నెలకు రూ.10వేల వరకు పెన్షన్: PMVVY రిటర్న్స్ కాలిక్యులేటర్

సీనియర్ సిటిజన్స్‌కు ఆకర్షణీయ పథకాలు ఎన్నో ఉన్నాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం పెట్టుబడి పెట్టి, వృద్ధాప్యంలో పెద్ద మొత్తంలో పెన్షన్ తీసుకునే ప్రధానమంత్రి వయ వందన యోజన (PMVVY) స్కీంను తీసుకు వచ్చారు. సీనియర్ సిటిజన్స్‌కు ఫిక్స్డ్ రిటర్న్స్ ఇచ్చే పెన్షన్ స్కీమ్ ఇది. తొలుత దీని గడువు మార్చి 31, 2021 వరకు ఉండగా, కేంద్రం దీనిని మార్చి 31, 2023 వరకు పొడిగించింది. PMVVY పదేళ్ల పెన్షన్ స్కీమ్. వృద్ధాప్యంలో నెలవారీగా, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదివారీగా రెగ్యులర్ ఆదాయం పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. నిబంధనల మేరకు ఈ పథకంలో గరిష్టంగా రూ.15,000 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు అందే గరిష్ట పెన్షన్ రూ.10,000.

వారికి భద్రత

వారికి భద్రత

60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగినవారు ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితం కోసం దాచుకున్న డ‌బ్బును రిస్క్ కలిగిన ప‌థ‌కాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. మంచి రాబ‌డితో పాటు ప్ర‌భుత్వ హామీ కలిగిన ప‌థ‌కాల‌ను ఎంచుకుంటే, వారి డ‌బ్బుకు భ‌ద్ర‌త ఉంటుంది. అలాంటి స్కీమ్ PMVVY. ఇది సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు భ‌ద్ర‌త ఇస్తుంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో చేరడానికి అర్హులు. పదేళ్ల పాటు పెన్షన్‌కు హామీ ఉంటుంది. దీన్ని లైఫ్ LIC నిర్వహిస్తోంది. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది.

నామినీకి చెల్లింపు

నామినీకి చెల్లింపు

ఈ పథకం సీనియర్ సిటిజన్ల కోసం ఆఫర్ చేస్తున్నారు. ఎల్ఐసీ వెబ్ సైట్ ద్వారా లేదా ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదించి ఆఫ్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఒకసారికి ప్రీమియం చెల్లించి పాలసీలో చేరాలి. కనీసం రూ.1.50 లక్షలు, గరిష్టంగా రూ.15 లక్షలతో పాలసీను కొనుగోలు చేయవచ్చు. చెక్కు, డీడీ, బ్యాంకర్స్ ద్వారా దీనిని చెల్లించాలి.

PMVVY నిర్దేశించిన వడ్డీ రేటు ప్రకారం పదేళ్ల పాటు కచ్చితమైన పెన్షన్ వస్తుంది. ఈ పథకం డెత్ బెనిఫిట్ ఆఫర్ చేస్తోంది. పాలసీదారు మరణిస్తే బీమా కొనుగోలు ధరను నామినీకి చెల్లిస్తారు. మెచ్యూరిటీ నాటికి పాలసీదారు జీవించి ఉంటే పాలసీ కొనుగోలు చేసిన పదేళ్లకు ఎంత ప్రీమియంకు అయితే కొన్నామో ఆ మొత్తం ఇచ్చేస్తారు. దీంతో పాటు పెన్షన్ చివరి వాయిదాను పొందుతారు. పాలసీదారు లేదా పెన్షన్‌దారుకు అనుకోకుండా ఏమైనా జరిగితే మెచ్యూరిటీ సొమ్మును నామినీ లేదా చట్టబద్ద వారసులకు ఇస్తారు.

రుణ సదుపాయం

రుణ సదుపాయం

పెట్టుబడిపై నెల నెలా వడ్డీతో పెన్షన్ అందిస్తారు. ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై తగినట్లు నెలవారీ చెల్లింపులు ఉంటాయి. వడ్డీ ప్రస్తుతం 7.40 శాతంగా ఉంది. నెలకు రూ.1000 నుండి దాదాపు రూ.10వేల వరకు పెన్షన్ వస్తుంది. నెలకు వద్దనుకుంటే మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి కూడా వస్తుంది. ఎలక్ట్రానికి క్లియరింగ్ సర్వీస్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకు పెన్షన్ జమ అవుతుంది.

పాలసీ కొనుగోలు చేశాక మూడేళ్లకు రుణ సౌకర్యం ఉంటుంది. కొనుగోలు ధరలో గరిష్టంగా 75 శాతం రుణం ఇస్తారు.అత్యవసర సమయంలో సరెండర్ చేస్తే 98 శాతం పెట్టుబడిని వెనక్కి ఇస్తారు.

PMVVY కాలిక్యులేటర్

PMVVY కాలిక్యులేటర్

రూ.1000 కొనుగోలుపై శాంపిల్ పెన్షన్ రేట్ (SPR) ఇలా ఉంది.

Yearly: Rs. 83.00 per annum

Half-yearly: Rs. 81.30 per annum

Quarterly: Rs. 80.50 per annum

Monthly: Rs. 80.00 per annum

PMVVY కాలిక్యులేషన్ ఫార్ములా: ఇన్వెస్ట్ చేసిన మొత్తం X SPR)/ 1000. ఇక్కడ SPR అంటే శాంపిల్ పెన్షన్ రేటు.

PMVVYలో మీరు రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే మీ నెలవారీ పెన్షన్ రూ.6667 అవుతుంది.

రూ.1.5 లక్షల మినిమం పెట్టుబడి, రూ.15 లక్షల గరిష్ట పెట్టుబడిపై ఏడాది నుండి మూడు నెలల కాలంలో ఎంత వస్తుందంటే?

పెన్షన్ మోడ్: ఏడాదికి

Minimum Purchase Price : Rs 1,44,578

Maximum Purchase Price : Rs 14,45,783

పెన్షన్ మోడ్: ఆరు నెలలకు

Minimum Purchase Price : Rs 1,47,601

Maximum Purchase Price : Rs 14,76,015

పెన్షన్ మోడ్: మూడు నెలలకు

Minimum Purchase Price :Rs 1,49,068

Maximum Purchase Price :Rs 14,90,683

పెన్షన్ మోడ్: నెలకు

Minimum Purchase Price :Rs 1,50,000

Maximum Purchase Price :Rs 15,00,000

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+