For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాహనదారులకు శుభవార్త: డిసెంబర్ 1 నుంచి ట్రాన్సాక్షన్‌పై క్యాష్‌బ్యాక్

|

టోల్ ప్లాజా వద్ద వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర రోడ్డు రవాణా సంస్థ డిసెంబర్ 1వ తేదీ నుంచి FASTagను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 400 టోల్ ప్లాజాల వద్ద దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో అన్ని టోల్ ప్లాజాలలో అమలు చేయనున్నారు. అంటే FASTag ద్వారా డిజిటల్ చెల్లింపులు ఉంటాయి.

కారులో వెళ్తున్నారా.. మీ కోసమే, డిసెంబర్ 1 నుంచి FASTag తప్పనిసరి: ఏమిటిది.. ఎలా?కారులో వెళ్తున్నారా.. మీ కోసమే, డిసెంబర్ 1 నుంచి FASTag తప్పనిసరి: ఏమిటిది.. ఎలా?

ఫాస్ట్‌ట్యాగ్...

ఫాస్ట్‌ట్యాగ్...

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ (RFID) ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనం యొక్క విండ్ స్క్రీన్ పైన అతికించిన, రీలోడ్ చేయగల ట్యాగ్. దీంతో టోల్ గేట్ వద్ద టోల్ ఛార్జీ ఆటోమేటిక్‌గా డిజిటల్ రూపంలో డిడక్ట్ అవుతుంది.

టోల్ ప్లాజాల వద్ద ప్రయాణీకులు అగి టోల్ చెల్లించవలసిన అవసరం ఉండదు. దీంతో సమయం ఆదా అవుతుంది. ట్రాఫిక్ నిలిచిపోకుండా ఉంటుంది. వాహనాల ఇంధనం ఆదా అవుతుంది.

క్యాష్ బ్యాక్

క్యాష్ బ్యాక్

ఫాస్ట్‌ట్యాగ్ వంటి సులభ చెల్లింపులను ప్రోత్సహించేందుకు డిసెంబర్ 1వ తేదీ నుంచి క్యాష్ బ్యాక్ వంటి ప్రోత్సాహకాలు అందించనున్నారు. వివిధ బ్యాంకులు వివిధ రకాల ఆఫర్లు ఇస్తున్నాయి. బ్యాంకు బ్రాంచీకి వెళ్లి లేదా ఆన్ లైన్ ద్వారా పాస్ట్‌ట్యాగ్ పొందవచ్చు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో టోల్ ప్లాజాల వద్ద జరిపే అన్ని ఫాస్ట్‌ట్యాగ్స్ ట్రాన్సాక్షన్లపై 2.5 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

ఎప్పటికప్పుడు సమాచారం

ఎప్పటికప్పుడు సమాచారం

క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వాటితో ఫాస్ట్‌ట్యాగ్‌ను డబ్బుతో మళ్లీ రీలోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. క్యాష్ బ్యాక్ కాకుండా కొన్ని బ్యాంకులు రూ.1 లక్ష వరకు యాక్సిడెంటల్ డెత్ కవర్ అందిస్తున్నయి. వెహికిల్ నడుపుతున్న డ్రైవర్లకు ఇది వర్తిస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ సమాచారం కస్టమర్ మొబైల్ నెంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి వస్తుంది.

English summary

వాహనదారులకు శుభవార్త: డిసెంబర్ 1 నుంచి ట్రాన్సాక్షన్‌పై క్యాష్‌బ్యాక్ | From December 1, enjoy cashbacks as you zoom past toll plazas

To reduce the bottlenecks at toll plazas, Ministry of Road Transport & Highways (MoRTH) for National Highways has issued a directive that from December 1, payments at toll plazas on national highways will be accepted digitally through FASTag only.
Story first published: Tuesday, November 19, 2019, 16:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X