ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద మోస్ట్ పాపులర్ ట్యాక్స్ సేవింగ్స్ పెట్టుబడి సాధనం ఫిక్స్డ్ డిపాజిట్ (FD). ట్యాక్స్ సేవింగ్ FDs, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(NSC)ను ఇండియా పోస్ట్ ఆఫర్ చేస్తోంది. చివరి నిమిషంలోను మంచి ట్యాక్స్ సేవింగ్స్ సాధనాలుగా వీటిని భావిస్తారు ట్యాక్స్ పేయర్స్. ఏడాదికి రూ.1.50 లక్షల FD పైన పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఈ ట్యాక్స్ సేవింగ్స్ FD అయిదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌ను కలిగి ఉంటుంది. ముందస్తు ఉపసంహరణకు అవకాశం లేదు.

వడ్డీ రేటు, లాక్-ఇన్ పీరియడ్
ఈ ఫైవ్ ఇయర్ ట్యాక్స్ సేవింగ్స్ FDని ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు అందిస్తున్నాయి. అయిదేళ్ల కాలపరిమితితో కూడిన FD పైన ఈ బ్యాంకులు 5.4 శాతం నుండి 5.95 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తున్నాయి. అయితే సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా 0.50 శాతం ఉంటుంది.
ట్యాక్స్ సేవర్ FDs లాక్-ఇన్ పీరియడ్ అయిదేళ్ల నుండి పదేళ్లు ఉంటుంది. దీర్ఘకాలిక పాలసీలో ప్రారంభ అయిదేళ్ల లాక్-ఇన్ వ్యవధి ముగిసిన తర్వాత అకాల ఉపసంహరణ అనుమతించబడుతుంది. వీటిలో చాలా వరకు జాయింట్ అకౌంట్ ఆప్షన్స్‌తో వస్తాయి.

ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు?
సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కోసం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే FD సేవింగ్స్ వడ్డీ మాత్రం ట్యాక్సబుల్. బ్యాంకు టీడీఎస్‌ను తీసివేస్తుంది. టీడీఎస్‌ను నివారించేందుకు పెట్టుబడిదారు ఫామ్ 15జీ లేదా ఫామ్ 15హెచ్‌ను సమర్పించాలి. ఇటీవల జోడించిన సెక్షన్ 80టీటీబీ ప్రకారం సీనియర్ సిటిజన్స్ డిపాజిట్లపై పొందిన వడ్డీపై రూ.50,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
ట్యాక్స్ సేవర్ FD కోసం అవసరమైన డాక్యుమెంట్లు పాన్ కార్డు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆధార్ ప్రూఫ్ (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, రేషన్ కార్డు, వోటర్ ఐడీ, గవర్నమెంట్ రికగ్నైజేషన్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్(సీనియర్ సిటిజన్స్) అవసరం. అలాగే రెండు ఇటీవలి ఫోటోగ్రాఫ్స్ అవసరం.

వడ్డీ రేట్ల సవరణ
ఇదిలా ఉండగా, HDFC బ్యాంకు డొమెస్టిక్/NRO, NRE నాన్-విత్‌డ్రాబుల్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 5 జనవరి నుండి పెంచింది. కొటక్ మహీంద్రా బ్యాంకు కూడా వడ్డీ రేట్లను సవరించింది. ఏడాది కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన 5.40 శాతం వడ్డీ రేటు ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3 శాతం కనిష్టంగా, గరిష్టం 5.80 శాతం ఉంది.


Click it and Unblock the Notifications