మనం ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇచ్చే మార్గం ఏది? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. అయితే దీనికి చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ఏది బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం..
ఉదాహరణకు మీ దగ్గర ఒక రూ.1 లక్ష ఉందనుకుందాం. దీనిని వచ్చే 10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలని మీరు భావిస్తే, ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. సాంప్రదాయ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed deposit) నుండి రిస్క్ ఉన్నా ఎక్కువ లాభం ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ వరకు ఎన్నో దారులు ఉన్నాయి. అయితే ఏది మీకు సెట్ అవుతుందో ఈ చిన్న కాలిక్యులేషన్ ద్వారా తెలుసుకుందాం.

బ్యాంక్ ఎఫ్డీ (Bank FD): భరోసాతో కూడిన లాభం
చాలా మంది భారతీయులకు ఇప్పటికీ బ్యాంక్ ఎఫ్డీలే అత్యంత నమ్మకమైన మార్గం. మన దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గణాంకాలను చూస్తే, 10 ఏళ్ల కాలపరిమితి గల ఎఫ్డీలపై ప్రస్తుతం ఏడాదికి 6.5 శాతం వడ్డీ లభిస్తోంది. దీని ప్రకారం మీరు నేడు రూ.1 లక్షను ఎస్‌బీఐలో డిపాజిట్ చేస్తే, చక్రవడ్డీ (Compound Interest) ప్రయోజనంతో 10 ఏళ్ల తర్వాత మీకు రూ.1,87,714 అందుతాయి. అంటే మీకు రూ.87,714 నికర వడ్డీ లాభం వస్తుంది. అసలుకు ఎటువంటి ఢోకా ఉండకూడదు అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
పోస్ట్ ఆఫీస్ పథకం: డబ్బు నేరుగా డబుల్!
బ్యాంకుల కంటే కొంచెం ఎక్కువ వడ్డీ కావాలి, కానీ రిస్క్ మాత్రం సున్నా ఉండాలి అనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ పథకాలు అద్భుతమైన ఎంపిక. ఇందులో 'కిసాన్ వికాస్ పత్ర' (KVP) అనే స్కీమ్ చాలా పాపులర్. ప్రస్తుతం ఈ స్కీమ్ 7.5 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకం ప్రకారం మీ డబ్బు నిర్ణీత కాలంలో రెట్టింపు అవుతుంది. ప్రస్తుత రూల్స్ ప్రకారం దీని మెచ్యూరిటీ కాలం 115 నెలలు (అంటే 9 ఏళ్ల 7 నెలలు). మీరు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే, 115 నెలల తర్వాత మీకు నేరుగా రూ.2 లక్షలు లభిస్తాయి.
మ్యూచువల్ ఫండ్స్: రిస్క్ తో పాటు లాభాలు కూడా..
మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోగల సామర్థ్యం మీకు ఉంటే, మ్యూచువల్ ఫండ్స్ మించిన ఆప్షన్ మరొకటి లేదు. దీర్ఘకాలిక పెట్టుబడుల మీద మ్యూచువల్ ఫండ్స్ సగటున 12 శాతం వరకు వార్షిక రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ 12 శాతం లెక్కన చూసుకుంటే.. మీ రూ.1 లక్ష పెట్టుబడి 10 ఏళ్ల తర్వాత ఏకంగా రూ.3,10,585 అవుతుంది. అంటే కేవలం లాభమే రూ.2,10,585 వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ రిటర్న్స్ మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇవి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
మీకు ఏది సరైనది?
ఈ మూడింటిలో ఏది ఎంచుకోవాలనేది మీ అవసరం , రిస్క్ తీసుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మీకు భారీ లాభాలు కావాలి, రిస్క్ అయినా పర్లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమం. అసలుకు భద్రత ఉండాలి, బ్యాంక్ కంటే ఎక్కువ లాభం కావాలి అనుకుంటే పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర (KVP) ఎంచుకోవచ్చు. ఒకవేళ మీకు డబ్బు భద్రతతో పాటు, లాక్-ఇన్ పీరియడ్ తక్కువగా ఉండాలి అనుకుంటే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed deposit) చేసుకోవడం మంచి నిర్ణయం. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications