ఫ్లాట్ బెటరా? భూమి బెటరా? ఏది మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తుందో తెలుసుకోండి?

ఇల్లు కొంటే బాగుంటుందా? లేక భూమి కొంటే బాగుంటుందా? ఈ ప్రశ్న ప్రతి మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే దశ. ఒకవైపు ఫ్లాట్ అంటే రెడీ టు మూవ్, సదుపాయాలు అన్నీ ఒకేచోట ఉంటుంది. కానీ మరోవైపు అప్పు భారంతో బతకాల్సిన పరిస్థితి. ఇక ప్లాట్ అయితే కాస్త కష్టమే అయినా, లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభాలు ఉండొచ్చు. ఇదే విషయాన్ని చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ సింపుల్‌గా ఒక ఉదాహరణతో వివరించారు.

ఇప్పుడు CA కౌశిక్ చెప్పిన రెండు పరిస్థితులపై ఒకసారి ఆలోచిద్దాం. మొదటి పరిస్థితిలో ఒక వ్యక్తి డైరెక్ట్‌గా ఫ్లాట్ కొనుగోలు చేస్తే నెల నెలా దాదాపు రూ. 35,000 EMI కడుతూ 15 ఏళ్ల పాటు ఒకే ప్రాపర్టీ మీదే దృష్టి పెట్టాలి. ఆఖరికి అతని దగ్గర ఒక రెడీ-టు-మూవ్ ఫ్లాట్ ఉంటుంది కానీ ఆ ఆ మొత్తం సమయంలో అప్పుల భారంతో, EMI ఒత్తిడిలోనే ఉండాలి.

Flat EMI vs Plot SIP Which is Better Option for Long-term Gains

రెండో పరిస్థితిలో మొదటగా, అద్దె ఇంట్లోనే ఉంటూ అద్దెకు ఎక్కువ ఖర్చు పెట్టకుండా నెలకు రూ. 10,000 మాత్రమే దాని మీద పెట్టాలి. అప్పుడు మిగిలిన డబ్బుతో ఒక ప్లాట్ EMIలో కొనుగోలు చేస్తే, దానికి నెలకు సుమారు రూ. 20,000 కడతాడు. ఇంకా చేతిలో మిగిలిన రూ. 5,000ను సింపుల్‌గా ఒక SIPలో పెట్టుబడి పెడితే సరిపోతుంది.

ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత ఫ్లాట్ కొనుగోలు చేసినవారికి ఒక ఆస్తి మాత్రమే ఉంటుంది. కానీ రెండో ప్లాన్ ఎంచుకున్నవారికి మాత్రం భూమి కూడా ఉంటుంది, అదనంగా SIP ద్వారా వచ్చిన సంపద కూడా దక్కుతుంది. అంటే, ఒక వైపు రియల్ ఎస్టేట్ గైన్, మరో వైపు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ గైన్ రెండూ కలిసొస్తాయి.

అదే 15 ఏళ్ల తర్వాత మొదటి ఆప్షన్ తీసుకున్నవారి దగ్గర ఒకే ఆస్తి ఆ ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. రెండో ఆప్షన్ ఎంచుకున్నవాడికి మాత్రం భూమి + SIP వల్ల చేరిన సంపద రెండూ ఉంటాయి. CA కౌశిక్ లెక్క ప్రకారం, నెలకు రూ. 5,000 SIPని 12% రాబడితో కొనసాగిస్తే, 15 ఏళ్ల తర్వాత దాదాపు రూ.1.2 కోట్లు చేరుతాయి. అంటే, చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా లాంగ్‌టర్మ్‌లో "కోటీశ్వరుడు మూవ్"గా మారొచ్చు.

ఫ్లాట్ మరియు ప్లాట్ మధ్య తేడాలను కాస్త ప్రాక్టికల్‌గా చూడాల్సి ఉంది. ఫ్లాట్లు వెంటనే వాడుకోవచ్చు, మోడరన్ సదుపాయాలు ఉంటాయి, రెంటల్ ఇన్‌కమ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద సమస్య ఏమిటంటే, ఫ్లాట్ కొనుగోలు చేస్తే భారీగా అప్పులు తీసుకోవాల్సి వస్తుంది, అదే విధంగా ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ కూడా తక్కువగా ఉంటుంది. మరోవైపు, భూమి కొంటే నిర్మాణంపై పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశాలు ఎక్కువ. ఇక దానికి జోడిగా చిన్న SIPలో పెట్టుబడి పెడితే, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా వస్తుంది. అంటే, ప్లాట్ + SIP ప్లాన్ తో మీరు రెండు లాభాన్ని పొందగలరు భూమి విలువ పెరుగుదల మరియు SIP ద్వారా సంపద సృష్టి.

కౌశిక్ చెబుతున్నట్లు, "రియల్ ఎస్టేట్ గేమ్‌తో పాటు ఈక్విటీలో కూడా పెట్టుబడి పెడితే, ఒకే EMIలో అంతా ఒక్క దాంట్లో పెట్టుకోవడం కన్నా చాలా స్మార్ట్. కానీ, CA ఒక చిన్నహెచ్చరిక ఇచ్చారు. రుణం, అద్దె, మరియు రాబడులు ప్రదేశాన్ని బట్టి మారవచ్చు, అందుకే ప్రతి ఒక్కరి పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఇల్లు కావాలి కాబట్టి వెంటనే ఫ్లాట్ కొనడం తప్పు కాదు. కానీ, ఫ్లాట్ EMIలోనే ఇరుక్కుపోవడం వల్ల సంపద పెరగడానికి చోటు ఉండకపోవచ్చు. ప్లాట్ + SIP కాంబినేషన్ మాత్రం దీర్ఘకాలికంగా ఎక్కువ ఫలితం ఇస్తుందనేది ఈ లాజిక్.

చిన్న మొత్తంలో SIP పెట్టుబడి కూడా మీ భవిష్యత్తును సేఫ్‌గా, స్మార్ట్‌గా మార్చగలదు. ఇల్లు కొనాలా? భూమి కొనాలా? అనేది వ్యక్తిగత పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏ ఆప్షన్ ఎంచుకున్నా, సైడ్‌లో SIP తప్పకుండా ఉంటే అది మీకు రియల్ గేమ్ చేంజర్!

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+