ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండటం బెటర్.. 30 ఏళ్ల పాటు అప్పులు భరించలేమంటున్న జెన్ జెడ్ .. కారణం ఏంటంటే..

భారతదేశంలో సొంత ఇల్లు కలిగి ఉండటాన్ని దశాబ్దాలుగా ఒక గొప్ప సామాజిక హోదాగా.. ఆర్థిక భద్రతకు తిరుగులేని సంకేతంగా పరిగణించేవారు. అయితే రాబోయే తరం గృహ కొనుగోలుదారులైన జెన్ జెడ్, యువ మిలీనియల్స్ ఈ సాంప్రదాయ మార్గాన్ని పూర్తిగా మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఆస్తి ధరలు, ఉద్యోగాల్లో అనిశ్చితి, మారుతున్న కుటుంబ వ్యవస్థల కారణంగా యువత దీర్ఘకాలిక తనఖాతో ఇల్లు కొనేకంటే అద్దెకు ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత వివేక్ కౌల్ ఒక కథనంలో విశ్లేషించారు. గత తరాల వారు కొనుగోలు చేశారనే ఒకే ఒక్క కారణంతో రాబోయే తరాలు కూడా అదే బాటలో పయనిస్తాయని భావించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

యువ భారతీయులు సొంత ఇల్లు కొనడానికి వెనుకడగడానికి ప్రధాన కారణం ఆదాయాలకు, ఆస్తుల ధరలకు మధ్య ఉన్న అగాధమే. భవిష్యత్తులో ఉపాధి, ఆదాయ మార్గాలపై స్పష్టమైన పూచీకత్తు లేని ప్రస్తుత కాలంలో ఇరవై నుండి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ గృహ రుణాల భారాన్ని మోయడానికి నేటి యువత సుముఖంగా లేదు. రాబడిలో అనిశ్చితి ఉన్నప్పుడు అంత సుదీర్ఘకాలం రుణాలకు కట్టుబడి ఉండటం ప్రమాదకరమని భావిస్తున్న జెన్ జెడ్.. సొంత ఇంటి కంటే అద్దె ఇళ్లలోనే లేదా తల్లిదండ్రుల వద్దే నివసించడాన్ని సౌకర్యవంతంగా భావిస్తోంది. అంతేకాకుండా తమ సంపాదనను కేవలం ఒకే భౌతిక ఆస్తి రూపంలో ఇరుక్కుపోయేలా చేయడం కంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బంగారం లేదా క్రిప్టో వంటి ఆర్థిక ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి నేటి తరం ఆసక్తి చూపుతోంది.

Gen Z home buying Gen Z homeownership Gen Z housing India housing market Indian real estate market Gen Z renting rent vs buy home loan India home loan EMI housing affordability India property prices India affordable housing India rental market India real estate trends 2026 Gen Z real estate younger millennials housing long-term renting Indian property market housing crisis India Gen Z Gen Z home buying Gen Z homeownership India housing market

మరోవైపు దేశంలో మారుతున్న జనాభా గణాంకాలు కూడా గృహ విపణిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. భారతీయ కుటుంబాలు పరిమాణంలో చిన్నవిగా మారుతుండటం, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సగటున ఒక బిడ్డ మాత్రమే ఉండే సంస్కృతి పెరుగుతుండటంతో రాబోయే తరాలకు వేరే కొత్త ఇల్లు కొనాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుంది. దీనికి తోడు పాత తరానికి చెందిన అనేక ఇళ్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఖాళీగా లేదా తక్కువ వినియోగంలో ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ వారసత్వంగా పిల్లలకు, మనవళ్లకు సంక్రమించినప్పుడు మార్కెట్లో కొత్తగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే పెద్ద ఎత్తున ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. జనాభా పెరుగుదల రేటు మందగిస్తున్న ఈ తరుణంలో సరఫరా పెరిగి గృహ విపణి స్వరూపం మారనుంది.

Also Read

ఈ మార్పుల వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి డిమాండ్ పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేము కానీ.. ఆస్తుల యాజమాన్యం, వాటి వినియోగ శైలిలో గణనీయమైన మార్పులు రానున్నాయి. డెవలపర్లు కేవలం సొంత ఇల్లు అనే సెంటిమెంట్‌పై ఆధారపడకుండా, అందుబాటు ధరల్లో ఉండే గృహాలు, ప్రత్యేక అద్దె ప్రాజెక్టులు, చిన్నపాటి సౌకర్యవంతమైన నివాస స్థలాల నిర్మాణాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. యువత పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోకపోతే గృహ రుణ సంస్థలు, బ్యాంకులు సవాళ్లను ఎదుర్కోక తప్పదు. అయితే జెన్ జెడ్ ప్రవర్తనపై చేసే ఇటువంటి అంచనాలు కేవలం కొద్దిపాటి అవగాహనతో చేసిన ఊహాగానాలు మాత్రమేనని కౌల్ పేర్కొన్నారు. అయినప్పటికీ భవిష్యత్ భారత్‌లో ఆర్థిక భద్రతను కొలిచే ప్రామాణికంగా సొంత ఇల్లు కొనసాగుతుందా లేదా అనే ప్రశ్న రియల్ ఎస్టేట్ రంగాన్ని సరికొత్త ఆలోచనల వైపు నడిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+