1000 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన మరో కంపెనీ.. అకస్మాత్తుగా వచ్చిన సంపదపై సీఈఓ ఏమన్నారంటే..

From Employees to Millionaires: టెక్నాలజీ కంపెనీలలో ఉద్యోగులకు స్టాక్ కొనుగోలు పథకాల ద్వారా సంస్థ వృద్ధిలో భాగస్వామ్యం కల్పించే ధోరణి వేగంగా పెరుగుతున్న తరుణంలో.. ఏఐ చిప్ తయారీ దిగ్గజం సెరెబ్రాస్ (Cerebras) సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ ఆండ్రూ ఫెల్డ్‌మన్ (Andrew Feldman) తమ ఉద్యోగులకు ఆకస్మిక సంపద నిర్వహణపై కీలక సూచనలు చేశారు.

మే 2026లో ఒక్కో షేరు ఇష్యూ ధర 185 డాలర్ల వద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన సెరెబ్రాస్, ఐపీఓ ద్వారా బిలియన్ల డాలర్లను సమీకరించడమే కాకుండా సంస్థలో షేర్లు కలిగిన ఉద్యోగుల సంపదను గణనీయంగా పెంచింది. లిస్టింగ్ అనంతరం ఫెల్డ్‌మన్ సొంత వాటా విలువ సైతం సుమారు 3.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదనంగా సెరెబ్రాస్ 2026 ఉద్యోగి స్టాక్ కొనుగోలు పథకం (ESPP) కింద అర్హతగల ఉద్యోగులు పేరోల్ తగ్గింపుల ద్వారా 15 శాతం వరకు డిస్కౌంట్‌తో కంపెనీ షేర్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా పొందుతున్నారు.

Cerebras AI Cerebras CEO Cerebras employees millionaires 1000 employees millionaires AI company wealth creation sudden wealth management managing sudden wealth AI industry tech employees wealth millionaire employees financial planning advice artificial intelligence boom Cerebras AI Cerebras CEO 1000 AI AI

సోర్సరీ విత్ మోలీ ఓ'షే"కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. సుమారు $21.7 బిలియన్ల విలువ కలిగిన సెరెబ్రాస్ సీఈఓ, తమ కంపెనీ 1,000 మందికి పైగా ఉద్యోగులను కోటీశ్వరులను చేసిందని చెప్పారు. దీనిని ఆయన తన నాయకత్వంలోని ఒక ప్రధాన విజయంగా అభివర్ణించారు. ఫెల్డ్‌మన్ ప్రకారం.. రోజువారీ స్టాక్ కదలికలపై దృష్టి పెట్టకుండా, దీర్ఘకాలిక దృక్పథంతో పనిచేయమని కూడా కంపెనీ ఉద్యోగులకు సూచించారు.

Also Read

అయితే వ్యక్తిగత సంపదలో అకస్మాత్తుగా వచ్చే భారీ పెరుగుదల ఆనందంతో పాటు తీవ్ర మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుందని ఫెల్డ్‌మన్ హెచ్చరించారు. స్టాక్ మార్కెట్లో రోజువారీ, ఇంట్రాడేలో చోటుచేసుకునే హెచ్చుతగ్గులు ఉద్యోగుల ఆస్తుల విలువను క్షణాల్లో మార్చేస్తాయని చెబుతూ ఆయన తన గతానుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక్క రోజులోనే తన ఈక్విటీ విలువలో వచ్చిన మార్పు తన తండ్రి జీవితకాల సంపాదన కంటే ఎక్కువగా ఉండేదని, ఆ సమయంలో స్టాక్ ధర తగ్గినప్పుడల్లా తన తండ్రి ఆందోళనతో ప్రతిరోజూ ఫోన్ చేసేవారని వివరించారు. మార్కెట్ హెచ్చుతగ్గులను మనం నియంత్రించలేము కాబట్టి.. స్టాక్ ధర పెరిగినా తగ్గినా భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకుంటూ ఉద్యోగులు తమ రోజువారీ పనిపైనే దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు.

సంపదను కాపాడుకోవడానికి ఫెల్డ్‌మన్ ఉద్యోగులకు ప్రధానంగా నాలుగు ఆర్థిక సూత్రాలను సూచించారు.

మొదటిది పెట్టుబడుల వైవిధ్యీకరణ (Diversification): తమ మొత్తం సంపదలో 95 లేదా 99 శాతాన్ని ఒకే కంపెనీ షేర్లలో ఉంచడం అవివేకమని, ప్రైవేట్ లేదా లిస్టెడ్ దశలో అవకాశం వచ్చినప్పుడు కొంతమేర షేర్లను విక్రయించి ఆస్తులను సురక్షితం చేసుకోవడం వ్యక్తిగత ఆర్థిక నష్టాన్ని సమతుల్యం చేసుకునే మార్గమే తప్ప కంపెనీపై నమ్మకం లేకపోవడానికి సంకేతం కాదని స్పష్టం చేశారు.

రెండవది పెట్టుబడి నిర్ణయాలలో తొందరపడకపోవడం: పెద్ద మొత్తంలో నగదు అందిన వెంటనే ఫీజులు ఆశించే సలహాదారుల మాటలు విని తొందరపాటు పెట్టుబడులు పెట్టకుండా, కొంతకాలం ఆ నిధులను సురక్షితమైన మనీ మార్కెట్ ఖాతాలో ఉంచి ఆర్థిక పరిస్థితిని అవగాహన చేసుకున్న తర్వాతే ఇతర ఎంపికల వైపు చూడాలని సూచించారు.

మూడవది జీవిత ప్రాధాన్యతలను సమీక్షించుకోవడం: అకస్మాత్తుగా పెద్ద మొత్తం అందినప్పుడు ముందుగా అప్పులు తీర్చుకోవడం, కుటుంబానికి అండగా నిలవడం, దాతృత్వ కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. తాను మొదట తన కంపెనీని విక్రయించినప్పుడు అన్నింటికంటే ముందుగా తన గృహ రుణాన్ని (Home Loan) తీర్చివేయడం తనకు ఎంతో ప్రశాంతతనిచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు.

చివరగా, ఆర్థిక విజయం అనేది జీవితాన్ని మెరుగుపరచాలి తప్ప ఒత్తిడిని పెంచకూడదని..సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి తగినంత సమయం తీసుకోవడమే అత్యుత్తమ వ్యూహమని ఫెల్డ్‌మన్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+