విజయానికి పట్టుదల, కష్టపడేతత్వంతో పాటు ఓపిక కూడా చాలా అవసరం! స్టాక్ మార్కెట్లకు మాత్రం ఇది కచ్చితంగా యాప్ట్ అవుతుంది. వివిధ షేర్లపై పెట్టుబడి పెట్టి, కొన్నేళ్ల తర్వాత చూసుకుంటే అవి ఎన్నో రెట్లు పెరుగుతాయి. కొన్ని షేర్లు నష్టపోవడం కూడా ఉంటుంది. కానీ మార్కెట్ పరిస్థితులను అంచనా వేసి, నిపుణుల సలహాతో పెట్టుబడులు పెడితే ఎక్కువ శాతం సక్సెస్ కావొచ్చు. ఇటీవలి కాలంలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ షేర్లు జోరుమీద ఉన్న విషయం తెలిసిందే. ఇది ఎన్నో రెట్లు పెరిగింది. దశాబ్దాల క్రితం కొన్ని షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇప్పుడు లక్షలు, కోట్లు ఆదాయం కలిగిన వారు ఉన్నారు. అలాంటి షేర్లలో ఒకటి MRF.

రూ.11 ఇన్వెస్ట్ చేస్తే రూ.63,000!
ఈ ఏడాది MRF టైర్స్ షేర్లు పెద్దగా పెరగలేదు. గత ఏడాది డిసెంబర్ చివరి నాటితో పోలిస్తే ఈ డిసెంబర్‌లో కాస్త షేర్ వ్యాల్యూ తగ్గింది. కానీ 25 ఏళ్లు, 20 ఏళ్లు, 15 సంవత్సరాలు తీసుకుంటే మాత్రం ఈ షేర్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. రెండు దశాబ్దాల క్రితం ఇందులో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు పెద్ద మొత్తంలో వెనుకేసుకున్నట్లే లెక్క. 26 ఏళ్ల క్రితం రూ.11గా ఉన్న షేర్ ఇప్పుడు రూ.63,000కు పైగా ఉంది. ఇది 19 ఏళ్ల క్రితం రూ.500గా ఉంది.

రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.80 కోట్లు
MRF షేర్లు పెట్టుబడిదారులకు ఎన్నో రెట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఓ పెట్టుబడిదారు ఈ షేర్లలో 1993లో 26 లేదా 27 ఏళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టుబడిగా పెడితే సదరు ఇన్వెస్టర్ కార్పస్ 2018 ఏప్రిల్ నాటికి రూ.74 కోట్లకు పైగా అవుతుంది. ఇప్పుడు షేర్ రూ.63,000 పెరిగింది. అంటే రూ.80 కోట్ల వరకు ఉన్నట్లే.

మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ షేర్లు
గత ఏడాదికి అంటే పాతికేళ్లలో ఈ షేర్ ఇన్వెస్టర్‌కు ఏడున్నర లక్షల రెట్ల రిటర్న్స్‌ను అందించింది. 2001 ఆగస్ట్‌లో ఈ షేర్ ధర రూ.500గా ఉంది. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారి ఒక్కో షేర్ వ్యాల్యూ ఇప్పుడు రూ.63వేల కంటే పైకి చేరుకుంది. భారత్‌లో ఎంఆర్ఎఫ్ షేర్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్టాక్‌గా ఉంది.

మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ షేర్లలో కొన్ని
మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ షేర్లలో కొన్ని (డిసెంబర్ 20) ఎంఆర్ఎఫ్ (63,820), ఐచర్ మోటార్స్ (22,469), BOSCH (15,167.60) శ్రీ సిమెంట్ (20,468.15), పేజ్ ఇండస్ట్రీస్ (22,225.85), 3M INDIA (21,134.80) వంటివి ఉన్నాయి. వీటితో పాటు నెస్లే, బజాజ్ ఫిన్ సర్వ్ వంటివి ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications