For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జనవరి 1న రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీ చేతికి రూ.8.67 లక్షలు!

|

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. అయితే లక్కు తగిలితే మాత్రం మనం ఇన్వెస్ట్ చేసిన దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది. తక్కువ రిటర్న్స్ వచ్చినా పర్వాలేదు, కానీ సురక్షిత పెట్టుబడి కోసం మొగ్గు చూపేవారు పోస్టాఫీస్ స్కీమ్‌లు, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, ప్రభుత్వ పథకాలైన ఈపీఎఫ్ స్కీం తదితర వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్. అందుకే వీటిలో ఇన్వెస్ట్ చేసే సమయంలో మనం పెట్టే స్టాక్ చరిత్ర, ఆ స్టాక్ గత మూడు నెలల నుండి ఆరు నెలల కాలవ్యవధిలో ఎలా పని చేసింది, ఆ స్టాక్ బిజినెస్ ఫ్యూచర్ ప్లాన్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి.

తొమ్మిది రెట్ల లాభాలు

తొమ్మిది రెట్ల లాభాలు

2022 క్యాలెండర్ ఏడాది ప్రారంభమై అప్పుడే దాదాపు మూడు నెలలు అవుతోంది. ఈ కాలంలో కరోనా కొత్త వేరియంట్స్‌తో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం మార్కెట్ పైన తీవ్రంగా కనిపించింది. అందుకే దాదాపు గత మూడు నాలుగు వారాలుగా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అయితే వారం క్రితం రెండు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో మార్కెట్ పుంజుకుంది. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో దాదాపు 55 రోజులు మార్కెట్ రన్ అయింది. ఈ కాలంలో పలు స్టాక్స్ భారీగా నష్టపోగా, కొన్ని స్టాక్స్ లాభాలు ఇచ్చాయి. అయితే 2022లో అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ మాత్రం కొన్ని ఉన్నాయి. ఇలాంటి మల్టీబ్లాగర్‌లో శాంతి ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ఉంది. ఈ స్టాక్ కేవలం 55 సెషన్‌లలో దాదాపు ఎనిమిది రెట్ల లాభాలను అందించింది.

రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.8.30 లక్షలు

రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.8.30 లక్షలు

మీరు జనవరి 1, 2022లో కనుక ఈ స్టాక్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇప్పుడు మీ చేతికి రూ.8.3 లక్షలు వచ్చి ఉండేవి. కేవలం రెండున్నర నెలల కాలంలో రూ.7 లక్షలకు పైగా రిటర్న్స్ వచ్చేవి. ఈ రోజు మధ్యాహ్నం గం.1.30 సమయానికి ఈ స్టాక్ దాదాపు ఐదు శాతం ఎగిసి రూ.867.80 వద్ద ట్రేడ్ అయింది. 2022 క్యాలెండర్ ఇయర్ ప్రారంభం నుండి 767 శాతం, నెల రోజుల్లో 85 శాతం ఎగిసిపడింది. రూ.100 ఇన్వెస్ట్ చేస్తే రూ.867 చేతికి వచ్చేవి. బాంబే ఎక్స్చేంజ్‌లో లిస్ట్ చేయబడిన ఈ కంపెనీ ప్లేస్కూల్ నుండి గ్రేడ్ 12 వరకు విద్యాసంస్థలను నిర్మించేందుకు, నిర్వహించడానికి పరిష్కారాలను అందిస్తుంది.

రూ.100 నుండి రూ.860కి

రూ.100 నుండి రూ.860కి

2022 జనవరి 1న ఈ స్టాక్ రూ.99.95 వద్ద ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం మార్చి 15న రూ.787 వద్ద ముగిసింది. అయితే ఈ రెండు సెషన్‌లలో మరింత ఎగబాకి రూ.867కి ఎగబాకింది. అంటే ఇది 760 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో ఇదే రంగంలోని జీ-లర్న్స్ లిమిటెడ్ మాత్రం 20 శాతం క్షీణించింది.

English summary

జనవరి 1న రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీ చేతికి రూ.8.67 లక్షలు! | From ₹100 to ₹830: This multibagger stock delivered 8x returns in 2022

In just 51 sessions, this education stock has given a massive return of around 700% to its shareholders.
Story first published: Thursday, March 17, 2022, 13:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X