంతర పెట్టుబడి అవసరం.

గ్రేస్ పీరియడ్
పాలసీదారు ప్రీమియంను ప్రతి సంవత్సరం, అర్ధ సంవత్సరం, త్రైమాసికం లేదా నెల ప్రాతిపదికన చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లింపు కోసం గ్రేస్ పీరియడ్ ఉంటుంది. త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక డిపాజిట్లకు ముప్పై రోజులు, నెలవారీ ప్రీమియం చెల్లింపుకు 15 రోజులు. ఈ పాలసీని 8 సంవత్సరాల చిన్న వయస్సు నుండి కూడా పొందవచ్చు. 59 సంవత్సరాల వయస్సు వరకు పొందవచ్చు. ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ కింద రూ.2 లక్షల కంటే తక్కువ మొత్తాన్ని హామీ ఇవ్వవచ్చు. ప్లాన్ కింద పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది.

రోజుకు రూ.262 ఇన్వెస్ట్ చేస్తే...
పాలసీదారు నెలకు రూ.7916 ఇన్వెస్ట్ చేస్తే రూ.20 లక్షలు పొందవచ్చు. అంటే రోజుకు రూ.262. పదహారేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ఇరవై అయిదేళ్ల మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.20 లక్షలు వస్తాయి.


Click it and Unblock the Notifications