నిల్ జీఎస్టీ రిటర్న్స్‌ను ఎస్సెమ్మెస్ ద్వారా ఫైల్ చేసే కొత్త సౌకర్యాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం(జూన్ 30) ప్రారంభించారు. తమ తమ రిజిస్టర్డ్ మొబైల్స్ ద్వారా ఎస్సెమ్మెస్ పంపించడం ద్వారా జీఎస్టీ ట్యాక్స్ పేయర్స్ రిటర్న్స్‌ను దాఖలు చేయవచ్చు. ఈ మేరకు నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.
జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు 66 కోట్లకు పైగా జీఎస్టీ ఫైల్ అయినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2017 జూలై 1వ తేదీన జీఎస్టీ నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వరుస ట్వీట్లు చేశారు. పన్ను చెల్లింపుదారులు, వినియోగదారులకు జీఎస్టీ స్నేహపూరితంగా ఉందనే భావన అందరిలో ఉందని పేర్కొంది.

ఫోర్ ఇయర్ జీఎస్టీ అనే హ్యాష్ ట్యాగ్‌తో మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. జీఎస్టీతో ప్రజలు చెల్లించే పన్ను రేటు 13.5 శాతం నుండి 11.6 శాతానికి తగ్గిందని తెలిపింది. ఏ రాష్ట్రంలో అయినా ఒక కంపెనీ వ్యాపారం చేయాల్సి వస్తే 495 రకాల పత్రాలు సమర్పించవలసి వచ్చేదని, ఇప్పుడు ఆ సంఖ్య 12కు దిగి వచ్చిందని పేర్కొంది.
జీఎస్టీతో దేశాన్ని ఒకే మార్కెట్‌గా మలచడం సాధ్యపడిందని వెల్లడించింది. ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తదితర 17 రకాల పన్నులు, మరో 13 రకాల సెస్‌లను ఏకం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా జీఎస్టీ ప్రారంభమైంది. ఇప్పటివరకు జీఎస్టీ 1.3 కోట్ల పన్ను చెల్లింపుదారులు నమోదైనట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications