Flipkart Big Billion Days Sale: మంచి ఆఫర్లు, కొత్త ఫోన్స్ లాంచింగ్స్

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021తో ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ మధ్య సరికొత్త ఫోన్స్‌ను కూడా లాంచ్ చేస్తోంది. దసరా పర్వదినం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ నిర్వహించనున్న అతిపెద్ద సేల్ ఇది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఆసుస్ రోగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ పైన రూ.12,000 డిస్కౌంట్‌ను ప్రకటించింది.

శాంసంగ్, పోకో, ఒప్పో, రియల్‌మి, వివో, మోటరోలా తదితర సంస్థలు ఈ సందర్భంగా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. 'బిగ్ డిస్కౌంట్స్, కొత్త లాంచింగ్స్, గేమ్స్, రివార్డ్స్, మరెన్నో.. వాటితో ఇప్పుడు భారత్ అంతా ఫ్లిప్ చేయనుంది. ఫ్లిప్ కార్డ్ బిగ్ బిలియన్ డే సేల్ త్వరలో వస్తోంది' అని ట్వీట్ చేసింది. వివిధ డీల్స్‌ను వరుసగా రివీల్ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్.

Flipkart Big Billion Days Sale 2021: Samsung, Motorola, Realme, Vivo to launch new phones

రియల్‌మీ నార్జో 50 సిరీస్ మొట్టమొదటి అతిపెద్ద లాంచ్. సెప్టెంబర్ 24న దీనిని లాంచ్ చేస్తున్నారు. ఒప్పో, శాంసంగ్ కూడా తమ తమ కొత్త డివైస్‌లను వరుసగా సెప్టెంబర్ 27, సెప్టెంబర్ 28న లాంచ్ చేస్తున్నాయి. పోకో, వివోలు సెప్టెంబర్ 30న తమ డివైస్‌లను లాంచ్ చేస్తుండగా, లాస్ట్లీ, మోటరోలాలు అక్టోబర్ 1న కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకు వస్తున్నాయి.

రియల్‌మి నార్జో 50 సిరీస్ సెప్టెంబర్ 24న మధ్యాహ్నం గం.12.00కు ప్రారంభమవుతుంది. శాంసంగ్ కూడా గెలాక్సీ M52 5Gని సెప్టెంబర్ 28న మధ్యాహ్నం గం.12.00కు లాంచ్ చేస్తోంది. ఈ డివైస్ అమెజాన్ ఇండియాలో కూడా లాంచ్ చేస్తోంది. ఒప్పో ఏ55, ఒప్పో ఎఫ్19ఎస్ కూడా లాంచ్ అవుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కానీ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

వివో ఎక్స్ 70 సిరీస్ భారత్‌లోకి త్వరలో రానుంది. పోకో ఎక్స్3జీడీ ఫోన్ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేశారు. కాబట్టి మోటరోలా కొత్త ఫోన్‌ను తీసుకువస్తుందా చూడాలి. అయితే మోటో ట్యాబ్ 8 కొత్త ట్యాబ్‌ను, టీవీని తీసుకు వస్తుందని తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+